ఎందుకంటే ఏమి చెప్పను
చిత్రం: జీవన జ్యోతి (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, వాణిశ్రీ
పల్లవి :
ఎందుకంటే ఏమి చెప్పను... ..
ఏవిటంటే ఎలా చెప్పను...
ఎందుకంటే ఏమిచెప్పను ...
ఏవిటంటే ఎలా చెప్పను
సద్దుమణిగిన ఈ వేళా ...
మన మిద్దరమే వున్న వేళా
సద్దుమణిగిన ఈ వేళా...
మన మిద్దరమే వున్న వేళా
తెల్లచీర తెస్తే.... మల్లెపూలు ఇస్తే
ఎందుకంటే ఏమి చెప్పను ..
అందుకే అని ఎలా చెప్పను
చరణం 1:
" అబ్భా ఎప్పుడు అదే.."
మ్యావ్...మ్యావ్...
అందాల ఓ పిల్లీ ...
అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ...
చిన్నారి సిరిమల్లి
అందాల ఓ పిల్లీ...
అరవకే నా తల్లీ
ఇపుడిపుడే కరుణించె ...
చిన్నారి సిరిమల్లి
క్షణము దాటిందంటే ...
మనసు మారునో ఏమో ..ఆ..
క్షణము దాటిందంటే ..
మనసు మారునో ఏమో
అంతగా పనివుంటే .. ఆ పైన రావే...
దయచేసి పోవే
మ్యావ్....మ్యావ్...
ఇంతకన్న ఏమి చెప్పను...
అందుకే అని ఎలా చెప్పను
చరణం 2 :
"అబ్బా....నిద్దరొస్తుందండీ"
కొత్తగా పెళైన కోడెవయసు జంట..
కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
కొత్తగా పెళైన కోడెవయసు జంట..
కొన్నెళ్ళవరకైన నిదురే పోరాదంట
" మరి " ?
సుద్దులాడాలంట..
" మ్మ్..."
పొద్దుగడపాలంటా
" మ్మ్..."
ముద్దులాడాలంటా
" మ్మ్... "
మోజుతీరాలంటా ...ష్...
ఇంతకన్నా ఏమి చెప్పను..
ఎందుకంటే ఏవి చెప్పను
అందుకేయని ఎలా చెప్పను...
ఇంతకన్నా ఏమి చెప్పను
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి