RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
krishna jaya prada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
krishna jaya prada లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఏప్రిల్ 2024, శనివారం

స్నానాల గదిలో సంగీతమొస్తుంది | Snanala Gadilo | Songs Lyrics | Mande Gundelu (1979)

స్నానాల గదిలో సంగీతమొస్తుంది 



చిత్రం :  మండే గుండెలు (1979)

సంగీతం :  కె.వి. మహదేవన్

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం : సుశీల, బాలు  


పల్లవి :


స్నానాల గదిలో సంగీతమొస్తుంది 

ఎవరిడినా... టడటడా..ట..

చన్నీళ్ళు పడగానే సంగతులు 

పలుకుతాయి ఏ చవటకైనా


ఆ.. ఉమ్మ్మ్..

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

చెలి వచ్చి ఇవ్వాలి కౌగిళ్ళు.. 

నిలి వెచ్చనవుతాయి చన్నీళ్లు


అహ..హ.. హ

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు..   అవును

జిల్లుజిల్లుమన్నాయా నీళ్ళు... 

అవును.. చలి చలి అంటోందా ఒళ్లు.. 

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు




చరణం 1 :


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ...

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ...


తలదాక మునిగాక చలి తీరిపోతుంది కానీ...

తలుపవతలేవున్న చెలి వచ్చి ముంచేసి పోనీ...


అహా.. మునిగేది గంగని.. 

ముంచేది రంభని అనుకొని

మునిగేది గంగని.. 

ముంచేది రంభని అనుకొని

మునిగి చూడు అంటావు చలి 

వొట్టి గిలిలాంటిదేనని  



జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటోందా ఒళ్లు



చరణం 2 :


సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు..

చెంబెక్కడున్నదో చెప్పేసి తలుపేసి వెళ్ళు

సబ్బేసుకున్నాను తెరవలేకున్నాను కళ్ళు.. 

అబ్బా...

చెంబెక్కడున్నదో కావల్స్తే ...

చెప్పేసి తలుపేసి వెళ్ళు 


మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

మంటెక్కితే ఉన్న మత్తంత దిగుతుంది నీకు

తిక్కాకబోయి చక్కంగ వస్తుంది చూపు.. అహా..


జిల్లుజిల్లుమంటున్నాయ్ నీళ్ళు... 

చలి చలి అంటుంది ఒళ్లు

ఎవరొచ్చి ఇచ్చారు ఇన్నాళ్లు.. 

నులి వెచ్చనైయ్యేటి కౌగిళ్లు

లలలలలాలలల్లలాలా ల..


లలలలలాలలల్లలాలా ల..


పాటల ధనుస్సు  


13, సెప్టెంబర్ 2023, బుధవారం

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే | Gopalukoste gopemma navve | Song Lyrics | Prajarajyam (1983)

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే



చిత్రం : ప్రజారాజ్యం (1983)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల


పల్లవి:


ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

తకధిమి తకఝణు తకధిమి తకఝణు

తకధిమి తకఝణు తకధిమి తకఝణు

తకధిమి తకఝణు తకధిమి తకఝణు

తకధిమి తకధిమి తకధిమి తకఝణు


ఓ........ఓ...హో....

ఓ.....హో హో హో.....ఓ...


గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో

వయ్యారి చిందుల్లో..ఓ..ఓహో ఓహో ఓహో......


గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో

వయ్యారి చిందుల్లో..ఓ......


మువ్వా మువ్వా ముద్దాడంగ...

ముద్దు ముద్దూ పెళ్ళాడంగ

అందాలన్నీ అల్లాడంగ...

రావే..హో..హో..హో...

ఇదే అల్లరీ... ఈ..హో.. నాదే నా గిరీ...


గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే 

రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..ఓ......


చరణం 1:


ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..


దాచిన ఏహే..దాగని ఓహో..

తీయని వలపులో

చక్కలిగిలిలో...కౌగిలి వలలో...

ఇద్దరు కరగాలిలే


దక్కిన ఆహా..చిక్కని..ఓహో హో..

తీరని కొలుపులో

ముద్దులముడిలో...మెత్తని ముడుపే...

వెచ్చగ దొరకాలిలే


కన్ను కన్ను మాటాడంగ ...

మాట మాట మనసివ్వంగ

మనసు మనసు మనువాడంగ... 

రావే..హే..హో..హ్హ..

అ.. మన పెళ్ళికీ..ఈ..హ్హో..మదే పల్లకీ..


గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో

వయ్యారి చిందుల్లో..ఓ...ఓ...ఓ...

గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే రేపల్లె వీధుల్లో

వయ్యారి చిందుల్లో..ఓ...


చరణం 2:


ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

ధిం తకతక ధిం తకతక..ఓ..ఓ..ఓ..

తకధిమి తకఝణు తకధిమి తకఝణు

తకధిమి తకఝణు తకధిమి తకఝణు

తకధిమి తకఝణు తకధిమి తకఝణు


వచ్చిన..హహహ..వయసులో..ఓహోహోహో..

ఇచ్చిన మనసులే...

కలసిన జతలో...కమ్మని శృతిలో ...

మల్లెలు పాడాలిలే


నచ్చిన..ఓహో..హో..సొగసులు..హే..

తెచ్చిన వరసలే

వలపులు కడితే...వంతెన పడితే...

పంటలు పండాలిలే


పాటే తీసి పైటేయంగ... 

పైటే నేను జారేయంగ ...

పైటే నువ్వై వాటేయంగ రారా..హో..హో...హో..

ఇదే ఆశగా..హోయ్..ఇదే బాసగా..అరెరే..


గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే 

రేపల్లె వీధుల్లో వయ్యారి చిందుల్లో..

హోయ్...గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే 

రేపల్లె వీధుల్లో

వయ్యారి చిందుల్లో..వయ్యారి చిందుల్లో..హ్హ..

వయ్యారి చిందుల్లో....ఆ ఆ..వయ్యారి చిందుల్లో...

లలాలలాలలా..లలాలలాలలా..లలాలలాలలా


పాటల ధనుస్సు 


19, ఏప్రిల్ 2022, మంగళవారం

ఏమని పిలువనురా | Emani Piluvanuraa | Song Lyrics | Sri Rajeswari Vilas Coffee Club (1976)

ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా



Movie : Sri Rajeswari Vilas Coffee club,

Music : Pendyala Nageswararao,

Lyrics : Dasaradhi,

Singers : Balu, Susheela,



ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా

ఏమని పిలువనురా నిను నే ఏ విధి కొలువనురా


అండ పిండ బ్రహ్మాండమంతటా నిండియున్న 

ఓ స్వామీ నిను నే ఎక్కడ వెదుకుదురా

ఏ విధి కొలువనురా

అంగ రంగ సర్వాంగమంతటా 

నిండియున్న ఏమని పిలువనురా

రంగు రంగుల పువ్వులలో 

నీ రమ్యరూపమే చూసేరు

అ అ రంగు రంగుల పువ్వులలో 

నీ రమ్యరూపమే చూశాను

అ అ పున్నమి జాబిలి వెన్నెలలో 

ఉనికిని తెలియగజాలేరు

అ అ పున్నమి జాబిలి వెన్నెలలో 

నీ ఉనికిని కనుగొన గలిగాను

అ అ గల గల పారే సెలయేరులలో

అ అ అ అ

అ అ గల గల పారే సెలయేరుల 

నీ గానమునే వినగలిగాను

కొమ్మ కొమ్మలో రెమ్మ రెమ్మలో

కొలువై యున్నావట స్వామీ

ఏ గతి చూతునురా ఏ విధి కొలువనురా


అంతే లేని ఆకసమే 

నీ ఆలయమని పూజించేరు

అందాలొలికే అరవిందాలే 

నీ చిరునవ్వని ఎంచాను

నీవే లేనీ తావేలేదని 

నిమిష నిమిషము తలచేరు

నాలో నిన్నే చూసిన నేను 

ఎక్కడ వెదుకుదురా స్వామీ

ఏ విధి కొలువనురా ఏమని పిలువనురా


- పాటల ధనుస్సు

1, ఏప్రిల్ 2022, శుక్రవారం

ఉన్న సోకు దాచుకోదు | Unna Soku Dachukodu | Song Lyrics | Agent Gopi (1978)

ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక



చిత్రం :  ఏజెంట్ గోపి (1978)

సంగీతం : సత్యం

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం : బాలు, ramola



పల్లవి : 


ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

ఉన్న చోటు దాచ లేదు సన్న రైక


ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక


అది కట్టుకోక... ముడి పెట్టు కోక...

వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ


ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 



చరణం 1 :


నా చూపుకు తెలుసు.. ఆ లోపలి సొగసు

నా మనసుకు తెలుసు... నీ దాగని వయసు

కొండల నడుమ కోనొకటుంది.. 

కోనకు నడుము నే కోరినదుంది

ఛీ ఫో...

గుట్టూమట్టూ అవతల పెట్టు.. 

అడిగిందిస్తే అవుతా జట్టు



ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 



చరణం 2 : 


రుసరుసలాడే చినదానా.. 

అసలు విషయం దాచినదానా

రుసరుసలాడే చినదానా.. 

అసలు విషయం దాచినదానా


బుసకొట్టే రూపం.. కసి పట్టే కోపం..

ఉసిగొల్పే తాపం.. ఉడికిస్తే పాపం..

కిక్కురుమనక పక్కకు వస్తే  

ఉక్కిరిబిక్కిరి చేసేస్తా




ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక 



చరణం 3 : 


అహా..హహా.. హెహెహెహ్హెహే... 

అహహహ్హహహహా..

చెరువున పడితే.. నువు చేపవు అయితే

నా చూపులతోనే.. నేగాళం వేస్తా..

చకచకమంటే.. నను తికమక పెడితే

నీ పంతం పడతా.. నీ తళుకే చూస్తా

కస్సుబుస్సు కాదనవద్దు... 

దెబ్బకు చిత్తు అమ్మడి సొత్తు



ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు ఉమ్మ్ ఉమ్మ్ సన్న రైక 


అది కట్టుకోక... ముడి పెట్టు కోక...

వెళ్ళలేవు అడిగింది ఇచ్చుకోక..ఆ


ఉన్న సోకు దాచుకోదు ఉల్లి కోక

అది ఉన్న చోటు దాచ లేదు సన్న రైక


- పాటల ధనుస్సు

28, మార్చి 2022, సోమవారం

తలుపు మూయనా | Thalupu Mooyana | Song Lyrics | Shanku Teertham (1979)

తలుపు మూయనా లైటు తీయనా



చిత్రం: శంకు తీర్ధం  (1979)

సంగీతం: కె.చక్రవర్తి 

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం & పి.సుశీల


పల్లవి: 

తలుపు మూయనా లైటు తీయనా

గువ్వగా గూడుగా నువ్వు నేనూ

రివ్వుమంటూ నవ్వుకుంటూ రేగిపోదామా

తలుపు మూయకు లైటు తీయకు

రేగకు ఊగకు సువ్వు నేనూ

వేరుగుంటే వంటి కెంతో మంచిదంటాలే !!


చరణం: 1

 ఎదరనీవుంటే నిదరపోనంది ముదిరిపోయింది వలపే!!

నిదురపోతుంటే ఎనకవున్న ట్టే ఉలికి పడుతుంది. వయసు

హే ! ఈడువేడెక్కి పోతుం టే అంతే

నాడిప్పడెక్కి పోలె గల్లంతే

మంత్రమే పెట్టనా తంత్రమే చెయ్యనా

జలుబు గిలుబు దెబ్బతోనే జబ్బులన్ని తిప్పికొడతాలే


"తలుపు"


చరణ: 2 

పుటకలో వింత  పులకరింతుట చిటిక లేసిందియిప్పుడే

చిలిపిగా క్రొత్త సలపరింతంట చిగురు లేసింది అప్పుడే

హే- ఒళ్ళు పొగరెక్కిపోతుంటే అంతే

వయసు పొగరాని సెగలున్న మంటే

మడుగులో ముంచనా మంటలే ఆర్పనా

పులుపూసలుపూతిమ్మిరంతా ఇప్పుడే

నే తిప్పికొడతాలే 


పాటల ధనుస్సు

27, మార్చి 2022, ఆదివారం

నా మది మధుర నగరి | Naa Madi Madhura Nagari | Song Lyrics | Shanku Teertham (1979)

నామది మధురా నగరి



చిత్రం: శంకు తీర్ధం  (1979)

సంగీతం: కె.చక్రవర్తి 

సాహిత్యం: వేటూరి

గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల


నామది మధురా నగరి

ని యెద యమునాలహరి

కృష్ణ సంగీత మురళి రాధ రాగల రవలి

కలసి పిరిసింది అందాల బృందావని


చంచల కిరణం నయనం

హరిచందన కలశం వదనం

నీ నీలికురులు నా నీలగిరులు

నీ చిలిసి కనులు నావలపు వనులు

ఇవి సంగమించు సంగీత నదులు

రవి చూడలేని సాహిత్య నిధులు

నీ కరాలు హిమ శికరాలు

నీ పదాలు ప్రణయాస్పదాలు

అంతులేని అనురాగ సాగరాలు

వెన్నెల కెరటం అధరం

అది మధురిమ కన్నా మధురం

మనరాసలీల మధుమాస హేల

సప్త స్వరాల రాగాల డోల

మన జవ్వనాలు నవనందనాలు

హిమ తుషారాలు సుమకుటీరాలు

వీక్షణాలు అతి తీక్షణాలు

ప్రణయ కావ్య మధురాక్షరాలు

శతవసంత శరద్వేణు స్వాగతాలు


పాటల ధనుస్సు

23, ఫిబ్రవరి 2022, బుధవారం

హంసభలే రామచిలక | Hamsa bhale Ramchilaka | Song Lyrics | Agent Gopi (1978)

హంసభలే రామచిలక



చిత్రం: ఏజెంట్ గోపి (1978)

సంగీతం: సత్యం 

గీతరచయిత: ఆరుద్ర 

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి: 


రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర

రురరుర రురరుర రురరుర రురరుర రురరుర రురరుర


ఓ..ఓ..ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ.. 

తుర్రుమని ఉడాయించావే... 

తుర్రుమని ఉడాయించావే 


ఓ..ఓ..ఓ.. హంసభలే రామచిలక ఓరబ్బి.. 

తుర్రుమని ఉడాయించారా... 

తుర్రుమని ఉడాయించారా... 


అల్లో మల్లో.. రాముల వల్లో... 

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో.. 

అల్లో మల్లో... రాముల వల్లో.. 

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో.. 


చరణం 1: 


ఓ...పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల?

నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా ..

పదహారేళ్ళ పిల్ల.. నువ్వు పలకానంటే ఎల్ల?

నీకు నాకు డిల్లా.. పెట్టకు పెట్టకు మళ్ళా 

ఆశపెట్టి మోసగించే వేషాలెందుకు అందాకల్ల?


ఓ..ఓ..ఓ.. హంసభలే రామచిలక ఓలమ్మీ

తుర్రుమని ఉడాయించావే... 

తుర్రుమని ఉడాయించావే 


అల్లో మల్లో.. రాముల వల్లో... 

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో.. 


చరణం 2: 


చింత తూపులో ఉంట.. నువ్వు రాకా పోతే తంట

 నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట 


నే చింత తోపులో ఉంట.. నువ్వు రాక పోతే తంట

 నన్ను చూడు నీ కడగంట.. పండించు వలపుల పంట 

ఈడు జోడు బాగా కుదిరే.. నీది నాదే చక్కని జంట 


ఓ... హంస భలే రామ చిలక ఓరబ్బీ 

తుర్రుమని ఉడాయించారా..

 తుర్రుమని ఉడాయించారా 


ఓ... హంసభలే రామచిలక ఓలమ్మీ 

తుర్రుమని ఉడాయించవే..

తుర్రుమని ఉడాయించావే 


అల్లో మల్లో.. రాముల వల్లో 

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో 

అల్లో మల్లో.. రాముల వల్లో

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో 

అల్లో మల్లో.. రాముల వల్లో 

ఝల్లో ఝల్లో... గుండెల ఝల్లో


పాటల ధనుస్సు 

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు