RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

20, ఏప్రిల్ 2022, బుధవారం

ఓహో తమరేనా చూడవచ్చారు | Ohu Thamarena | Ghantasala Song Lyrics | Kanne Manasulu (1966)

ఓహో తమరేనా చూడ వచ్చారు చూసే ఏం చేస్తారు



చిత్రం : కన్నెమనసులు (1966)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఘంటసాల



పల్లవి :


ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు

ఓ భామా...  అయ్యో రామా

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు



చరణం 1 :


ఆకతాయి రాలుగాయి అమ్మాయి

అంతకన్న గడుగ్గాయి అబ్బాయి

ఆకతాయి రాలుగాయి అమ్మాయి

అంతకన్న గడుగ్గాయి అబ్బాయి


మండేన ఒళ్ళు...  కొరికేవ పళ్ళు

ఎరుపెక్కె కళ్ళు...  అరికాళ్ళ ముళ్ళు

కోపాల తాపాల...  శాపాన రూపాన.. 

తొక్కేవు పరవళ్ళు..


ఓ భామా...  అయ్యో రామా

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు




చరణం 2 :



మూతిని ముడవకే ముద్దులగుమ్మా

ఆ..  ఆ...  ఆ..  ముచ్చటలాడితినే వలపుల రెమ్మా

ముసిముసి నవ్వులతో మోడీ చేతునే

ముసిముసి నవ్వులతో మోడీ చేతునే

కసిదీరా గుణపాఠం నేర్పిస్తానే


ఓ భామా...  అయ్యో రామా

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు



చరణం 3 :


కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు

చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు

కుక్కకాటు చెప్పుదెబ్బ సామెతకు

చక్కనైన మచ్చుతునక నీ బ్రతుకు

అమ్మాయిగారు ముయ్యాలి నోరు

మాతోను మీరు సరిసాటి కారు

కన్నీరు మున్నీరు కాదండి పన్నీరు... 

తగ్గాలి మీ జోరు


ఓ భామా...  అయ్యో రామా

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు

ఓహో తమరేనా చూడ వచ్చారు.. 

చూసే ఏం చేస్తారు


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు