రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
చిత్రం : సంపూర్ణ రామాయణం (1971 ),
సంగీతం : K V మహదేవన్ ,
రచన : ఆరుద్ర,
గానం : ఘంటసాల,
పల్లవి
రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి
రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి
చరణం 1:
తాటకిని ఒక్కేటున కుల్చవంటా
శివుని విల్లు ఒక దెబ్బకే యిరిసావంటా
తాటకిని ఒక్కేటున కుల్చవంటా
శివుని విల్లు ఒక దెబ్బకే యిరిసావంటా
పరశురాముడంత వోని పారదరిమినావంటా
ఆ కథలు చెపుతుంటే విని ఓళ్ళు మరచి పొతుంటా
రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి
చరణం 2:
ఆగు బాబు ఆగు
అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా
అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంటా
నాకు తెలుసు లే
నా నావ మీద కాలు పడితే ఏమౌతుందో తంటా
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంటా
నా నావ మీద కాలు పడితే ఏమౌతుందో తంటా
దయచూపి ఒక సారి కాలు కడగనీయమంటా
మూడు ముర్తులు నువ్వు
నారయణ ముర్తి వంటా
రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి
చరణం 3:
అందరిని దరిచేర్చు మా రాజు వే
అద్దరిని చేర్చమని అడుగుతుండ వే
అందరిని దరిచేర్చు మా రాజు వే
అద్దరిని చేర్చమని అడుగుతుండ వే
నువ్వు దాట లేక కాదులే రామయ్య తండ్రి
నువ్వు దాట లేక కాదులే రామయ్య తండ్రి
నన్ను దయచూడగా వచ్చావు రామయ్య తండ్రి
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా ఓ
హై లేసో లేలో హై లేసా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి