RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
krishnamraju songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
krishnamraju songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, ఏప్రిల్ 2026, ఆదివారం

దాచుకోకు వలపు వాలు కన్నులా | Dachukoku Valapu | Song Lyrics | Tallikodukula Anubandham (1982)

దాచుకోకు వలపు వాలు కన్నులా


చిత్రం : తల్లీ కొడుకుల అనుబంధం (1982)

సంగీతం : సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : ఎస్ పి బాలు, పి.సుశీల 


పల్లవి :


దాచుకోకు వలపు వాలు కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా

మాపటింటి జాడలో... 

మల్లెపూల నీడలో

కరగాలి వన్నెలన్ని వెన్నలా


దోచుకోకు చిలిపి వాడి కన్నులా

పరిమళించు నవమి లేత వన్నెలా

నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో

అడగాలి ముద్దులన్ని నన్నిలా...


దాచుకోకు వలపు వాలు కన్నులా

పరిమళించు నవమి లేత వన్నెలా


చరణం 1 :


పున్నమంటి చిన్నదాని కౌగిట..

పూటకొక్క పులకరింత పుట్టదా


సన్నజాజి వన్నెకాడి సందిట

సందెగాలి సలపరింత పెట్టదా


పొంగుతున్న వయసులు... 

బెంగపడ్డ మనసులు

పెరగాలి పెళ్ళి ముందు ప్రేమలా


దోచుకోకు చిలిపి వాడి కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా


చరణం 2 :


చినుకులాంటి చిన్నవాడి చూపులే...

వలపు తెలుపు మాట లేని పిలుపులు


మేని వంటి కన్నెపిల్ల మేనిలో...

తొంగి చూసే నింగిలోని మెరుపులు


పడుచు పడ్డ విరుపులు 

వయసు ఆట విడుపులు

కలవాలి ప్రేమ ఇంక పెళ్ళిగా... 

ఆ.. ఆ


దాచుకోకు వలపు వాలు కన్నులా

దరహసించు దశమినాటి వెన్నెలా


నీలిమబ్బునీడలో వానవిల్లు మేడలో

అడగాలి ముద్దులన్ని నన్నిలా...


- పాటల ధనుస్సు 


17, ఆగస్టు 2025, ఆదివారం

ఈ వీణ పైన పలికిన రాగం | Ee Veenapaina Palikina | Song Lyrics | Abhimanavantulu (1973)

ఈ వీణ పైన పలికిన రాగం



చిత్రం: అభిమానవంతులు (1973) 

సంగీతం: కోదండపాణి 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం: పి. సుశీల 


పల్లవి: 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 


చరణం 1: 


కలిమిలోన మిడిసిపడనిది...  

లేమిలోన కలత పడనిది 


కలిమిలోన మిడిసిపడనిది...  

లేమిలోన కలత పడనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

వలచిన హృదయల తొలి కలయిక.. 

ఆ.. ఆ.. ఆ.. 


ఈ వీణ పైన పలికిన రాగం...  

నాలోన విరిసిన అనురాగం 


చరణం 2: 


కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  

కవితలకందని మధురభావన.. ఆ.. 


కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  

కవితలకందని మధురభావన 

ఆ భావనయే ఆరాధనగా...  

ఆ భావనయే ఆరాధనగా...  

అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ 


ఈ వీణ పైన పలికిన రాగం...  

నాలోన విరిసిన అనురాగం

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 


- పాటల ధనుస్సు 


ఎప్పటివలె కాదురా | Eppativale kadura | Song Lyrics | Abhimanavanthulu (1973)

ఎప్పటివలె కాదురా



చిత్రం :  అభిమానవంతులు (1973)

సంగీతం :  కోదండపాణి

గీతరచయిత :  సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం :  వాణి జయరాం  

పల్లవి :


ఎప్పటివలె కాదురా.. 

ఎప్పటివలె కాదురా ..

నా స్వామీ..   

ఎప్పటివలె కాదురా

ఈ ముద్దు ఈ మురిపెమే 

పొద్దు ఎరుగవు లేరా

ఎప్పటివలె కాదురా.. నా స్వామీ  

ఎప్పటివలె కాదురా


చరణం 1 :


పున్నమి కళలన్నీ 

మోమున ముడిచి 

అమృతమాధురులు 

అధరాన దాచీ ఆ...ఆ...ఆ..

పున్నమి కళలన్నీ 

మోమున ముడిచి 

అమృతమాధురులు 

అధరాన దాచీ


నిన్నలేని రమణీయరూప 

నవనీతకాంతితో వున్నానురా

అభినయం నాదిరా 

అనుభవం నీదిరా

అభినయం నాదిరా 

అనుభవం నీదిరా

కులుకు కులుకులో 

పలుకు పలుకులో 

లలితరాగములు చిలకరింతురా


ఎప్పటివలె కాదురా..

నా స్వామీ   

ఎప్పటివలె కాదురా.... 


చరణం 2 :


పదును చూపుతో 

మదనుని కవ్వించి 

చిగురునవ్వుతో 

వగలను రగిలించి.. ఆ.. ఆ..

పదును చూపుతో 

మదనుని కవ్వించి 

చిగురునవ్వుతో 

వగలను రగిలించి.. ఆ.. ఆ..


అందలేని ఆనందలోక 

నవనందనాల తేలించేనురా

లాలనం నాదిరా 

పాలనం నీదిరా 

లాలనం నాదిరా 

పాలనం నీదిరా

వసంతవేళల రసైకలీలల 

నిశాంతముల పరవశించేమురా


ఎప్పటివలె..  

ఎప్పటివలె కాదురా... 

నా స్వామి 

ఎప్పటివలె కాదురా

పా ని స ని గసనిదమ 

మగసనిదగమగ రినిస

స స రి రి గ గ రిగ రిగ 

గమ ని గ రి దమని

ఎప్పటివలె కాదురా.. 

నా స్వామి 

ఎప్పటివలె కాదురా


- పాటల ధనుస్సు 


1, జూన్ 2025, ఆదివారం

పెళ్ళంటె పందిళ్ళు | Pellante Pandillu | Song Lyrics | Trishulam (1982)

పెళ్ళంటె పందిళ్ళు



చిత్రం: త్రిశూలం (1982) 

సంగీతం: కె.వి. మహదేవన్ 

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ 

నేపధ్య గానం: బాలు, సుశీల 


పల్లవి: 


పెళ్ళంటే... 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 

ఆ...ఆ...ఆ...ఆ..... 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళైతే... 


పెళ్ళైతె ముంగిళ్ళు.. 

లోగిళ్ళు ముగ్గులు.. 

ముత్తైదు భాగ్యాలూ.... 

ముద్దూ ముచ్చట్లు.. 

మురిసే లోగుట్లు.. 

చెలిమికి సంకెళ్ళు వెయ్యేళ్ళు.. 

ఆ...ఆ...ఆ...ఆ..... 


పెళ్ళైతె ముంగిళ్ళు.. 

లోగిళ్ళు ముగ్గులు 

ముత్తైదు భాగ్యాలూ.... 



చరణం 1: 


గోదారి ఒడ్డున.. 

గోగుల్లు పూచిన వెన్నెలలో 

కొసరాడు కోర్కెలు.. 

చెరలాడు కన్నుల సైగలలో 

ఆ ఆ.. గోదారి ఒడ్డున.. 

గోగుల్లు పూచిన వెన్నెలలో 

కొసరాడు కోర్కెలు.. 

చెరలాడు కన్నుల సైగలలో 


మమతానురాగాల 

మరుమల్లెలల్లిన పానుపులూ... 

హృదయాలు పెదవుల్లో.. 

ఎరుపెక్కు ఏకాంత వేళల్లో 

వలపు పులకింతలో.. 

వయసు గిలిగింతలో.. 

వింతైన సొగసుల వేడుకలో.. 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ... 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ.. 


చరణం 2: 


కలలన్ని కలబోసి.. 

వెలసిన ఈ పంచవటిలో 

ఇల్లాలు నేనై.. 

ఇలవేల్పు నీవైన కోవెలలో 

ఆ... కలలన్ని కలబోసి.. 

వెలసిన ఈ పంచవటిలో 

ఇల్లాలు నేనై.. 

ఇలవేల్పు నీవైన కోవెలలో 


సిరిమువ్వ రవళుల 

మరిపించు నీ నవ్వు సవ్వడిలో... 

కులమన్నదే లేని 

అలనాటి వేదాల ఒరవడిలో 

సామగానాలము.. 

సరసరాగాలము 

ప్రేమికులమన్న 

కులమున్న లోకంలో 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ 

మూడే ముళ్ళు.. 

ఏడే అడుగులు.. 

మొత్తం కలిసీ నూరేళ్ళు 


పెళ్ళంటె పందిళ్ళు.. 

సందళ్ళు తప్పెట్లు.. 

తాళాలు తలంబ్రాలూ.... 


- పాటల ధనుస్సు 


పన్నెండేళ్ళకు పుష్కరాలు | Pannendellaku Pushkaralu | Song Lyrics | Trishulam (1982)

పన్నెండేళ్ళకు పుష్కరాలు



చిత్రం: త్రిశూలం (1982)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం 


చరణం 1 :


ముద్దుగా పుట్టాను పొదలలో 

పువ్వులాగా

దిద్దితే ఎదిగాను పలకలో 

రాతలాగా

అల్లరిగా జల్లులుగా కదిలావు 

ఏరులాగా

ఒంపులుగా సొంపులుగా కులికావు 

ఈడురాగా


ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. 

తోడైనవాడితో కలిసిపోగా హా..

ఈడొచ్చిన సంగతి తెలిసిరాగా.. 

తోడైనవాడితో కలిసిపోగా

గలగలలుగ కిలకిలలుగ.. 

తొలికలలుగ వడి సెలలుగ

గలగలలుగ కిలకిలలుగ.. 

తొలికలలుగ వడి సెలలుగ

ఉరికాను నిన్ను చేరగా


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు


చరణం 2 :


మొక్కువై ముడుపువై ఉన్నావు 

ఇన్నినాళ్ళు

మక్కువై మనసువై తీర్చుకో 

మొక్కుబళ్ళు

మేలుకొని కాచుకొని వెయ్యైనవి 

రెండు కళ్ళు

చేరుకొని ఆనుకొని నడవాలి 

కాళ్ళు కాళ్ళు


చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు

నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు

చిన్ననాటి నేస్తమే నీకు పుస్తెలు

నీ మనసు నా మనసే ఆస్తిపాస్తులు


చెరిసగముగ సరిసమముగ.. 

చిరుజగముగ చిరునగవుగ

చెరిసగముగ సరిసమముగ.. 

చిరుజగముగ చిరునగవుగ

చేద్దాము కాపురాలు


తం తననం తం తననం

తం తననం తం తననం

పన్నెండేళ్ళకు పుష్కరాలు.. 

పదహారేళ్ళకు పరువాలు

ఆనాడు చేసేవి తానాలు.. 

ఈనాడు వచ్చేవి తాపాలు

తాపాలు ఆరాలి తానాలతో.. 

పరువాలు కలవాలి తాపాలతో


తం తననం తం తననం

తం తననం తం తననం 


- పాటల ధనుస్సు 


24, ఫిబ్రవరి 2025, సోమవారం

శ్రీకాళహస్తీశ్వరా హరహర | Srikalahastiswara Harahara | Song Lyrics | Bhakta Kannappa (1976)

శ్రీకాళహస్తీశ్వరా హరహర



చిత్రం :  భక్త కన్నప్ప (1976)

సంగీతం :  ఆదినారాయణరావు/సత్యం

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : రామకృష్ణ


పల్లవి:


ఓం నమశ్శివాయ... ఆ...ఆ

శ్రీకంఠలోకేశ..  శ్రీకాళహస్తీశ

చిద్రూప కారుణ్య కల్పద్రుమా...

భక్త చింతామణి .. ఆర్త రక్షామణి

సర్వసర్వజ్ఞ సర్వాత్మకా

నీ పదార్థంబులన్ నెమ్మదిన్నిలిపి

భల్లూగ జీవమ్ములేకాగ్రతన్

ఉగ్రతన్ నిన్ను భావించి 

సేవించ సాయుధ్యనిచ్చావు

తండ్రీ... ఈ...


మధాంధుండనై మొండినై

నిన్ను దుర్భాషలన్ 

ఎన్ని ధూషించినా.. ఆ...

దివ్య లింగమ్ము భంగమ్ము 

కావింపగాజూచినా..

సర్వలోకోత్తరంభైన 

నీ విశ్వరూపమ్ము జూపించినావే

నన్ను దీవించినావే... ఏ...ఏ

కర్మ పరిక్వముంజేసి 

కైవల్యనియ్యంగ లేవా... ఆ...

ప్రభో పాహిమాం 

పాహిమాం పాహిమాం... ఆ...


శ్రీకాళహస్తీశ్వరా...  హరహర

కరుణించి నను బ్రోవరా... 

దేవర..  కైవల్య పదమీయరా ...


శ్రీకాళహస్తీశ్వరా...  హరహర

కరుణించి నను బ్రోవరా... 

దేవర..  కైవల్య పదమీయరా ...


చరణం 1:


ఆలయమన్నది లేదని 

నీకై అల్లెను గుడులను సాలీడు

ఆ భక్తుడు నీవు సంశోధించ 

అగ్నిపరీక్షను పొందాడు

నీ గుడి రూపము చెరిపిన 

దీపము మ్రింగ దలంచెను పురుగు

ఆ భక్తికి ఎంతో రక్తిని చెంది 

ముక్తినొసంగిన దేవా... 


శ్రీకాళహస్తీశ్వరా...  హరహర

కరుణించి నను బ్రోవరా... 

దేవర..  కైవల్య పదమీయరా ...


చరణం 2:


పన్నగ మొక్కటి ప్రతి ఉదయమ్మున 

ఎన్నో మణులను తెచ్చేదీ .. 

నిన్నే పూజించేదీ

పాముయొనర్చిన పూజను మెచ్చక 

ఏనుగు దానిని తుడిచేదీ .. 

వేరే పూజలు చేసేదీ


ఒకరు యెనర్చిన పూజలునొల్లని 

కరికాళమ్ములు పగబూనీ .. 

తరుణము కొరకై వేచినవీ

తొండము నుండి దూరిన పాము 

మెండుగ గజమును బాధించే

కొండను మోదగ కుంభము 

పగులగ రెండొకతరి మరణించె


నీకై పోరిన ఆ ప్రాణులకు 

నీ సాయుజ్యము లభియించే

జంతుసంతతికి ఇచ్చిన మోక్షము 

సదాశివా ... దయచేయవా... 


శ్రీకాళహస్తీశ్వరా...  హరహర

కరుణించి నను బ్రోవరా... 

దేవర..  కైవల్య పదమీయరా ...


పాటల ధనుస్సు 


7, మార్చి 2024, గురువారం

సంగీతం మధుర సంగీతం | Sangeetham Madhura Sangeetham | Song Lyrics | Krishnaveni (1974)

సంగీతం.. మధుర సంగీతం



చిత్రం :  కృష్ణవేణి (1974)

సంగీతం :  విజయ భస్కర్

గీతరచయిత  :  ఆరుద్ర

నేపధ్య గానం :  సుశీల


పల్లవి :


సంగీతం.. మధుర సంగీతం

సంగీతం..  మధుర సంగీతం . .

తల్లీ పిల్లల హృదయ సంకేతం

సంగీతం.. మధుర సంగీతం...  


చరణం 1 :


ముద్దుల కూనల తీయని పిలుపే . . 

తల్లికి కోకిల గానం

లలల.. లాలలలా.. అహహహా.. అహహహా..

ముద్దుల కూనల తీయని పిలుపే . . 

తల్లికి కోకిల గానం

మదిలో మమతలె మంజుల రవళిగ.. 

మ్రోగును మోహనరాగం          

సంగీతం . . మధుర సంగీతం . .  


చరణం 2 :


బాల పాపల ఆటల పాటలె..  

అమ్మకు కమ్మని గీతం

ఆకాశ వీధుల సాగే గువ్వలు.. 

తెచ్చే ప్రేమ సందేశం

సంగీతం.. మధుర సంగీతం

తల్లీ పిల్లల హృదయ సంకేతం

సంగీతం.. మధుర సంగీతం . . 


చరణం 3 :


ఎన్నో నోముల పంటలు పండి..  

ముచ్చట గొలుపు సంతానం

ఎన్నో నోముల పంటలు పండి..  

ముచ్చట గొలుపు సంతానం

ఆశాఫలముల రాశులు 

ఎదలో చేసెను రాగసంచారం

సంగీతం..  మధుర సంగీతం . . 


చరణం 4 :


శోభన జీవన దీపావళిలో.. 

పెరిగెను పావన తేజం

తనివే తీర తనయులజేర..  

తల్లికి తరగని భాగ్యం

సంగీతం..  మధుర సంగీతం . .

తల్లీ పిల్లల హృదయ సంకేతం..

సంగీతం . . మధుర సంగీతం . .


పాటల ధనుస్సు 


6, మార్చి 2024, బుధవారం

కృష్ణవేణి తెలుగింటి విరిబోణి | krishnaveni Teluginti viriboni | Song Lyrics | Krishnaveni (1974)

కృష్ణవేణి  తెలుగింటి విరిబోణి 


చిత్రం: కృష్ణవేణి (1974) 

సంగీతం: విజయ భస్కర్ 

గీతరచయిత: సినారె 

నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, రామకృష్ణ, సుశీల 



సాకి :


హే జనని కృష్ణవేణి ... రాజిత తరంగవాణి 

పంచ పాతక హారిణి... పరమ మంగళకారిణి... 

దక్షినోర్వి దివ్యవాహిని ... అక్షీణ భాగ్య ప్రదాయిని ... 


శ్రీశైల మల్లికార్జున దివ్యచరణ సంశేవిని.. 

కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని .. 

కనకదుర్గా భవ్య కరుణాకటాక్ష సంవర్ధిని... 

కృష్ణవేణి... కృష్ణవేణి మమ: ప్రశీద.. మమ: ప్రశీద... 


పల్లవి: 


కృష్ణవేణి... కృష్ణవేణి.... 

కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ... 

కృష్ణవేణి నా ఇంటి అలివేణి... 

కృష్ణవేణి తెలుగింటి విరిబోణి... 

కృష్ణవేణి నా ఇంటి అలివేణి ... 


చరణం 1: 


శ్రీగిరిలోయల సాగే జాడల.. 

శ్రీగిరిలోయల సాగే జాడల.. 

విద్యుల్లతలు కోటి వికశింపజేసేవు ... 


లావణ్యలతవై నను చేరువేళ.. 

లావణ్యలతవై నను చేరువేళ... 

శతకోటి చంద్రికలు వెలిగించు కృష్ణవేణి ... 


కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ... 

కృష్ణవేణి నా ఇంటి అలివేణి... 


చరణం 2: 


నాగార్జున గిరి కౌగిట ఆగి.. 

నాగార్జున గిరి కౌగిట ఆగి ... 

బీళ్ళను బంగారు చేలుగా మార్చేవు ... 

ఆంధ్రావనికై అన్నపూర్ణవై 

కరువులు బాపేవు..

బ్రతుకులు నిలిపేవు.. 

నా జీవనదివై ఎదలోన ఒదిగి...

నా జీవనదివై ఎదలోన ఒదిగి .. 

పచ్చని వలపులు పండించు కృష్ణవేణి ... 


కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ... 

కృష్ణవేణి నా ఇంటి అలివేణి... 


చరణం 3: 


అమరావతి గుడి అడుగుల నడయాడి... 

అమరావతి గుడి అడుగుల నడయాడి .. 

రాళ్ళను అందాల రమణులుగ తీర్చేవు... 


ఏ శిల్పరమణులు.. ఏ దివ్యలలనలు 

ఏ శిల్పరమణులు... ఏ దివ్యలలనలు 

ఓర్చని అందాలు దాచిన కృష్ణవేణి ... 


అభిసారికవై హంసలదీవిలో ... 

సాగర హృదయాన సంగమించేవు... 


నా మేని సగమై.. నా ప్రాణసుధవై.. 

నా మేని సగమై.. నా ప్రాణసుధవై.. 

నిఖిలము నీవై నిలిచిన కృష్ణవేణి... 


కృష్ణవేణి... తెలుగింటి విరిబోణి ... 

కృష్ణవేణి నా ఇంటి అలివేణి...



పాటల ధనుస్సు 

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ | Enduko neevu natho vunnavela | Song Lyrics | Krishnaveni (1974)

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ 



చిత్రం: కృష్ణవేణి (1974)

సంగీతం: విజయ భస్కర్

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల


పల్లవి:


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...

ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి..

ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి...


చరణం 1:


మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై

మనసులోని మమతలన్ని మల్లెపూలై విరిసె నీకై...

వలపులన్ని పూలమాలై కురులోన కులుకె నీకై ...


ఎన్ని జన్మాలకైనా.. అహ.. అహ..నీవు నాదానివేలే

ఇందుకు సాక్షులు... గిరులు తరులు... 

గిరులు... తరులు


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...

ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...


చరణం 2:


నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా ...

నీలికన్నుల ఆలయాన నిన్ను స్వామిగ నిలుపుకోనా...

ఎల్లవేళల జీవితాన నిన్ను దేవిగా కొలుచుకోనా...

గౌరిశంకరులకందం... మనది విడిపోని బంధం

ఇందుకు సాక్షులు...

సూర్యుడు ..చంద్రుడు...సూర్యుడు ...చంద్రుడు..


ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి ...

ఎందుకో నిన్ను విడిచి నిమిషమైనా నిలువలేనోయి ...

ఎందుకో నీవు నాతో ఉన్నవేళ ఇంత హాయి...


పాటల ధనుస్సు 

30, మార్చి 2023, గురువారం

ఓ జాబిలీ వెన్నెల ఆకాశం | O Jabilee Vennela Akasam | Duet Song Lyrics | Rangoon Rowdy (1979)

ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం



చిత్రం : రంగూన్ రౌడి (1979)

సంగీతం :  జె.వి. రాఘవులు

గీతరచయిత :  వేటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


ఓ జాబిలీ... వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

ఎదురు చూసింది నిదుర కాచింది కలువ నీకోసమే

వెలుగువై రావోయి వెలుతురే తేవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

జుమ్  జుమ్ జుమ్.. జుమ్  జుమ్ జుమ్.. 


చరణం 1 :


కదలిపోయే కాలమంతా నిన్ను నన్ను 

నిలిచి చూసే

కలలు కన్న కౌగిలింత వలపు తీపి వలలు వేసే

భ్రమర నాదాలు ఉ ఉ ఉ

భ్రమర నాదాలు.. ప్రేమ గీతాలై పరిమళించేనోయి

పున్నమై రావోయి.. నా పున్నెమే నీవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం

జుమ్  జుమ్ జుమ్.. జుమ్  జుమ్ జుమ్.. 

జుమ్  జుమ్ జుమ్



చరణం 2:


నవ్వులన్ని పువ్వులైన నా వసంతం 

నీకు సొంతం

పెదవి దాటి ఎదను మీటే.. 

ప్రేమ బంధం నాకు సొంతం

ఇన్ని రాగాలు.. ఉ ఉ ఉ

ఇన్ని రాగాలు నీకు అందించే రాగమే నేనోయి

అనురాగమే నీవోయి.. అనురాగమే నీవోయి


ఓ జాబిలీ వెన్నెల ఆకాశం ఉన్నదే నీకోసం


పాటల ధనుస్సు  

27, ఫిబ్రవరి 2023, సోమవారం

పరిమళించు పున్నమిలో | Parimalinchu Punnamilo | Song Lyrics | Puli Bebbuli (1983)

పరిమళించు పున్నమిలో



చిత్రం :  పులి-బెబ్బులి (1983)

సంగీతం :  రాజన్-నాగేంద్ర

గీతరచయిత :  వీటూరి

నేపధ్య గానం :  బాలు, సుశీల



పల్లవి :


పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

ఆ..... ఆ.... ఆ....

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది


మౌనమే.. గానమై... మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో


ఆ ఆ ఆ పరిమళించు పున్నమిలో... 

ప్రణయ వీణ పలికింది


చరణం 1 :


నవ్వగనే.. నవయవ్వనమే పువ్వులు రువ్విందిలే

తానె విరితేనై తానాలు ఆడిందిలే

నిన్ను గని.. ఎద కోయిలగ రాగాలు తీసిందిలే

నాలో ఎలమావి ఉయ్యలలూగిందిలే

చేలిమికిదే చైత్రమనీ.. 

నా ఆశ పూసింది.. అందాల బృందావిహారాలలో


పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో.. ప్రణయ వీణ పలికింది



చరణం 2 :


అందమిదే.. మకరందమిదే.. నా జీవితానందమే

నాలో కెరటాలై ఉప్పొంగి పోయిందిలే

బంధమిదే.. సుమగంధమిదే.. ఏ జన్మ సంబంధమో

నాలో విరితావి వెదజల్లిపోయిందిలే

జాబిలిగా.. వెన్నెలగా.. 

ఈ జంట కలిసింది కార్తిక పూర్ణిండు హాసాలలో


పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

పరిమళించు పున్నమిలో..  ప్రణయ వీణ పలికింది

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో

మౌనమే.. గానమై.. మధుమాసవేళలో


పాటల ధనుస్సు 



27, ఆగస్టు 2022, శనివారం

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా | Panthulamma Pantulamma | Song Lyrics | Babul Gadi Debba (1984)

పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా



చిత్రం : బాబుల్ గాడి దెబ్బ (1984)

సంగీతం : జె.వి. రాఘవులు

గీతరచయిత : వేటూరి

నేపధ్య గానం : బాలు, సుశీల 


పల్లవి :


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..

ప్రేమ పాఠం వింటావా


పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


చరణం 1 :


పల్లే పట్టు మీద అడపా దడపా రేగి

చిలిపి గుణింతాలు దిద్దుకోనా... దిద్దుకోనా


అందాలలో ఉన్న గ్రంధాలు చదివించి

పై చదువులకు నిన్ను పంపించనా... 

పంపించనా


వయ్యారమే చాలు... ఓనామః

శివమెత్తిపోమాకు... శీవాయః

ఒయ్..ఒయ్..ఒయ్...

వయ్యారమే చాలు... ఓనామః

శివమెత్తిపోమాకు... శీవాయః


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


చరణం 2 :


వాలేపొద్దుల కాడా.. వయసే ముద్దూలాడ

లేతా మనసూ జీతమిచ్చుకోనా.. 

ఇచ్చుకోనా


పండూ ఎన్నెల్లోనా.. ఎండవానల్లోనా

పూతా సొగసు  పట్టి అందుకోనా... 

అందుకోనా


పాఠాలు ఈ పూట చాలోయహా.. 

ఈ దసరాకు సెలవింక లేదోయహా

పాఠాలు ఈ పూట చాలోయహా.. 

ఈ దసరాకు సెలవింక లేదోయహా


పంతులయ్య.. యెయె..


పంతులయ్య పంతులయ్య బళ్లోస్తొస్తావా... 

మా బళ్లోకొస్తావా

పబ్లిక్ గా నేను చెప్పే పాఠం వింటావా...

ప్రేమ పాఠం వింటావా


పంతులమ్మ పంతులమ్మ బళ్లోకొస్తావా... 

మా బళ్లోకొస్తావా

ప్రైవేటుగా నేను చెప్పే పాఠం వింటావా..

ప్రేమ పాఠం వింటావా


పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు