కండ గెలిచింది కన్నె దొరికింది
చిత్రం : భక్త కన్నప్ప (1976)
సంగీతం : ఆదినారాయణరావు/సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : రామకృష్ణ, సుశీల
పల్లవి :
కండ గెలిచింది కన్నె దొరికింది..
గుండె పొంగిందిరా హోయ్
మాత పలికింది మనువు కలిపింది..
మనసు గెలిచిందిరా
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
తప్పెట్లో తాళాలో బాజాలో జేజేలో
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
చరణం 1 :
ఆ ఆ ఆ ఆ . . ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ ఆ ఆ . . ఆ ఆ ఆ ఆ
ధిమిం ధిమిం ధిమి భేరీ ధ్వనులు...
తెలిపెనురా నా గెలుపునే
ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు...
పలికెనురా నా వలపునే
ధిమిం ధిమిం ధిమి భేరీ ధ్వనులు...
తెలిపెనురా నా గెలుపునే
ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు...
పలికెనురా నా వలపునే
అల్లె తాళ్ళ ఠంకారాలే...
అల్లె తాళ్ళ ఠంకారాలే . .
జయందొరా అని పడెనులే
నల్లత్రాచు వాలు జడలే...
ఆ పాటకూ సయ్యడెనులే
కండ గెలిచింది కన్నె దొరికింది..
గుండె పొంగిందిరా హోయ్
మాత పలికింది మనువు కలిపింది..
మనసు గెలిచిందిరా
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
చరణం 2 :
నేరేడు చెట్టుకాడ నా ఱేడు మాటేసి.. ఉయ్ . .
నేరేడు చెట్టుకాడ నా ఱేడు మాటేసి
చారెడేసి కళ్ళతోటి బారెడేసి బాణమేసి..
చారెడేసి కళ్ళతోటి బారెడేసి బాణమేసి
బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే . .
బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే
ఓయమ్మో.. ఓలమ్మో.. ఓయబ్బో .. ఓయమ్మో . .
నీ ప్రాణం తోడేస్తుంటే
ఎంతా చక్కని కన్నూ...
ఎంతా చల్లని చూపూ..
ఎంతా చక్కని కన్నూ..
ఎంతా చల్లని చూపూ
ఇంతకన్న ఇంకేమి కావాలి..
నా బతుకంతా ఇలా వుండిపోవాలి
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
హైరా మా దొరగారికి వీరగంధాలు..
సైరా మా దొరసానికి పారిజాతాలు
తప్పెట్లో... తాళాలో...
బాజాలో... జేజేలో
హైరా మా దొరగారికి వీరగంధాలు -
సైరా మా దొరసానికి పారిజాతాలు
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి