RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

24, ఏప్రిల్ 2022, ఆదివారం

మ్రోగింది గుడిలోని గంట | Mrogindi Gudiloni Ganta | Song Lyrics | Srimathi (1966)

మ్రోగింది గుడిలోని గంట



చిత్రం : శ్రీమతి (1966)

సంగీతం : శ్రీ నిత్యానంద్

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం : సుశీల, ఘంటసాల  


పల్లవి :


మ్రోగింది గుడిలోని గంట... 

మురిసింది హృదయాల జంట

నీలో నాలో వెలిగే ప్రేమా... 

నింపింది కిరణాల పంట




చరణం 1 : 


నా మనసే ప్రియా... నీవుండే విడిది

నాలో పొంగింది... ఆనంద జలధి


వికసించే మనోభావాలు కలిసే

వెండి పందిరిగా లోకమె వెలసే


నీవే నేనుగా... ఒకటైన చోట

నీవే నేనుగా... ఒకటైన చోట

పూచే వలపుల..తోటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... 

మురిసింది హృదయాల జంట

నీలో నాలో వెలిగే ప్రేమా... 

నింపింది కిరణాల పంట


చరణం 2 : 


ప్రేమించి..నిను సేవింతుగానా

ఇల్లాలినైనాను..ఈ ముహుర్తానా


దేవతలే చెలీ... దీవించినారూ..

ఇద్దరినొకటిగా... కావించినారూ..


ఎపుడు మనలో... ఎడబాటు లేక

ఎపుడు మనలో... ఎడబాటు లేక

బ్రతుకే పూవుల..బాటా..ఆ... ఆ 


మ్రోగింది గుడిలోని గంట... 

మురిసింది హృదయాల జంట

నీలో నాలో వెలిగే ప్రేమా... 

నింపింది కిరణాల పంట


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు