RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

12, ఏప్రిల్ 2022, మంగళవారం

ఇల్లే ఇలలో స్వర్గమనీ | Ille Ilalo Swargamani | Song Lyrics | Illu Illalu (1972)

ఇల్లే ఇలలో స్వర్గమనీ ఇల్లాలే ఇంటికి దేవతనీ



చిత్రం :  ఇల్లు-ఇల్లాలు (1972)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  అప్పలాచార్య

నేపధ్య గానం :  బాలు,  సుశీల   



పల్లవి :


ఇల్లే ఇలలో స్వర్గమనీ 

ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ..  

నీవు ఋజువు చేశావు 


మనసే మనిషికి అందమనీ 

మగడే శ్రీమతి దైవమనీ

ఋజువు చేశావూ.. 

నీవు ఋజువు చేశావు


చరణం 1 : 


మైకమనే చీకటిలో 

మమత కోసమై వెదికాను

మైకమనే చీకటిలో 

మమత కోసమై వెదికాను

కాంతి కిరణమై కనిపించీ.. 

జీవన జ్యోతిని వెలిగించావు


అందముగా అందానికి ఒక బంధముగా

అందముగా అందానికి ఒక బంధముగా

తొలినోముల ఫలమై దొరికావు.. 

నను వీడని నీడై నిలిచావు   



ఇల్లే ఇలలో స్వర్గమనీ.. 

ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ.. 

నీవు ఋజువు చేశావు 

 

చరణం 2 :


చల్లని కన్నులలో వెలిగే వెన్నెల దీపాలూ

నా చిరునవ్వుకు ప్రాణాలు..  

మన ప్రేమకు ప్రతిరూపాలూ


నీ పెదవుల రాగములో 

విరిసే తీయని భావాలు

ఆనందానికి దీవెనలు.. 

మన అనుబంధానికి హారతులూ  


మనసే మనిషికి అందమనీ.. 

మగడే శ్రీమతి దైవమనీ

ఋజువు చేశావూ.. నీవు ఋజువు చేశావు 



చరణం 3 :


నాలో సగమై నీవే జగమై.. 

నేనే నీవుగ మారావు..

నాలో సగమై నీవే జగమై.. 

నేనే నీవుగ మారావు

మారని మనిషిని మార్చావు..  

బ్రతుకే పండుగ చేశావు


పెన్నిధివై అనురాగానికి సన్నిధివై..

కనులముందు వెలిశావు..

నా కలలకు రూపం ఇచ్చావు     


ఇల్లే ఇలలో స్వర్గమనీ.. 

ఇల్లాలే ఇంటికి దేవతనీ

ఋజువు చేశావూ..  

నీవు ఋజువు చేశావు

అహహ హాహాహాహా.. అహహ హాహాహాహా..  

లలలలాలలలా.. లలలలాలలలా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య | Gussa Rangaiah | Song Lyrics | Akali Rajyam (1980)

గుస్సా రంగయ్య కొంచం తగ్గయ్య చిత్రం: ఆకలి రాజ్యం (1980) సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ గీతరచయిత: ఆచార్య ఆత్రేయ నేపధ్య గానం: సుశీల పల్లవి: గుస్సా ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు