RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
nomu movie songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nomu movie songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2026, శుక్రవారం

మనసే జతగా పాడిందిలే | Manase Jathaga Padindile | Song Lyrics | Nomu (1974)

మనసే జతగా పాడిందిలే 


చిత్రం: నోము (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల


పల్లవి :


మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. ఆ ఆ


మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. ఓ...


చరణం:1


ఈ గిలిగింతా సరికొత్త 

వింతా ఏమన్నదీ

పూచే పరువం పులకించు 

తరుణం ఇపుడన్నదీ

హే హే.. ఈ గిలిగింతా 

సరికొత్త వింతా ఏమన్నదీ

పూచే పరువం పులకించు 

తరుణం ఇపుడన్నదీ


ఓ అందుకే ఓ చెలీ..

అందుకో కౌగిలీ..ఓ చెలీ..హే..హే..


మనసే జతగా పాడిందిలే.. 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


చరణం:2


నింగిన సాగే నీలాల 

మేఘం ఏమన్నదీ

నీ కొంగును మించిన అందాలు 

తనలో లేవన్నదీ

ఓహో.. నింగిన సాగే 

నీలాల మేఘం ఏమన్నదీ

నీ కొంగును మించిన అందాలు 

తనలో లేవన్నదీ


ఓ అందుకే ఓ ప్రియా..

అందుకో పయ్యెదా.. ఓ ప్రియా...


హే హే.. మనసే జతగా పాడిందిలే.. 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో..


ఓ ఓ .. మనసే జతగా పాడిందిలే... 

తనువే లతలా ఆడిందిలే

ఈ వేళలో ఎందుకో.. 


- పాటల ధనుస్సు 


1, జులై 2026, బుధవారం

చక్కని దానా నునుపు చెక్కిలి దానా | Chakkanidana Nunupu Chekkilidana | Song Lyrics | Nomu (1974)

చక్కని దానా నునుపు చెక్కిలి దానా 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల  


పల్లవి :


ఏ..హే..హే..ఏహేహే..

ఆహహ అహాహా..

మ్మ్హు మ్మ్హు అహా హా...


హాయ్

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా


లాల్లలలాలలలలాలలలలా

ఏ హే హే ఏ హేహే హే...


చరణం 1:


ఈ బిడియమే ఏ పడతికైనా 

పరమ సహజం

ఈ విరహమే నీ సరసనుంటే 

మధుర మధురం

తీగలా అల్లుకో తేనెలే అందుకో


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


చరణం 2:


నీలోన కదలే 

రాగాసుధలే పంచుకోనా

నీలో కలిసి లోలో 

విరిసి నేనుండిపోనా

వుండిపో వుండిపో 

గుండెలో నిండిపో...


చక్కని దానా 

నునుపు చెక్కిలి దానా

ఇంతలో బిడియమా..

చెంతనే విరహమా..ఆహా..

చక్కని దానా..ఆ అ.. 

నునుపు చెక్కిలి దానా..ఆఅ


- పాటల ధనుస్సు 


27, జూన్ 2026, శనివారం

నోము పండించవా స్వామీ | Nomu Padinchava Swamy | Song Lyrics | Nomu (1974)

నోము పండించవా స్వామీ 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


నోము పండించవా స్వామీ.. 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా.. 

అలక చాలించి పాలించవా


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా.. 

నోము పండించవా స్వామీ 


చరణం 1 :


అనురాగ మొలికే అందాల రాజుకు 

ఇల్లాలుగా చేసినావు

ఏ వేళనైనా యే ఆపదైనా 

మమ్మెంతో కాపాడినావు

ఎడబాటు యెరుగని 

మా జంట నిపుడు

ఎడబాటు ఎరుగని 

మా జంట నిపుడు  

ఎందుకు విడదీసినావు.. 

నీవూ ఎందుకు విడదీసినావు


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా..  

నోము పండించవా స్వామీ 


చరణం 2 :


ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

నీ మహిమను చూపాలీ.. 

మా కాపురం నిలపాలీ

నిజం నిరూపించాలీ రావా .. 

దేవా !! రావా ! దేవా !! 


- పాటల ధనుస్సు 


23, జూన్ 2026, మంగళవారం

జిగి బిగి సొగసరి పిలిస్తే | Jigibigi Sogasari Piliste | Song Lyrics | Nomu (1974)

జిగి బిగి సొగసరి పిలిస్తే 


చిత్రం:  నోము (1974)

సంగీతం:  సత్యం

గీతరచయిత:  ఆరుద్ర

నేపధ్య గానం:   ఎస్ జానకి


పల్లవి :


తకతక.. తతతక

తకతక.. తతతక

తకతక.. తతత...

తకతక.. తతతక

తకతక.. తతతక

తకతక.. తతత...


జిగి బిగి సొగసరి పిలిస్తే.. 

అహ కాదని చెప్పకురా

మన గొడవలు బయటికి తెలిస్తే .. 

ఎహ్ ఖాతరు చెయకురా

నీతో ఉందిర తొందర పని 

నీకే తెలుసుర ఏమిటో అది ...


తకతక.. తతత..

తకతక.. తతత..

తకతక.. త..త...త..


చరణం 1:


చూడు గుసగుస లాడే 

మిసమిసలాడే సొంపులూ

నీతో తకతకలాడే 

చకచకలాడే ఒంపులూ

చూడు గుసగుస లాడే 

మిసమిసలాడే సొంపులూ

నీతో తకతకలాడే 

చకచకలాడే ఒంపులూ


రాజా.. ఎక్కెనా  చక్కనీ నిషా.. 

రా రా చూపరా రేపు నీ పస

జిగి బిగి సొగసరి పిలిస్తే 

అహ కాదని చెప్పకురా

మన గొడవలు బయటికి తెలిస్తే 

ఎహ్ ఖాతరు చెయకురా 


తకతక.. తతత..

తకతక.. తతత..

తకతక.. త..త...త..


చరణం 2:


నాలో అణగని పొగరు 

వలపుల వగరు ఉందిరా

దానికి మనసులుకూడి 

కైపుల వాడిమందురా

నాలో అణగని పొగరు 

వలపుల వగరు ఉందిరా

దానికి మనసులుకూడి 

కైపుల వాడిమందురా

ఇదుగో ముద్దుగా ఇద్దరం ఉందాం.. 

ఇపుడే ఇక్కడే ఒక్కటైపోదాం 


జిగి బిగి సొగసరి పిలిస్తే.. 

అహ కాదని చెప్పకురా

మన గొడవలు బయటికి తెలిస్తే .. 

ఎహ్ ఖాతరు చెయకురా .. 


తకతక.. తతత..

తకతక.. తతత..

తకతక.. త..త...త..


- పాటల ధనుస్సు 


5, నవంబర్ 2024, మంగళవారం

అందరి దైవం నీవన్నా | Andari Daivam Neevanna | Song Lyrics | Nomu (1974)

అందరి దైవం నీవన్నా



చిత్రం :  నోము (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి  

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా

నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా


పాలు పోసేము నోము నోచేము

మము చల్లగ చూడాలి నాగన్నా…

అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా

నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా


చరణం 1 :


ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు 

కానుక తెచ్చాము

ఆ...ఆ...ఆ...ముంగిట ముత్యాల 

ముగ్గులు పెట్టాము

భక్తితో నిను గూర్చి పాటలు పాడేము 

సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా 


చరణం 2 :


మల్లెలు తెచ్చామయ్య 

మల్లెల నాగేంద్రా

ఆ... చలిమిడి పెట్టామయ్య 

చల్లని నాగేంద్రా

కన్నెలము కొలిచేమయ్యా 

కరుణించవయ్యా 

అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా


నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా

అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

కన్నిటిలోన రగిలింది జ్వాల | Kannetilone Ragilindi Jwala | Song Lyrics | Peddalu Marali (1974)

కన్నిటిలోన రగిలింది జ్వాల  చిత్రం: పెద్దలు  మారాలి (1974) సంగీతం: బి. గోపాలం సాహిత్యం: ఆరుద్ర గానం: ఘంటసాల పల్లవి: కన్నిటిలోన రగిలింది జ్వాల...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు