ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
చిత్రం : ఏజెంట్ గోపి (1978)
సంగీతం : సత్యం
గీతరచయిత : ఆరుద్ర
నేపధ్య గానం : బాలు, ramola
పల్లవి :
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
అది కట్టుకోక... ముడి పెట్టు కోక...
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం 1 :
నా చూపుకు తెలుసు.. ఆ లోపలి సొగసు
నా మనసుకు తెలుసు... నీ దాగని వయసు
కొండల నడుమ కోనొకటుంది..
కోనకు నడుము నే కోరినదుంది
ఛీ ఫో...
గుట్టూమట్టూ అవతల పెట్టు..
అడిగిందిస్తే అవుతా జట్టు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం 2 :
రుసరుసలాడే చినదానా..
అసలు విషయం దాచినదానా
రుసరుసలాడే చినదానా..
అసలు విషయం దాచినదానా
బుసకొట్టే రూపం.. కసి పట్టే కోపం..
ఉసిగొల్పే తాపం.. ఉడికిస్తే పాపం..
కిక్కురుమనక పక్కకు వస్తే
ఉక్కిరిబిక్కిరి చేసేస్తా
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
చరణం 3 :
అహా..హహా.. హెహెహెహ్హెహే...
అహహహ్హహహహా..
చెరువున పడితే.. నువు చేపవు అయితే
నా చూపులతోనే.. నేగాళం వేస్తా..
చకచకమంటే.. నను తికమక పెడితే
నీ పంతం పడతా.. నీ తళుకే చూస్తా
కస్సుబుస్సు కాదనవద్దు...
దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు ఉమ్మ్ ఉమ్మ్ సన్న రైక
అది కట్టుకోక... ముడి పెట్టు కోక...
వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ
ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక
అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి