ఎరక్కపోయి వచ్చాను
చిత్రం : ఆలుమగలు (1977)
సంగీతం : టి.చలపతిరావు
గీతరచయిత : వేటూరి
నేపథ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
చక్కని చుక్కల పక్కనా..ఉక్కిరి బిక్కిరి ఔతున్నాను
అహా..అబ్బా..అమ్మో...అయ్యో
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే నెరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
చరణం 1 :
ఒక్కరి కోసం.. నే వచ్చానూ.. నా ఒక్కడి కోసం..హే..మీరొచ్చారు
ఒక్కరి కోసం.. నే వచ్చానూ.. నా ఒక్కడి కోసం..హే..మీరొచ్చారు
ఎందరో సుందరాంగులు.. అందరికీ అభివందనాలు
ఎందరో సుందరాంగులు.. అందరికీ అభివందనాలు
ఎవరే పల్లవి పాడినా.. తానతందనా.. తానతందనా
తానెతందనా.. తానెతందనా
దాసుడి తప్పులు దండముతో సరి..తానతందనా..తానతందనా
చేసిన తప్పులు చేయను హరి హరి..తానతందనా..తానతందనా
ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను
నే నెరక్కపోయి వచ్చాను.. అబ్బా..ఇరుక్కుపోయాను
చరణం 2 :
నీ పైట రెపరెపలాడితే.. నా గుండెలు దడదడ మంటాయి
నీ గాజులు గలగల మంటే.. నా అడుగులు తడబడుతుంటాయి
నీ చూపులు చుర చుర లాడితే..నా ఎదలో మంటలు లేస్తాయి
నీ చూపులు చుర చుర లాడితే..నా ఎదలో మంటలు లేస్తాయి
మీరే ఆటలు ఆడినా...డుడుడుడూ బసవన్నా..
డుడుడుడూ బసవన్నా..దాసుడి తప్పులు దండముతో సరి..
తానతందనా..తానతందనాచేసిన తప్పులు చేయను హరి హరి..తానతందనా..తానతందనాతానతందనా..తానతందనా
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే నెరక్కపోయి వచ్చాను అబ్బా..ఇరుక్కుపోయాను
చరణం 3 :
అందరి మదిలో..పందిరివేసే..చందురుడమ్మా..ఈ జతగాడూ..
కోరికలన్నీ..గోపికలైతే..కొంటె కృష్ణుడే..హే..ఇతగాడూ..
మాట ఒకరికీ..మనసు ఒకరికీ..ఇచ్చే గడసరి మొనగాడు..
మాట ఒకరికీ..మనసు ఒకరికీ..ఇచ్చే గడసరి మొనగాడు..
ఏ..ఏ..మాయలు చేసినా..అందగాడమ్మా..
అల్లరిగున్నా..తానతందనా..తానతందనా..
దాసుడి తప్పులు దండంతో సరి..తానతందనా..తానతందనా.
చేసిన తప్పులు చేయకు ఇకమరి..తానతందనా..తానతందనా..
తానతందనా..తానతందనా
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను
నే నెరక్కపోయి వచ్చాను..ఇరుక్కుపోయాను
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి