RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

29, ఏప్రిల్ 2022, శుక్రవారం

అబ్బోసి చిన్నమ్మా | Abbosi Chinnamma | Song Lyrics | Andala Ramudu (1973)

అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ



చిత్రం: అందాల రాముడు (1973)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆరుద్ర

నేపథ్య గానం: రామకృష్ణ, సుశీల 


పల్లవి :


అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ

ఎన్నెన్ని గురుతున్నాయే.. 

తలచుకొంటె గుండెలోన..  గుబులౌతుందే

అబ్బోసి చిన్నమ్మా.. ఆనాటి ముచ్చటలూ

ఎన్నెన్ని గురుతున్నాయే.. 

తలచుకొంటె గుండెలోన  గుబులౌతుందే  



అబ్బోసి చిన్నయ్యా.. ఆనాటి ముచ్చటలూ

ఎన్నైనా గురుతుంటాయీ.. 

నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ            

అబ్బోసి చిన్నయ్యా..  ఆనాటి ముచ్చటలూ

ఎన్నైనా గురుతుంటాయీ.. 

నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ 



చరణం 1 :

ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె

ఎలక తోక రెండుజడలు వెనకనుండి నేలాగితె

ఉలికులికి పడేదానివే . . 

నువ్వు ఉడుక్కొని ఏడ్చేదానివే 


అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో . .  ఊ

అలాగా ఉడికిస్తే అదను చూచి నేనేమో

నెత్తి మీద మొట్టేదానినోయ్... 

నువ్వు మొట్టగానే సాచిపెట్టి కొట్టేవడినే


అబ్బోసి చిన్నమ్మా... ఆనాటి ముచ్చటలూ

ఎన్నైనా గురుతుంటాయీ.. 

నీ గుండెలోన గుర్రాలే పరుగెడుతాయీ  



చరణం 2 :



మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో...

మలిసంజవేళలో  మర్రిచెట్టు నీడలో

వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది..

వానలో చిక్కడితే వళ్ళంతా తడిసింది

పిడుగుపడితె హడలిపోయావే.. 

నన్నతుక్కుని అదుకుమున్నావే

పిడుగుపడితె హడలిపోయావే.. 

నన్నతుక్కుని అదుకుమున్నావే 


అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే

అంతకన్న ఎక్కువగా నువ్వే హడలేవులే

అదుముకుంటే విదిలించుకు . . 

పరుగుపుచ్చుకున్నావు

నాటినుండి నేటి దాక ఫికరులేకపోయావు 


వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా

వేటగాడ్నే లేడి వేటాడ వచ్చిందా 


అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . .

అబ్బోసి... చిన్నయ్య . . అబ్బోసి... చిన్నమ్మ . . 

అబ్బో. . అబ్బో . . అబ్బో . . అబ్బో


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు