RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, ఏప్రిల్ 2022, శనివారం

మొరటోడు నా మొగుడు | Moratodu Naa mogudu | Song Lyrics | Secretary (1976)

మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు



చిత్రం  :  సెక్రెటరి (1976)

సంగీతం  : కె.వి. మహదేవన్

గీతరచయిత  :  ఆచార్య ఆత్రేయ

నేపథ్య గానం  :  రామకృష్ణ,  సుశీల



పల్లవి :


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు


జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి

ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

డడడడ డడడడ డడడడడా... 

డడడడ డడడడ డడడడడా


మొరటోడు నామొగుడు మోజుపడి తెచ్చాడు

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు


జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి

ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు 



చరణం 1 :


తెచ్చానే మల్లెదండా...

తురిమానే జడ నిండా

చూసుకోవె నా వలపు వాడకుండా...


నా మనసే నిండుకుండా...

అది ఉంటుంది తొణక్కుండా

నీ వలపే దానికి అండదండ...

డడడడ డడడడ డడడడడా

డడడడ డడడడ డడడడడా


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..

ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు  




చరణం 2 :


నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...

నిలబడి చూసుకుంటానందాలూ

నిగనిగలా నీకళ్ళు నిలువెత్తు అద్దాలు...

నిలబడి చూసుకుంటానందాలూ

విల్లంటి కనుబొమలు.. విసిరేను బాణాలు...

విరిగిపోవునేమొ నీ అద్దాలు

డడడడ డడడడ డడడడడా... 

డడడడ డడడడ డడడడడా



మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..

ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు 



చరణం 3 :


తమలపాకు పాదాలూ తాళలేవె కడియాలూ..

దిద్దుతానె ముద్దులతో పారాణులూ

నీ ముద్దులే మువ్వలు ఆ మోతలె నా నవ్వులూ..

ఆ పారాణికి వస్తాయి ప్రాణాలూ

డడడడ డడడడ డడడడడా

డడడడ డడడడ డడడడడా


మొరటోడు నా మొగుడు మోజుపడి తెచ్చాడు...

మువ్వన్నె జరీచీర ఇన్నాళ్ళకు

జగమొండి నా పెళ్ళాం మువ్వన్నె చీరకట్టి..

ముద్దొస్తూ ఉన్నదీ నా కళ్ళకు

డడడడ డడడడ డడడడడా...  

డడడడ డడడడ డడడడడా


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు