మల్లె పువ్వులు పిల్ల నవ్వులు
చిత్రం: అత్తను దిద్దిన కోడలు (1972)
సంగీతం: మాస్టర్ వేణు
రచన: దాశరథి
నేపధ్య గానం: బాలు, జానకి
పల్లవి:
ఆహ...మల్లె పువ్వులు... హు..హు..
పిల్ల నవ్వులు....
మల్లె పువ్వులు... పిల్ల నవ్వులు
నీ కోసమే... నీ కోసమే ఇటు రావోయి..
రావోయి ..రాజా నా రాజా...
మల్లె పువ్వులు పిల్ల నవ్వులు
నీ కోసమే నీ కోసమే ఇటు రావోయి
రావోయి రాజా నా రాజా
చరణం 1:
ఉన్నాను చాటుగా...ఎక్కడో...
వస్తాను సూటిగా...ఎప్పుడో....
కనిపించవేలనో...అందుకే...
ఉడికింతువెందుకో.....నీ పొందుకే...
తనువంతా...గిలిగింతా...
తనువంతా...గిలిగింతా
ఈ తాపం..ఈ దాహం
ఈ తాపం..ఈ దాహం
ఆపలేను..నే ఓపలేను...
ఇక రావోయి..
రావోయి రాజా నా రాజా
మల్లె పువ్వులు..హూ.. పిల్ల నవ్వులు..హూ..
నా కోసమే...ఊ.. నీ కోసమే ఇటు రావోయి
రావోయి రాజా నా రాజా...
చరణం 2:
కన్నుల్లో మెరిసెలే...కాటుకా...
మనసుల్లో విరిసెలే...కోరికా..
ప్రేమతో పిలిచెలే..ప్రేయసి...
గోముగా అడిగెలే...కౌగిలి...
కౌగిలిలో ఊయలలు..బ్రతుకులలో కిలకిలలు
చెలరేగగా ..నా మనసూరగా...
ఇక రావేల రావేల రాణీ..నా రాణి..
మల్లె పువ్వులు...హాయ్..
పిల్లనవ్వులు ..హాయ్..
నీ కోసమే..ఉహు..నీ కోసమే...
అహ..అహా..అహా..అహ..అహా..
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి