RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
dasari narayanarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dasari narayanarao లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

11, జనవరి 2026, ఆదివారం

అంకితం నీకే అంకితం | Ankitam Neeke Ankitam | Song Lyrics | Swapna (1980)

అంకితం.. నీకే అంకితం



చిత్రం :  స్వప్న (1980)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  ఎస్ పి బాలు 


పల్లవి :


అంకితం.. నీకే అంకితం

అంకితం.. నీకే అంకితం

నూరేళ్ళ ఈ జీవితం

అంకితం.. నీకే అంకితం

ఓ ప్రియా...  ఆ... ఆ... 

ఓ ప్రియా... ఓ ప్రియా..


చరణం 1 :


కాళిదాసు కలమందు చిందు 

అపురూప దివ్య కవిత

త్యాగరాయ కృతులందు వెలయు 

గీతార్ధసార నవత

నవ వసంత శోభనా మయూఖ..

లలిత లలిత రాగ చంద్రలేఖ..


స్వరము స్వరము కలయిక లో 

ఒక రాగం పుడుతుంది

మనసు మనసు కలయిక లో 

అనురాగం పుడుతుందీ...

స్వరము స్వరము కలయిక లో 

ఒక రాగం పుడుతుంది

మనసు మనసు కలయిక లో 

అనురాగం పుడుతుంది


ఆ అనురాగం ఒక ఆలయమైతే.. ఏ.. ఏ... 

ఆ ఆలయ దేవత నీవైతే..ఏ ఏ...

ఆ ఆలయ దేవత నీవైతే..

గానం గాత్రం గీతం భావం.. 

సర్వం అంకితం


అంకితం.. నీకే అంకితం


చరణం 2 :


లోక వినుత జయదేవ శ్లోక 

శృంగార రాగ ద్వీప

భరత శాస్త రమణీయ నాద 

నవ హావ భావ రూప

స్వర విలాస హాస చతుర నయన..

సుమ వికాస భాస సుందర వదన..


నింగి నేల కలయికతో 

ఒక ప్రళయం అవుతుంది

ప్రేమ ప్రేమ కలయికతో 

ఒక ప్రణయం పుడుతుందీ...

నింగి నేల కలయికతో 

ఒక ప్రళయం అవుతుంది

ప్రేమ ప్రేమ కలయికతో 

ఒక ప్రణయం పుడుతుంది


ఆ ప్రణయం ఒక గోపురమైతే.. ఏ ఏ .. 

ఆ గోపుర కలశం నీవైతే.. ఏ ఏ ..

ఆ గోపుర కలశం నీవైతే..

పుష్పం.. పత్రం.. ధూపం.. దీపం.. 

సర్వం అంకితం


అంకితం.. నీకే అంకితం

నూరేళ్ళ ఈ జీవితం

అంకితం... నీకే అంకితం

ఓ..ప్రియా.. ఆ.. ఆ..  

ఓ.ప్రియా.. ఓ.. ప్రియా.. 


- పాటల ధనుస్సు 



14, ఏప్రిల్ 2025, సోమవారం

ఏడంతస్తుల మేడ ఇది | Yedantastula Meda Idi | Song Lyrics | Yedantastula Meda (1980)

ఏడంతస్తుల మేడ ఇది



చిత్రం: ఏడంతస్తుల మేడ (1980) 

సంగీతం: చక్రవర్తి 

గీతరచయిత: వేటూరి 

నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 


ఏడంతస్తుల మేడ ఇది..

వడ్డించిన విస్తరిది 

ఏడంతస్తుల మేడ ఇది..

వడ్డించిన విస్తరిది 

ఏమీ లేక ఉన్నదొక్కటే... 

నాకు మీరు.. మీకు నేను 

నాకు మీరు.. మీకు నేనూ.... 


చరణం 1: 


పడుచుతనపు ఉడుకును కలిపి.. 

గంజి నీళ్ళు తాగిస్తుంటే 

కుర్ర వలపు వర్రతనంతో.. 

మిరపకాయ తినిపిస్తుంటే 

పడుచుతనపు ఉడుకును కలిపి.. 

గంజి నీళ్ళు తాగిస్తుంటే 

కుర్ర వలపు వర్రతనంతో.. 

మిరపకాయ తినిపిస్తుంటే 


చాప కన్న చదరే మేలని.. 

చతికిలపడి అతుకుతు ఉంటే 

ఒదిగి ఒదిగి ఇద్దరమొకటై నిదరనే.. 

ఏయ్ నిదరనే 

నిదరపొమ్మంటుంటే ఏ ఏ ఏ... 

వెన్నెల మల్లెల మంచమిది.. 

ఎన్నో జన్మల లంచమిది 

మూడు పొద్దులు ముద్దు ముచ్చటే.. 

నాకు మీరు .. మీకు నేను 

నాకు మీరు మీకు నేనూ..... 


ఏడంతస్తుల మేడ ఇది..

వడ్డించిన విస్తరిది 


చరణం 2: 


పాయసాన గరిటై తిరిగే... 

పాడు బతుకులెందుకు మనకు 

పాలలోన నీరై కరిగే.. 

బంధమొకటి చాలును కడకు 

పాయసాన గరిటై తిరిగే... 

పాడు బతుకులెందుకు మనకు

పాలలోన నీరై కరిగే... 

బంధమొకటి చాలును కడకు 


చావు కన్నా బ్రతుకే మేలని.. 

తెలిసి కలిసి మసులుతు ఉంటే 

ప్రేమకన్న పెన్నిధి లేదని తెలుసుకో.. 

ఏయ్ తెలుసుకో 

మనసు నీదంటుంటే ఏ ఏ ఏ... 


ఎండ వానల ఇల్లు ఇది..

ఎండని పూపొదరిల్లు ఇది 

రేయి పగలు ఆలు మగలే... 

నాకు మీరు.. మీకు నేను 

నాకు మీరు మీకు నేనూ... 


ఏడంతస్తుల మేడ ఇది..

వడ్డించిన విస్తరిది 

ఏమీ లేక ఉన్నదొక్కటే... 

నాకు మీరు.. మీకు నేను 

నాకు మీరు.. మీకు నేనూ....


- పాటల ధనుస్సు 


25, ఫిబ్రవరి 2025, మంగళవారం

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి | Ilaga Vachi Alaga Techi | Song Lyrics | Gorintaku (1979)

ఇలాగ వచ్చి అలాగ తెచ్చి



చిత్రం: గోరింటాకు (1979) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: శ్రీశ్రీ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


ఇలాగ వచ్చి అలాగ తెచ్చి 

ఎన్నో వరాల మాలలు గుచ్చి 

నా మెడ నిండా వేశావు 

నన్నో మనిషిని చేశావు 

ఎలాగా తీరాలి 

నీ ఋణమెలాగ తీరాలి 


తీరాలంటే దారులు లేవా 

కడలి కూడా తీరం లేదా 

అడిగినవన్నీ ఇవ్వాలీ 

అడిగినప్పుడే ఇవ్వాలీ 

అలాగ తీరాలీ 

నా ఋణమలాగ తీరాలి 


చరణం 1: 


అడిగినప్పుడే వరమిస్తారు.. 

ఆకాశంలో దేవతలు 

అడగముందే అన్నీ ఇచ్చే.. 

నిన్నే పేరున పిలవాలీ 

నిన్నే తీరున.. కొలవాలీ 


అసలు పేరుతో నను పిలవద్దు 

అసలు కన్నా వడ్డీ ముద్దు 

ముద్దు ముద్దుగా ముచ్చట తీర 

పిలవాలీ.. నను కొలవాలీ 


అలాగ తీరాలీ.. 

నా ఋణమలాగ తీరాలీ 


చరణం 2: 


కన్నులకెన్నడూ కనగరానిది 

కానుకగా నేనడిగేదీ 


అరుదైనది నీవడిగేది 

అది నిరుపేదకెలా దొరికేది 

ఈ నిరుపేదకెలా దొరికేది 


నీలో ఉన్నది.. నీకే తెలియదు 

నీ మనసే నే కోరుకున్నది 


అది నీకెపుడో ఇచ్చేశానే 

నీ మదిలో అది చేరుకున్నదీ 


ఇంకేం?... 

ఇలాగ తీరిందీ.. 

మన ఋణమిలాగ తీరింది 

ఇలాగ తీరిందీ.. 

మన ఋణమిలాగ తీరింది


- పాటల ధనుస్సు 


గోరింట పూచింది కొమ్మలేకుండా | Gorinta Poochindi Kommalekunda | Song Lyrics | Gorintaku (1979)

గోరింట పూచింది కొమ్మలేకుండా



చిత్రం: గోరింటాకు (1979) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: దేవులపల్లి 

నేపధ్య గానం: సుశీల 


పల్లవి: 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 

గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 

ఎంచక్కా పండిన ఎర్రని చుక్క 

చిట్టీపేరంటానికి కలకాలం రక్ష 


చరణం 1: 


మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 

మామిడీ చిగురెరుపు మంకెన పువ్వెరుపు 

మణులన్నింటిలోన మాణిక్యం ఎరుపు 

సందే వన్నెల్లోన సాగే మబ్బెరుపు 

తానెరుపు అమ్మాయి తనవారిలోన.. 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది 


చరణం 2: 


మందారంలా పూస్తే 

మంచి మొగుడొస్తాడు 

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 

మందారంలా పూస్తే 

మంచి మొగుడొస్తాడు 

గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు 

సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా 

అందాల చందమామ 

అతనే దిగివస్తాడు 


చరణం 3: 


పడకూడదమ్మా పాపాయి మీద 

పాపిష్టి కళ్ళు కోపిష్టి కళ్ళు 

పాపిష్టి కళ్ళల్లో పచ్చాకామెర్లు 

కోపిష్టి కళ్ళల్లో కొరివిమంటల్లు 


గోరింట పూచింది కొమ్మలేకుండా 

మురిపాల అరచేత మొగ్గ తొడిగింది


- పాటల ధనుస్సు 


11, మార్చి 2024, సోమవారం

సన్నజాజి సెట్టు కింది సలవా | Sannajaji chettukinda | Song Lyrics | Brahmaputrudu (1988)

సన్నజాజి సెట్టు కింది సలవా సలవా



చిత్రం : బ్రహ్మ పుత్రుడు (1988)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి నారాయణరావు 

నేపధ్య గానం : బాలు, సుశీల   


పల్లవి :


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ

సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ


దాని వయ్యారి రూపమెంత నడవా

అది గోదారి మీద గూటి పడవా

దాని తోడుంటే నాకు ఏం తక్కువ


ఓ..ఓ.. సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

చిన్నాడి చేతికేమో చొరవ

సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

చిన్నాడి చేతికేమో చొరవ


ఆడి ముద్దుకుంది ముత్యమంత విలువా

ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా

ఆడి కౌగిళ్ళకొస్తే ఎంత మక్కువ

 

చరణం 1 :


సందేళ్ళ నింగిలోన సుక్కపొడిచి..

దాన్ని సందిళ్ళలోన ఈడు నిక్కబొడిచి


పిల్ల గాలి పైటలాగి పక్క పరిచి

అహ.. లేతలేత దాని మీద పూలు పరచి


దాని సోకు చూడగానే మైమరచి

నీడలాగ వెంటపడిపోదలచి 


అందాలు ఇచ్చుకుంటా ఆకు మడచి

ఓహ్.. సందిళ్ళకొచ్చిపోరా మావా

గున్నమావితోటలోకి కన్నెపిల్ల రావే


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

చిన్నాడి చేతికేమో చొరవ


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ


ఆడి ముద్దుకుంది ముత్యమంత విలువా

ఆడు ఉంటాడమ్మ గుండెలోన నిలవా

దాని తోడుంటే నాకు ఏం తక్కువ


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ


చరణం 2 :


కాశ్మీర  లోయవంటి కన్నె సొగసు

కవ్వింత పూలు జల్లె ఉన్నవయసు


కన్యాకుమారి మీద నాకు మనసు

కంటిపాపాయి ఏమందో నాకు తెలుసు


మంచుపూల పందిరేసే మాఘమాసం

మాపటేలకొచ్చాను నీకోసం


నల్లమబ్బు చీకటొచ్చె మనకోసం

నాటాలి ముద్దుతో సందేశం

గంగదాటి పోయింది చేను కూడా మావా


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

చిన్నాడి చేతికేమో చొరవ 


దాని వయ్యారి రూపమెంత నడవా

అది గోదారి మీద గూటి పడవా


ఆడి కౌగిళ్ళకొస్తే ఎంత మక్కువ

సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

సిన్నమ్మకెందుకింత గొడవ


సన్నజాజి సెట్టు కింది సలవా సలవా

చిన్నాడి చేతికేమో చొరవ


పాటల ధనుస్సు 


13, అక్టోబర్ 2023, శుక్రవారం

ఆకాశదేశానా ఆషాడమాసానా | Akasa desana Ashada masana | Song Lyrics | Meghasandesam (1982)

ఆకాశదేశానా..  ఆషాడమాసానా



చిత్రం :  మేఘసందేశం (1982)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  ఏసుదాసు



పల్లవి:


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా

విరహమో.. దాహమో.. 

విడలేని మోహమో..

వినిపించు నా చెలికి 

మేఘసందేశం.. మేఘసందేశం..


చరణం 1:


వానకారు కోయిలనై.. 

తెల్లవారి వెన్నెలనై

వానకారు కోయిలనై.. 

తెల్లవారి వెన్నెలనై

ఈ ఎడారి దారులలో 

ఎడద నేను పరిచానని.. 

కడిమివోలె నిలిచానని

ఉరమని తరమని ఊసులతో 

ఉలిపిరి చినుకుల బాసలతో..

విన్నవించు నా చెలికి విన్న వేదనా.. 

నా విరహ వేదనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా


చరణం 2:


రాలుపూల తేనియకై 

రాతిపూల తుమ్మెదనై

రాలుపూల తేనియకై 

రాతిపూల తుమ్మెదనై

ఈ నిశీధి నీడలలో 

నివురులాగ మిగిలానని.. 

శిధిల జీవినైనాని

తొలకరి మెరుపుల లేఖలతో 

రుధిర భాస్పజల ధారలతో.. 

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

విన్నవించు నా చెలికి మనోవేదనా 

నా మరణయాతనా


ఆకాశదేశానా..  ఆషాడమాసానా

మెరిసేటి ఓ మేఘమా.. 

మెరిసేటి ఓ మేఘమా

విరహమో.. దాహమో.. 

విడలేని మోహమో..

వినిపించు నా చెలికి 

మేఘసందేశం.. మేఘసందేశం..


పాటల ధనుస్సు 




18, జూన్ 2023, ఆదివారం

ఉదయకిరణ రేఖలో | Udayakirana Rekhalo | Song Lyrics | Srivari Muchatlu (1981)

ఉదయకిరణ రేఖలో



చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు, జానకి      



పల్లవి :


ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో

ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో

పాడినదీ... ఒక రాధిక... 

పలికినదీ.. రాగ మాలిక

ఇదే.. ఇదే.. ఇదే... 

నా అభినందన గీతికా


ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో


చరణం 1 :


కాశ్మీర అందాలు 

బాలభారతి నుదుట 

తిలకాలు దిద్దగా

పురివిప్పు నాట్యాలు 

నాట్యభారతి పాదాల 

పారాణి అద్దగా


అడుగుల అడుగిడి 

స్వరమున ముడివడి 

అడుగే పైబడి మనసే తడబడి

మయూరివై కదలాడగా... 

వయ్యారివై నడయాడగా

ఇదే...  ఇదే...  ఇదే...  

నా అభినందన గీతికా 


ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో


చరణం 2 :


పయనించు మేఘాలు 

నిదురించు సృష్టినే 

మేలుకొలుపగా

రవళించు మువ్వలు 

నటరాజు ఆశీస్సుకై 

హారతివ్వగా

స్వరమున స్వరమై 

పదమున పదమై పదమే 

స్వరమై స్వరమే వరమై


దేవతవై అగుపించగా... 

జీవితమే అర్పించగా

ఇదే... ఇదే... ఇదే... 

నా అభినందన గీతికా


ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో

ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో

పాడినదీ... ఒక రాధిక... 

పలికినదీ.. రాగ మాలిక

ఇదే.. ఇదే.. ఇదే... 

నా అభినందన గీతికా


ఉదయకిరణ రేఖలో... 

హృదయ వీణ తీగలో


పాటల ధనుస్సు 


12, జూన్ 2023, సోమవారం

సూర్యునికొకటే ఉదయం | Suryunikokate Udayam | Song Lyrics | Srivari Muchatlu (1981)

సూర్యునికొకటే ఉదయం



చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం :  బాలు, సుశీల     



పల్లవి :



సూర్యునికొకటే ఉదయం.. 

మనిషికి ఒకటే హృదయం

సూర్యునికొకటే ఉదయం.. 

మనిషికి ఒకటే హృదయం


ఆ ఉదయం ఎందరిదో.. 

ఈ హృదయం ఎవ్వరిదో

సూర్యునికొకటే ఉదయం.. 

మనిషికి ఒకటే హృదయం  


చరణం 1 : 


చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. 

వారధి... ఆ ఉదయం

ప్రేమ పోకకు త్యాగం రాకకు .. 

సారధి... ఈ హృదయం

చీకటి పోకకు.. వెలుతురు రాకకు.. 

వారధి ఆ ఉదయం 

ప్రేమ పోకకు త్యాగం రాకకు .. 

సారధి ఈ హృదయం

అది వెలిగే ఉదయం.. 

ఇది కరిగే హృదయం


ఆ ఉదయం ఎందరిదో.. 

ఈ హృదయం ఎవ్వరిదో

సూర్యునికొకటే ఉదయం.. 

మనిషికి ఒకటే హృదయం



చరణం 2  : 


జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. 

ఒకటే ఆకాశం

కలలు తీరినా.. కథలు చెరిగినా.. 

ఒకటే అనురాగం... 


జాబిలి విరిసినా.. భానుడు వెలిసినా.. 

ఒకటే ఆకాశం

కలలు తీరినా.. కథలు చెరిగినా.. 

ఒకటే అనురాగం...


అది మారని ఆకాశం... 

ఇది మాయని అనురాగం..

ఆకాశం ఎందరిదో.. 

అనురాగం ఎవ్వరిదో...

సూర్యునికొకటే ఉదయం.. 

మనిషికి ఒకటే హృదయం

ఆ ఉదయం ఎందరిదో.. 

ఈ హృదయం ఎవ్వరిదో


పాటల ధనుస్సు  


11, జూన్ 2023, ఆదివారం

తూరుపు తెలతెల వారగనే | Toorupu Tela tela varagane | Song Lyrics | Srivari Muchatlu (1981)

తూరుపు తెలతెల వారగనే



చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం : సుశీల     



పల్లవి :


తూరుపు తెలతెల వారగనే.. 

తలుపులు తెరిచి తెరవగనే

తూరుపు తెలతెల వారగనే.. 

తలుపులు తెరిచి తెరవగనే


చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..

తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..

శ్రీవారి ముచ్చట్లు.. శ్రీ శ్రీవారి ముచ్చట్లు..

శ్రీవారి ముచ్చట్లు.. నీ శ్రీవారి ముచ్చట్లు..



చరణం 1 :


కలగన్న మొదటి రాత్రికి.. 

తలుపు తెరచే వేళ ఇది

వలదన్న ఒంటి నిండా.. 

సిగ్గులొచ్చే వేళ ఇది..


బెదురు చూపుల కనులతో... 

ఎదురు చూడని వణుకులతో...

బెదురు చూపుల కనులతో... 

ఎదురు చూడని వణుకులతో..

రెప్పలార్పని ఈ క్షణం... 

సృష్టికే మూలధనం

తెప్పరిల్లిన మరుక్షణం... 

ఆడదానికి జన్మఫలం..

ఆడదానికి జన్మఫలం... 



తూరుపు తెలతెల వారగనే.. 

తలుపులు తెరచి తెరవగనే

చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..

తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు.. 



చరణం 2  : 


ఇన్నాళ్ళ మూగనోముకు... 

మనసు విప్పే వేళ ఇది..

ఇన్నేళ్ళ కన్నెపూజకు... 

హారతిచ్చే చోటు ఇది..


మల్లెపందిరి నీడన... 

తెల్లపానుపు నడుమన

మల్లెపందిరి నీడన... 

తెల్లపానుపు నడుమన

ఎదురు చూసిన ఈ క్షణం.. 

మరువలేని అనుభవం..

మరచిపోనీ ఈ స్థలం...  

ఆడదానికి ఆలయం...

ఆడదానికి ఆలయం... 


తూరుపు తెలతెల వారగనే.. 

తలుపులు తెరచి తెరవగనే

చెప్పాలమ్మ శ్రీవారి ముచ్చట్లు..

తెలపాలమ్మ నువ్వు పడ్డా అగచాట్లు..


పాటల ధనుస్సు  


8, జూన్ 2023, గురువారం

ఆకాశం ముసిరేసింది | Akasam Musuresindi | Song Lyrics | Srivari Muchatlu (1981)

ఆకాశం ముసిరేసింది



చిత్రం :  శ్రీవారి ముచ్చట్లు (1981)

సంగీతం :  చక్రవర్తి

గీతరచయిత :  దాసరి

నేపధ్య గానం : బాలు, సుశీల     



పల్లవి :


ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..

ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..


ముసుగులో పువ్వులు రెండు...

ముసుగులో పువ్వులు రెండు...


ఆడుకుంటున్నాయి... పాడుకుంటున్నాయి...

ఆడి పాడి కిందా మీదా...  పడిపోతున్నాయి..  


హా..హా..హా..హ...

హా... ఆకాశం ముసిరేసింది... 

ఊరంతా ముసుగేసింది.. 


చరణం 1 :


తొలకరి జల్లుల చినుకులలో... హా...

గడసరి చినుకుల తాకిడిలో... హా..

మగసిరి గాలుల సైగలలో... హా..

ఊపిరి సలపని కౌగిలిలో... హా...


చెట్టాపట్టాలెసుకొని.. చెట్టుల చాటుకు వస్తే..

పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే...

పిట్టలు కూతలు కూస్తే.. తలపై పువ్వులు పడితే...

మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. 

బాజాలెందుకు? భజంత్రీలెందుకు?

హా... ఎందుకు?


హోయ్... హోయ్.. ఆకాశం ముసిరేసింది... 

ఊరంతా ముసుగేసింది.. 



చరణం 2 :




చిరుచిరు నవ్వుల పెదవులపై.. హా...

కురిసి కురవని ముద్దులలో.. హా...

చిరు చిరు చెమటల బుగ్గలపై... హా..

తెలిసి తెలియని సిగ్గులలో... హా..


బుగ్గా బుగ్గ కలుసుకొని.. సిగ్గుల పానుపులేస్తే...

పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే...

పెదవి పెదవి కలుసుకొని.. ముద్దుల రాగం తీస్తే...


మంత్రాలెందుకు? తలంబ్రాలెందుకు?.. 

బాజాలెందుకు? భజంత్రీలెందుకు?

ఛా... ఎందుకు? 






ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..

ఆ... ఆకాశం ముసిరేసింది... ఊరంతా ముసుగేసింది..

ముసుగులో పువ్వులు రెండు...

ముసుగులో పువ్వులు రెండు...

ఆడుకుంటున్నాయి.. పాడుకుంటున్నాయి...

ఆడి పాడి కిందా మీదా పడిపోతున్నాయి..  



హోయ్..ఆకాశం ముసిరేసింది... 

హా.. ఊరంతా ముసుగేసింది..

ఆ.. ఆకాశం ముసిరేసింది... 

ఆ.. ఊరంతా ముసుగేసింది..


పాటల ధనుస్సు  


4, జూన్ 2023, ఆదివారం

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో | Oka devuni Odilo | Song Lyrics | Premabhishekam (1981)

ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో

నిదురించే అనురాగం కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం


ఒక దేవత గుడిలో..  ఒక దేవుని ఒడిలో

నిదురించే అనురాగం...  కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం


చరణం 1:


మరులు పూచిన పూలపందిరిలో.. 

మమతలల్లిన ప్రేమ సుందరికీ... 

పట్టాభిషేకం... పట్టాభిషేకం


మనసు విరిచినా మనసు మరువనీ 

మధుర జీవిత మానవమూర్తికి

మంత్రాభిషేకం... మంత్రాభిషేకం


రాగాల సిగలో.. అనురాగాల గుడిలో ...

భావాలబడిలో.. అనుభవాల ఒడిలో ...

వెలసిన రాగదేవతా... రాగాభిషేకం

వెలసిన ప్రేమవిజేతా... ప్రేమాభిషేకం


ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం


ఒక దేవుడి గుడిలో ఒక దేవత ఒడిలో

నిదురించే అనురాగం కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం ప్రేమకు పట్టాభిషేకం



చరణం 2:


కలలచాటున పెళ్ళిపల్లకిలో 

కదలివచ్చిన పెళ్ళికూతురికీ..

పుష్పాభిషేకం.. పుష్పాభిషేకం


పాట మారినా ... పల్లవి మార్చనీ 

ప్రణయలోకపు ప్రేమమూర్తికి..

స్వర్ణాభిషేకం.. స్వర్ణాభిషేకం


స్వప్నాల నింగిలో.. స్వర్గాల బాటలో...

బంగారు తోటలో.. రతనాల కొమ్మకు...

విరిసిన స్వప్న సుందరీ...  క్షీరాభిషేకం...

కొలిచినప్రేమ పూజారీ.. అమృతాభిషేకం...


ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం


ఒక దేవత  గుడిలో... ఒక  దేవుడి ఒడిలో

నిదురించే అనురాగం... కురిపించే అభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం

ప్రేమాభిషేకం... ప్రేమకు పట్టాభిషేకం


పాటల ధనుస్సు  


2, జూన్ 2023, శుక్రవారం

దేవి మౌనమా శ్రీదేవి మౌనమా | Devi Mounama Sridevi Mounama | Song Lyrics | Premabhishekam (1981)

దేవి మౌనమా శ్రీదేవి మౌనమా 



చిత్రం :  ప్రేమాభిషేకం (1981)

సంగీతం : చక్రవర్తి

గీతరచయిత : దాసరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా

దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా

నీకై జపించి జపించి తపించి తపించు 

భక్తుని పైనా

దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా

దేవి మౌనమా.. శ్రీదేవి మౌనమా


చరణం 1:


మౌన భంగము.. మౌన భంగము

భరియించదు ఈ దేవి హృదయము

ప్రేమ పాఠము.. ప్రేమ పాఠము

వినకూడదు ఇది పూజా సమయము


దేవి హృదయము విశాలము.. 

భక్తునికది కైలాసము

హే దేవి హృదయము విశాలము.. 

భక్తునికది కైలాసము

కోరిక కోరుట భక్తుని వంతు... 

అడగక తీర్చుట దేవత వంతు


ధూపం వేయుట భక్తుని వంతు... 

పాపం మోయుట దేవుని వంతు

పాపానికి మోక్షం ధూప దర్శనం... 

ఈ ప్రాణికి మోక్షం నామ స్మరణం.. 

నీ నామ స్మరణం

దేవీ... దేవీ... దేవీ... దేవీ...


దేవీ కోపమా...  శ్రీదేవీ కోపమా

దేవీ కోపమా.... శ్రీదేవీ కోపమా

నీకై జపించి జపించి తపించి తపించు 

భక్తుని పైనా

దేవీ కోపమా ... శ్రీదేవీ కోపమా


చరణం 2:


స్వామి విరహము అహోరాత్రము

చూడలేదు నీ దేవి హృదయము

దేవీ స్తోత్రము... నిత్య కృత్యము

సాగనివ్వదు.. మౌన వ్రతము


స్వామి హృదయము ఆకాశము... 

దేవికి మాత్రమే అవకాశము

స్వామి హృదయము ఆకాశము... 

దేవికి మాత్రమే అవకాశము

అర్చన చేయుట దాసుని వంతు... 

అనుగ్రహించుట దేవత వంతు


కోపం తాపం మా జన్మ హక్కు... 

పుష్పం పత్రం అర్పించి మొక్కు

నా హృదయం ఒక పూజా పుష్పం... 

నా అనురాగం ఒక ప్రేమ పత్రం.. 

నా ప్రేమ పత్రం

దేవీ .... దేవీ....  దేవీ.... దేవీ


దేవి మౌనమా ... శ్రీదేవి మౌనమా

దేవి మౌనమా...  శ్రీదేవి మౌనమా

నీకై జపించి జపించి తపించి తపించు 

భక్తుని పైనా

దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా

దేవి మౌనమా... శ్రీదేవి మౌనమా


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు