RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
nagula chavithi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
nagula chavithi songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జూన్ 2026, శనివారం

నోము పండించవా స్వామీ | Nomu Padinchava Swamy | Song Lyrics | Nomu (1974)

నోము పండించవా స్వామీ 


చిత్రం : నోము (1974)

సంగీతం : సత్యం

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి :


నోము పండించవా స్వామీ.. 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా.. 

అలక చాలించి పాలించవా


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా.. 

నోము పండించవా స్వామీ 


చరణం 1 :


అనురాగ మొలికే అందాల రాజుకు 

ఇల్లాలుగా చేసినావు

ఏ వేళనైనా యే ఆపదైనా 

మమ్మెంతో కాపాడినావు

ఎడబాటు యెరుగని 

మా జంట నిపుడు

ఎడబాటు ఎరుగని 

మా జంట నిపుడు  

ఎందుకు విడదీసినావు.. 

నీవూ ఎందుకు విడదీసినావు


నోము పండించవా స్వామీ 

నన్ను కరుణించ రావేమీ

నిను నమ్మితిరా  నిను కొలిచితిరా..

అలక చాలించి పాలించవా..  

నోము పండించవా స్వామీ 


చరణం 2 :


ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

ఆదిశేషుని అవతారం నీవైతే.. 

నేనింత కాలము 

నోచిన నోము నిజమైతే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

దైవంగా నా పతినే నేను పూజిస్తే

నీ మహిమను చూపాలీ.. 

మా కాపురం నిలపాలీ

నిజం నిరూపించాలీ రావా .. 

దేవా !! రావా ! దేవా !! 


- పాటల ధనుస్సు 


5, నవంబర్ 2024, మంగళవారం

అందరి దైవం నీవన్నా | Andari Daivam Neevanna | Song Lyrics | Nomu (1974)

అందరి దైవం నీవన్నా



చిత్రం :  నోము (1974)

సంగీతం :  సత్యం

గీతరచయిత :  సి నారాయణ రెడ్డి  

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా

నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా


పాలు పోసేము నోము నోచేము

మము చల్లగ చూడాలి నాగన్నా…

అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా

నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా


చరణం 1 :


ఆ...ఆ...ఆ.పానకాలు చిమ్మిళ్ళు 

కానుక తెచ్చాము

ఆ...ఆ...ఆ...ముంగిట ముత్యాల 

ముగ్గులు పెట్టాము

భక్తితో నిను గూర్చి పాటలు పాడేము 

సిరిసంపదలిచ్చి మురిపించవయ్యా


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా 


చరణం 2 :


మల్లెలు తెచ్చామయ్య 

మల్లెల నాగేంద్రా

ఆ... చలిమిడి పెట్టామయ్య 

చల్లని నాగేంద్రా

కన్నెలము కొలిచేమయ్యా 

కరుణించవయ్యా 

అడిగిన వరమిచ్చి అలరించవయ్యా..


అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా


నాగుల చవితి నాగన్నా 

పూజలు గొనుమన్నా

అందరి దైవం నీవన్నా 

ఆశలు తీర్చన్నా


- పాటల ధనుస్సు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు