RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sampoorna ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sampoorna ramayanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, ఏప్రిల్ 2024, శనివారం

ఠం ఠం ఠమ్మను భీషణ ధ్వనుల | Tamtammanu Bhishana | Padyam Lyrics | Sampoorna Ramayanam (1971)

రామయ తండ్రీ ఓ రామయ తండ్రీ!



చిత్రం :  సంపూర్ణ రామాయణం (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  గబ్బిట వెంకటరావు  

నేపధ్య గానం :  ఘంటసాల, మాధవపెద్ది సత్యం 


పద్యం :


ఠం ఠం ఠమ్మను భీషణ ధ్వనుల 

వింటన్ నారి సారించి,

వైకుంఠుండా రఘురామమూర్తి 

సమరోగ్రుండై విజృంభించి,

నీ కంఠంబుల్ భువి గూల్చునాడు 

తరమే కాపాడ ఫాలాక్షుకున్?

శుంఠా! మొండితనంబు మాని 

శరణంచున్ రాము ప్రార్థించరా!


పద్యం:


అరెరే దుర్మతి కోతి! చాలునిక 

ఏలా? ఈ ప్రగల్భంబులున్

గిరిరాజంబును పెల్లగించి, 

దివిజన్ గెల్చిన నా ముందు, నీ

నరుడెంత? ఆ వనచరములెంత? 

మదమెక్కిన నీవెంత?

ముక్కంటికిన్ సరిజోడైన ననున్ 

ఎదిరింప తరమే? నీ రాముకున్!


పద్యం :


కోతియే గంభీర వార్ధిని 

కుప్పిగంతుగ దాటెరా!

కోతియే రాకాసి మూకల 

కూల్చి లంకను కాల్చెరా!

కోతియే నీ కొడుకు నక్కను 

కుమ్మి యముని పంపెరా!

కోతి చేసిన పనులు చూసియు 

కోతి కోతి యటంచు నీ

పాత నోటను పల్క నీకు 

సిగ్గులేదా రావణా!



పాటల ధనుస్సు 

ఊరికే కొలను నీరు | Oorike kolanu neeru | Song Lyrics | Sampoorna Ramayanam (1971)

ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది



చిత్రం :  సంపూర్ణ రామాయణం (1971)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  దేవులపల్లి

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


ఊరికే కొలను నీరు.. 

ఉలికి ఉలికి పడుతుంది

ఓరగా నెమలి 

పింఛమార వేసుకుంటుంది


ఎందుకో ఎందుకో ప్రతి పులుగు 

యేదో చెప్పబోతుంది

వనములో చెట్టు చెట్టు 

కనులు విప్పి చూస్తుంది

ఉండుండీ నా ఒళ్ళు 

ఊగి ఊగి పోతుంది


చరణం 1 :


అదిగో రామయ్య! ఆ అడుగులు నా తండ్రివి

ఇదుగో శబరీ! శబరీ! వస్తున్నానంటున్నవి

కదలలేదు వెర్రి శబరి ఎదురు చూడలేదని

నా కోసమే నా కోసమే నడచి నడచి నడచి

నా కన్నా నిరుపేద నా మహరాజు 

పాపం అదుగో


అసలే ఆనదు చూపు.. ఆ పై ఈ కన్నీరు

తీరా దయ చేసిన నీ రూపు తోచదయ్యయ్యో

ఏలాగో.. నా రామా.. ఏదీ.. ఏదీ.. ఏదీ..

నీల మేఘమోహనము.. 

నీ మంగళ రూపము


చరణం 2 :


కొలను నడిగి తేటనీరు.. 

కొమ్మ నడగి పూల తేరు

గట్టు నడిగి.. చెట్టు నడిగి.. 

పట్టుకొచ్చిన ఫలాలు.. 

పుట్ట తేనె రసాలు


దోరవేవో కాయలేవో ఆరముగ్గినవేవో గాని

ముందుగా రవ్వంత చూసి 

విందుగా అందీయనా...

విందుగా అందీయనా


పాటల ధనుస్సు 

11, ఏప్రిల్ 2022, సోమవారం

రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి | Ramaya tandri o ramaya tandri | Song Lyrics | Sampoorna Ramayanam (1971)

రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి



చిత్రం : సంపూర్ణ రామాయణం (1971 ),

సంగీతం : K V మహదేవన్ ,

రచన : ఆరుద్ర,

గానం : ఘంటసాల,


పల్లవి 


రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి

మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి

రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి

చరణం 1:

తాటకిని ఒక్కేటున కుల్చవంటా
శివుని విల్లు ఒక దెబ్బకే యిరిసావంటా

తాటకిని ఒక్కేటున కుల్చవంటా
శివుని విల్లు ఒక దెబ్బకే యిరిసావంటా

పరశురాముడంత వోని పారదరిమినావంటా
ఆ కథలు చెపుతుంటే విని ఓళ్ళు మరచి పొతుంటా

రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి
మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి

చరణం 2:

ఆగు బాబు ఆగు
అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా
అయ్యా నే వస్తుండా బాబు నే వస్తుండా
నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంటా
నాకు తెలుసు లే
నా నావ మీద కాలు పడితే ఏమౌతుందో తంటా

నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంటా
నా నావ మీద కాలు పడితే ఏమౌతుందో తంటా
దయచూపి ఒక సారి కాలు కడగనీయమంటా

మూడు ముర్తులు నువ్వు
నారయణ ముర్తి వంటా
రామయ్య తండ్రి ఓ. రామయ్య తండ్రి

మా నొములన్ని పండినాయి రామయ్య తండ్రి
మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి

చరణం 3:

అందరిని దరిచేర్చు మా రాజు వే

అద్దరిని చేర్చమని అడుగుతుండ వే

అందరిని దరిచేర్చు మా రాజు వే

అద్దరిని చేర్చమని అడుగుతుండ వే

నువ్వు దాట లేక కాదులే రామయ్య తండ్రి
నువ్వు దాట లేక కాదులే రామయ్య తండ్రి
నన్ను దయచూడగా వచ్చావు రామయ్య తండ్రి
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా
హై లేసో లేలో హై లేసా ఓ
హై లేసో లేలో హై లేసా

- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు