ఇది కన్నులు పలికే రాగం
చిత్రం : సంగీత సామ్రాట్ (1984)
సంగీతం : రమేశ్ నాయుడు
గీతరచయిత : రాజశ్రీ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఇది కన్నులు పలికే రాగం..
ఇది ఊహలు వేసే తాళం
రెండూ కలిసిన శుభసమయం...
రెండూ కలిసిన శుభసమయం...
ఇది సంగీత నాట్యాల సంగమం
సంగమం... సంగమం... సంగమం
ఇది కన్నులు పలికే రాగం..
ఇది ఊహలు వేసే తాళం
రెండూ కలిసిన శుభసమయం...
రెండూ కలిసిన శుభసమయం...
ఇది సంగీత నాట్యాల సంగమం
సంగమం... సంగమం... సంగమం
చరణం 1 :
అనురాగానికి నీ కొనచూపు...
దిద్దెను శ్రీకరం... దిద్దెను శ్రీకరం
అనుబంధానికి నీ చిరునవ్వు...
చెరగని ప్రాకారం.. చెరగని ప్రాకారం
నీ పదలాస్యం... నా ప్రాణం
నీ గళ నాదం... నా వేదం
నింగీ నేల నిలిచేదాకా...
నీదీ నాది ఒక లోకం
ఇది కన్నులు పలికే రాగం..
ఇది ఊహలు వేసే తాళం
రెండూ కలిసిన శుభసమయం...
రెండూ కలిసిన శుభసమయం...
ఇది సంగీత నాట్యాల సంగమం
సంగమం... సంగమం... సంగమం
చరణం 2 :
నీ నర్తనలో ఒక భంగిమనై...
లయనే చిందేనా ఆ.. ఆ.. లయనే చిందేనా
నీ కీర్తనలో ఒక గమకమునై...
శృతిగా నిలిచేనా ఆ.. ఆ.. శృతిగా నిలిచేనా
ఈ చెలి వలపే చంద్రోదయం...
నీ తొలి పిలుపే అరుణోదయం
నీలో నేను కరిగే వేళా...
నిత్య వసంతం మన సొంతం
ఇది కన్నులు పలికే రాగం..
ఇది ఊహలు వేసే తాళం
రెండూ కలిసిన శుభసమయం...
రెండూ కలిసిన శుభసమయం...
ఇది సంగీత నాట్యాల సంగమం
సంగమం... సంగమం... సంగమం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి