అణువణువున హృదయం
చిత్రం : కోటికొక్కడు (1983)
సంగీతం : రాజన్-నాగేంద్ర
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..
అరచూపుల్లో అనురాగం
అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..
అరచూపుల్లో అనురాగం
చరణం 1 :
ఉదయంలా వెలిగింది ప్రేమ నీ కంటిలో
ఆ చూపే తగిలింది ప్రాణమై గుండెలో
తొలి ఋతువై విరిసింది...
ప్రేమ నీ నవ్వులో
మది మధువై పొంగింది...
వెచ్చనీ పొందులో
ఆరారూ కాలాలూ వసంతాలు శాశ్వతం
అణువణువున హృదయం...
అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం...
అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..
అరచూపుల్లో అనురాగం
చరణం 2 :
కౌగిలిలా నే వస్తే కమ్ముకో కమ్మగా...
కలలన్నీ పండించి కరిగిపో కాంతిలా
లలలలా.. లలలాలా...
లలలలా.. లలలాలా...
లలలలా.. లలలాలా...
లలలలా.. లలలాలా...
జాబిలిలా నీ వెంట ఉండిపో తోడుగా
వేసవిలో నందనమై అంటుకో జంటలా
వెన్నెల్లో మల్లెల్లా.. హా..
కుదించాలి జీవితం
అణువణువున హృదయం...
అణువణువున హృదయం
అడుగడుగున ప్రణయం...
అడుగడుగున ప్రణయం
చిరునవ్వుల్లో శ్రీరాగం..
అరచూపుల్లో అనురాగం
పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి