కలిసే మనసుల తొలి గీతం
చిత్రం : చేసిన బాసలు (1980)
సంగీతం : సత్యం
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
ఓహో..ఓ..ఓహోహో..ఓ ఏహే..
ఓహోహో.ఏహేహే
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
ఆమని వలపుల కమ్మని కథ...
ఏమని తెలుపను ఎదలో సొద
రాగాలేవో నాలో రేగే...
వయ్యరాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
చరణం 1 :
అనురాగం ఆలాపనగా...
ప్రతి జన్మకు అది దీవెనగా
నే చేసిన బాసల లయలో...
శ్రుతి చేసిన వీణల జతగా
ఈ సంగమమే మన సరిగమగా...
పలికే జీవనరాగంలో
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
ఆమని వలపుల కమ్మని కథ...
ఏమని తెలుపను ఎదలొ సొద
రాగాలేవో నాలో రేగే...
వయ్యారాలే ఉయ్యాలూగే
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
చరణం 2 :
ఈ తీరని ఆవేదనలే...
ఒక తీయని ఆరాధనగా
నీ కౌగిలి నా కోవెలగా...
నా బ్రతుకే నీ హారతిగా
శృంగారంలో సింధురాలే
చిలికే సంధ్యా రాగంలో
కలిసే మనసుల తొలి గీతం....
ఎన్నో జన్మల సంగీతం
కలిసే మనసుల తొలి గీతం...
ఎన్నో జన్మల సంగీతం
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి