RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
kalise kallalona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
kalise kallalona లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, జులై 2026, శుక్రవారం

కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా | Kalise Kallalona | Song Lyrics | Nomu (1974)

కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా


చిత్రం: నోము (1974)

సంగీతం: సత్యం

గీతరచయిత: దాశరథి

నేపథ్య గానం: ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


కలిసే కళ్ళలోనా... 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా


కలిసే కళ్ళలోనా… 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 1


పెరిగీ తరిగేను నెలరాజూ…  

వెలుగును నీ మోము ప్రతి రోజూ

పెరిగీ తరిగేను నెలరాజూ…  

వెలుగును నీ మోము ప్రతి రోజూ

ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే…


కలిసే కళ్ళలోనా…  

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 2


ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... 

ఎంతో పులకించి పోయానూ


ఎదురుగ చెలికాణ్ణి చూచానూ... 

ఎంతో పులకించి పోయానూ

ఈ పొందు కలకాలం నే కోరేనూ…


కలిసే కళ్ళలోనా కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా

కలిసే కళ్ళలోనా…


చరణం : 3


కౌగిలి పిలిచేను ఎందుకనీ... 

పెదవులు వణికేను దేనికనీ

కౌగిలి పిలిచేను ఎందుకనీ... 

పెదవులు వణికేను దేనికనీ

మనలోని పరువాలు పెనవేయాలనీ


కలిసే కళ్ళలోనా... 

కలిసే కళ్ళలోనా

కురిసే పూల వానా… 

కురిసే పూల వానా

విరిసెను ప్రేమలు హృదయానా .....

లాలాలలలా... లాలాలాలలా


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు