RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
chandrakala songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
chandrakala songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2026, శుక్రవారం

కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా | Kalise Kallalona | Song Lyrics | Nomu (1974)

కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా


చిత్రం: నోము (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత: దాశరథి

నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


కలిసే కళ్ళలోనా... 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా… 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 1


పెరిగీ తరిగేను నెలరాజూ…  

వెలుగును నీ మోము ప్రతి రోజూ

పెరిగీ తరిగేను నెలరాజూ…  

వెలుగును నీ మోము ప్రతి రోజూ

ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే…


కలిసే కళ్ళలోనా…  

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 2


ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... 

ఎంతో పులకించి పోయానూ


ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... 

ఎంతో పులకించి పోయానూ

ఈ పొందు కలకాలం నే కోరేనూ…


కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 3


కౌగిలి పిలిచేను ఎందుకనీ... 

పెదవులు వణికేను దేనికనీ

కౌగిలి పిలిచేను ఎందుకనీ... 

పెదవులు వణికేను దేనికనీ

మనలోని పరువాలు పెనవేయాలనీ


కలిసే కళ్ళలోనా... 

కలిసే కళ్ళలోనా

కురిసే పూల వానా… 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా .....

లాలాలలలా... లాలాలాలలా


- పాటల ధనుస్సు 


మనసే జతగా పాడిందిలే | Manase Jathaga Padindile | Song Lyrics | Nomu (1974)

మనసే జతగా పాడిందిలే 


చిత్రం: నోము (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. ఆ ఆ


మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. ఓ...


చరణం:1


ఈ గిలిగింతా సరికొత్త 

వింతా ఏమన్నదీ

పూచే పరువం పులకించు 

తరుణం ఇపుడన్నదీ

హే హే.. ఈ గిలిగింతా 

సరికొత్త వింతా ఏమన్నదీ

పూచే పరువం పులకించు 

తరుణం ఇపుడన్నదీ


ఓ అందుకే ఓ చెలీ..

అందుకో కౌగిలీ..ఓ చెలీ..హే..హే..


మనసే జతగా పాడిందిలే.. 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


చరణం:2


నింగిన సాగే నీలాల 

మేఘం ఏమన్నదీ

నీ కొంగును మించిన అందాలు 

తనలో లేవన్నదీ

ఓహో.. నింగిన సాగే 

నీలాల మేఘం ఏమన్నదీ

నీ కొంగును మించిన అందాలు 

తనలో లేవన్నదీ


ఓ అందుకే ఓ ప్రియా..

అందుకో పయ్యెదా.. ఓ ప్రియా...


హే హే.. మనసే జతగా పాడిందిలే.. 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. 


- పాటల ధనుస్సు 


1, జులై 2026, బుధవారం

చక్కని దానా నునుపు చెక్కిలి దానా | Chakkanidana Nunupu Chekkilidana | Song Lyrics | Nomu (1974)

చక్కని దానా నునుపు చెక్కిలి దానా 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల  


పల్లవి :


ఏ..హే..హే..ఏహేహే..

ఆహహ అహాహా..

మ్మ్హు మ్మ్హు అహా హా...


హాయ్

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా


లాల్లలలాలలలలాలలలలా

ఏ హే హే ఏ హేహే హే...


చరణం 1:


ఈ బిడియమే ఏ పడతికైనా 

పరమ సహజం

ఈ విరహమే నీ సరసనుంటే 

మధుర మధురం

తీగలా అల్లుకో తేనెలే అందుకో


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


చరణం 2:


నీలోన కదలే 

రాగాసుధలే పంచుకోనా

నీలో కలిసి లోలో 

విరిసి నేనుండిపోనా

వుండిపో వుండిపో 

గుండెలో నిండిపో...


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా..ఆహా..

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


- పాటల ధనుస్సు 


27, జూన్ 2026, శనివారం

నోము పండించవా స్వామీ | Nomu Padinchava Swamy | Song Lyrics | Nomu (1974)

నోము పండించవా స్వామీ 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


నోము పండించవా స్వామీ.. 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా.. 

అలక చాలించి పాలించవా


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా.. 

నోము పండించవా స్వామీ 


చరణం 1 :


అనురాగ మొలికే అందాల రాజుకు 

ఇల్లాలుగా చేసినావు

ఏ వేళనైనా యే ఆపదైనా 

మమ్మెంతో కాపాడినావు

ఎడబాటు యెరుగని 

మా జంట నిపుడు

ఎడబాటు ఎరుగని 

మా జంట నిపుడు  

ఎందుకు విడదీసినావు.. 

నీవూ ఎందుకు విడదీసినావు


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా..  

నోము పండించవా స్వామీ 


చరణం 2 :


ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

నీ మహిమను చూపాలీ.. 

మా కాపురం నిలపాలీ

నిజం నిరూపించాలీ రావా .. 

దేవా !! రావా ! దేవా !! 


- పాటల ధనుస్సు 


8, మే 2026, శుక్రవారం

నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే | Nallavade (Happy) | Song Lyrics | Dasara Bullodu (1971)

నల్లవాడే అమ్మమ్మొ అల్లరి పిల్లవాడే 


చిత్రం: దసరా బుల్లోడు (1971)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

గానం: ఘంటసాల, సుశీల, జానకి,  


పల్లవి:


నల్లవాడే..  అమ్మమ్మొ 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే.. అయ్యయ్యో 

మన చేత చిక్కినాడే

నల్లవాడే.. అమ్మమ్మొ 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే.. అయ్యయ్యో 

మన చేత చిక్కినాడే


ఒలమ్మీ.. చిన్న వాడనుకొని 

చేరదీస్తే

చిన్న వాడనుకొని చేరదీస్తే.. 

ముంచుతాడే.. 

కొంప ముంచుతాడే


చరణం 1:


సున్నమైన వెన్నలా 

మింగుతాడే.. 

సద్ది నీళ్ళైనా చల్లలా 

తాగుతాడే

సున్నమైన వెన్నలా 

మింగుతాడే.. 

సద్ది నీళ్ళైనా చల్లలా 

తాగుతాడే


వెన్న ముద్దకని 

ఎనకెనక వస్తాడే.. 

వెన్న ముద్దకని 

ఎనకెనక వస్తాడే

వచ్చాడే వచ్చాడే వచ్చాడే..  

ఇచ్చాడే ఇచ్చాడే ఇచ్చాడే

వెచ్చగా ఒక్కటిచ్చి 

వెక్కిరించి పోతాడే


నల్లవాడే.. అమ్మమ్మొ 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే.. అయ్యయ్యో 

మన చేత చిక్కినాడే


చరణం 2:


నెమలి ఈక పెట్టవే..  

డుడుం డుడుం డుం

మురళి చేతి కివ్వవే..  

టింగ్ టొంగ్ టింగ్ టొంగ్

అబ్బొ వాయిస్తాడిప్పుడూ 

ఉండవే.. 

అబ్బొ వాయిస్తాడిప్పుడూ 

ఉండవే

వదగొడతాడు తుప్పులు.. 

చూడు.. చూడు.. చూడవే


నల్లవాడే.. అమ్మమ్మొ 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే..  అయ్యయ్యో 

మన చేత చిక్కినాడే


చరణం 3:


ఆ ముద్దు కృష్ణుడే 

ఈ మొద్దు గుమ్మడే..

ఆలమంద ఎక్కడే 

కోతి మూక ఉన్నదే

హహహహ డుర్ డుర్ డుర్

ఆ ముద్దు కృష్ణుడే 

ఈ మొద్దు గుమ్మడే

ఆలమంద ఎక్కడే 

కోతి మూక ఉన్నదే

ఆనాడు నాకున్న 

ఆరువేల భామల్లో 

మీరిద్దరెవ్వరూ.. 

మీలో నా ముద్దుగుమ్మ 

ఎవ్వరూ

ఆనాడు నాకున్న 

ఆరువేల భామల్లో 

మీరిద్దరెవ్వరూ.. 

మీలో నా ముద్దుగుమ్మ 

ఎవ్వరూ


నువ్వా నా ముద్దుగుమ్మా.. ఆ

ఐతే ఒక ముద్దు ఇమ్మా..  ఆహా

నువ్వా నా ముద్దుగుమ్మా.. ఆ

ఐతే ఒక ముద్దు ఇమ్మా . . ఆహా

ఇవ్వనా.. ఇవ్వనా.. 

ఇచ్చింది చాలునా

ఒహొహొ కృష్ణుడు 

ఓ ముద్దు గుమ్మడు


నల్లవాడే.. అమ్మమ్మొ 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే.. అయ్యయ్యో 

మన చేత చిక్కినాడే

ఒలమ్మీ.. చిన్న వాడనుకొని 

చేరదీస్తే

చిన్న వాడనుకొని చేరదీస్తే 

ముంచుతాడే.. 

కొంప ముంచుతాడే


- పాటల ధనుస్సు 


7, మే 2026, గురువారం

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే | Nallavade Ammammo (Sad) | Song Lyrics | Dasara Bullodu (1971)

నల్లవాడే అమ్మమ్మా అల్లరి పిల్లవాడే


చిత్రం: దసరా బుల్లోడు (1971)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

గానం: సుశీల, జానకి


పల్లవి : 


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  1 :


వెన్నెవంటి మనసున్న 

చిన్నవాడే

చిన్న నాటినుండి నువ్వు 

కోరుకొన్నవాడే

వెన్నెవంటి మనసున్న 

చిన్నవాడే

చిన్న నాటినుండి నువ్వు 

కోరుకొన్నవాడే


ప్రేమకే బానిసైపోతాడే

కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే

ప్రేమకే బానిసైపోతాడే

కాదమ్మ భక్తికే దాసుడై వుంటాడే


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే

చిన్నవాడే ఓయమ్మ 

రాధకే చిక్కినాడే

లేదమ్మా లేదు 

రుక్మిణికే దక్కినాడె

నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  2 :


నువ్వు వాని వరస వున్నదానివీ

నువ్వు వలపుదోచుకొన్నదానివీ

నువ్వు వాని వరస వున్నదానివీ

నువ్వు వలపుదోచుకొన్నదానివీ


మనసిచ్చి మాట 

పుచ్చుకొంటివీ

నీ మనసిచ్చి మాట 

పుచ్చుకొంటివీ

మంచితనముతో నువ్వు 

గెలుచుకొంటివీ


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే


చరణం  3 : 


రాధా కృష్ణులు కథలేనమ్మా

వారు ఎన్నడూ ఆలుమగలు 

కాలేదమ్మా

రాధా కృష్ణులు కథలేనమ్మా

వారు ఎన్నడూ ఆలుమగలు 

కాలేదమ్మా

రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ

లోకానికే అది ఆదర్శమూ

రాధా కృష్ణుల ప్రేమే పవిత్రమూ

లోకానికే అది ఆదర్శమూ


గోపాల బాలుడూ...

నీ ప్రేమలోలుడూ

గోపాల కృష్ణుడూ...

నీ పాలి దేవుడు

గోపాల బాలుడూ...

నీ ప్రేమలోలుడూ

గోపాల కృష్ణుడూ...

నీ పాలి దేవుడు


వాడు నీ వాడే... 

కాదు నీ వాడే

వాడు నీ వాడే... 

కాదు కాదు కానేకాడు


నల్లవాడే అమ్మమ్మా 

అల్లరి పిల్లవాడే...


- పాటల ధనుస్సు 


26, మార్చి 2026, గురువారం

మల్లెతీగ వంటిది మగువ జీవితం | Malle Teega Vantidi | Song Lyrics | Meena (1973)

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చిత్రం :  మీనా (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  ఆరుద్ర

నేపథ్య గానం :  పి.సుశీల 


పల్లవి:


మల్లెతీగ వంటిది మగువ జీవితం

మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే... ఏ ఏ...

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చరణం 1:


తల్లితండ్రుల ముద్దూమురిపెం 

చిన్నతనంలో కావాలి

తల్లితండ్రుల ముద్దూమురిపెం 

చిన్నతనంలో కావాలి

ఇల్లాలికి పతి అనురాగం 

ఎల్లకాలమూ నిలవాలి

ఇల్లాలికి పతి అనురాగం 

ఎల్లకాలమూ నిలవాలి

తల్లికి పిల్లల ఆదరణ ఆ ఆ 

పండువయసులో కావాలి

ఆడవారికి అన్నివేళలా 

తోడూ నీడా ఉండాలి 

తోడూ నీడా ఉండాలి


మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం


చరణం 2:


నుదుట కుంకుమ కళకళలాడే 

సుదతే ఇంటికి శోభ

నుదుట కుంకుమ కళకళలాడే 

సుదతే ఇంటికి శోభ

పిల్లలపాపల ప్రేమతో పెంచే 

తల్లే ఆరని జ్యోతి

పిల్లలపాపల ప్రేమతో పెంచే 

తల్లే ఆరని జ్యోతి

అనురాగంతో మనసును దోచే 

వనితే మమతల పంట

జన్మను ఇచ్చి జాతిని నిలిపే 

జననియే జగతికి ఆధారం... 

జననియే జగతికి ఆధారం...


మల్లెతీగ వంటిది మగువ జీవితం

చల్లని పందిరి వుంటే ..ఏ ఏ..

అల్లుకుపోయేనూ.. 

అల్లుకుపోయేనూ

మల్లెతీగ వంటిది మగువ జీవితం...


- పాటల ధనుస్సు 

11, ఫిబ్రవరి 2026, బుధవారం

శ్రీరామ నామాలు శతకోటి | Srirama Namalu Sathakoti | Song Lyrics | Meena (1973)

శ్రీరామ నామాలు శతకోటి


చిత్రం :  మీనా (1973)

సంగీతం :  రమేశ్ నాయుడు

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  పి.సుశీల 


పల్లవి:


ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ .....


శ్రీరామ నామాలు శతకోటి...

ఒక్కొక్క పేరు బహుతీపి... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 1:


తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...

దశరధరామయ్య స్థవనీయుడు...

తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...

దశరధరామయ్య స్థవనీయుడు..

కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు... 

కళ్యాణరామయ్య కమనీయుడు..... 

కమనీయుడు...


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 2:


సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...

సుందరరామయ్య సుకుమారుడు

సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...

సుందరరామయ్య సుకుమారుడు

కోతిమూకలతో ..... ఆ.. ఆ... ఆ...

కోతిమూకలతో లంకపై దండెత్తు...

కోదండరామయ్య రణధీరుడు...

రణధీరుడు


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి .....


చరణం 3:


పవమానసుతుడు పాదాలు పట్టగా...

పట్టాభిరామయ్య పరంధాముడు.....

పవమానసుతుడు పాదాలు పట్టగా...

పట్టాభిరామయ్య పరంధాముడు

అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు...

అచ్యుతరామయ్య అఖిలాత్ముడు..... 

అఖిలాత్ముడు..


శ్రీరామ నామాలు శతకోటి .....

ఒక్కొక్క పేరు బహుతీపి ..... 

బహుతీపి

శ్రీరామ నామాలు శతకోటి


- పాటల ధనుస్సు 


23, నవంబర్ 2025, ఆదివారం

అన్నయ్య కలలే పండెను | Annayya Kalale Pandenu | Song Lyrics | Atmeeyulu (1969)

అన్నయ్య కలలే పండెను


చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


అన్నయ్య కలలే పండెను 

చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే 

తొంగి చూసెను..

అన్నయ్య కలలే పండెను 

చెల్లాయి మనసే నిండెను


చరణం 1:


తోడునీడ నీవై లాలించే అన్నయ్యా..

తోడునీడ నీవై లాలించే అన్నయ్యా..

తల్లితండ్రి నీవై పాలించే అన్నయ్యా..

నీకన్న వేరే పెన్నిధి లేనే లేదు..

నా పూర్వ పుణ్యాల రూపమే నీవు


అన్నయ్య కలలే పండెను.. 

చెల్లాయి మనసే నిండెను


చరణం 2:


రతనాల సుగుణాల రాణివి నీవే

అన్నయ్య నయనాల ఆశవు నీవే

రతనాల సుగుణాల రాణివి నీవే

అన్నయ్య నయనాల ఆశవు నీవే

నీవు మెట్టిన ఇల్లు నిత్యము విలసిల్లు

నీ నవ్వు సిరులొల్కు ముత్యాలజల్ల


అన్నయ్య కలలే పండెను.. 

చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే 

తొంగి చూసెను.. 

అన్నయ్య కలలే పండెను.. 

చెల్లాయి మనసే నిండెను 


చరణం 3:


మా అన్నయ్య మనసె 

సిరిమల్లె పువ్వేను

మా అన్నయ్య మనసె 

సిరిమల్లె పువ్వేను

చెల్లి కంట తడివుంటే 

తల్లడిల్లెను 


నీ పూజలే నన్ను నడిపించు తల్లి

శతకోటి విజయాలు సాధించు చెల్లి


అన్నయ్య కలలే పండెను.. 

చెల్లాయి మనసే నిండెను

బంగారు కాంతులేవో నేడే 

తొంగి చూసెను..

అన్నయ్య కలలే పండెను.. 

చెల్లాయి మనసే నిండెను


- పాటల ధనుస్సు 


మదిలో వీణలు మ్రోగే | Madilo Veenalu Mroge | Song Lyrics | Atmeeyulu (1969)

మదిలో వీణలు మ్రోగే



చిత్రం: ఆత్మీయులు (1969)

సంగీతం: ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత: దాశరథి

నేపథ్య గానం: పి. సుశీల


పల్లవి:


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే

కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 1:


సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

సిగ్గు చాటున నా లేత వలపు 

మొగ్గ తొడిగింది 

పాల వెన్నెల స్నానాలు చేసి

పూలు పూసింది 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 2:


కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను 

కెరటాల వెలుగు చెంగలువ 

నెలరాజు పొందుకోరేను

అందాల తారయై మెరిసి 

చెలికాని చెంత చేరేను 


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


చరణం 3:


రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

రాధలోని అనురాగమంతా 

మాధవునిదేలే

వేణులోలుని రాగాల కోసం 

వేచి ఉన్నదిలే


మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


కలనైన కనని ఆనందం 

ఇలలోన విరిసే ఈనాడే 

మదిలో వీణలు మ్రోగే 

ఆశలెన్నో చెలరేగే


- పాటల ధనుస్సు 


21, జనవరి 2025, మంగళవారం

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది | Madi Tulli Tulli | Song Lyrics | Adapaduchu (1967)

మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది



చిత్రం: ఆడపడుచు (1967)

సంగీతం: టి. చలపతిరావు

గీతరచయిత: సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం: సుశీల


పల్లవి:


మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది

ఊహ ఉలికి ఉలికి పడుతుంది

సిగ్గు చెవిలోన గుస గుస లాడింది


మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది

ఊహ ఉలికి ఉలికి పడుతుంది

సిగ్గు చెవిలోన గుస గుస లాడింది


చరణం 1:


పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు

వెళ్ళి పోయాక ఒకటే తలపు

పెళ్ళి చూపుల్లో ఏదో వెరపు

వెళ్ళి పోయాక ఒకటే తలపు


రెండు నిమిషాలలో కోటి పులకింతలై

రెండు నిమిషాలలో కోటి పులకింతలై

నిండు మదిలోన నెలకొంది తన రూపు


మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది

ఊహ ఉలికి ఉలికి పడుతుంది

సిగ్గు చెవిలోన గుస గుస లాడింది


చరణం 2:


ఏల అదిరింది నా ఎడమ కన్ను

ఏల తన పేరు ఊరించె నన్ను

ఏల అదిరింది నా ఎడమ కన్ను

ఏల తన పేరు ఊరించే నన్ను


వలపు ఉయ్యాల పై పూల జంపాల పై

వలపు ఉయ్యాల పై పూల జంపాల పై

ఆశ ఆకాశ వీధుల్లో ఊగింది


మది తుళ్ళి తుళ్ళి తుళ్ళి ఎగిరింది

ఊహ ఉలికి ఉలికి పడుతుంది

సిగ్గు చెవిలోన గుస గుస లాడింది


చరణం 3:


ఇంత సంతోషమిపుడే కలిగే

ఇంక రాబోవు సుఖమెంతో కలదు

ఇంత సంతోషమిపుడే కలిగే

ఇంక రాబోవు సుఖమెంతో కలదు


పగటి కలలన్నియు పసిడి గనులైనచో

పగటి కలలన్నియు పసిడి గనులైనచో

పట్టలేదోమో నా మూగ మనసు


మది తుళ్ళి తుళ్ళి తుళ్లి ఎగిరింది

ఊహ ఉలికి ఉలికి పడుతుంది

సిగ్గు చెవిలోన గుస గుస లాడింది


- పాటల ధనుస్సు 

అన్నా నీ అనురాగం | Anna Nee Anuragam | Song Lyrics | Adapaduchu (1967)

అన్నా నీ అనురాగం



చిత్రం : ఆడపడుచు (1967)

సంగీతం : టి. చలపతి రావు

గీతరచయిత : దాశరథి 

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


అన్నా... నీ అనురాగం 

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా నీ అనురాగం... 


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం..


చరణం 1 :


మల్లెలవంటి మీ మనసులలో 

చెల్లికి చోటుంచాలి

ఎల్లకాలము ఈ తీరుగానే 

చెల్లిని కాపాడాలి..


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం....  

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా... 


చరణం 2 :


అన్నలు మీరే నా కన్నులుగా...  

నన్నే నడిపించాలి

తల్లీ తండ్రీ సర్వము మీరై...  

దయతో దీవించాలి


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం... 

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా... 


చరణం 3 :


ఇల్లాలినై నేనెచటికేగినా...  

చెల్లిని మదిలో నింపాలి

ఆడపడచుకు అన్నివేళలా...  

తోడూ నీడగా నిలవాలి


పుట్టిన రోజున మీ దీవేనలే...  

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం...  

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా..


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు