RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, ఆగస్టు 2025, ఆదివారం

ఈ వీణ పైన పలికిన రాగం | Ee Veenapaina Palikina | Song Lyrics | Abhimanavantulu (1973)

ఈ వీణ పైన పలికిన రాగం



చిత్రం: అభిమానవంతులు (1973) 

సంగీతం: కోదండపాణి 

గీతరచయిత: సి.నారాయణరెడ్డి  

నేపధ్య గానం: పి. సుశీల 


పల్లవి: 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 


చరణం 1: 


కలిమిలోన మిడిసిపడనిది...  

లేమిలోన కలత పడనిది 


కలిమిలోన మిడిసిపడనిది...  

లేమిలోన కలత పడనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

ఇరువురి నడుమా ఎల్లలు లేనిది 

వలచిన హృదయల తొలి కలయిక.. 

ఆ.. ఆ.. ఆ.. 


ఈ వీణ పైన పలికిన రాగం...  

నాలోన విరిసిన అనురాగం 


చరణం 2: 


కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  

కవితలకందని మధురభావన.. ఆ.. 


కనిపించే ఆతని చిరు నవ్వులోనా...  

కవితలకందని మధురభావన 

ఆ భావనయే ఆరాధనగా...  

ఆ భావనయే ఆరాధనగా...  

అతనికి నేనే ఒక కానుక.. ఆ.. ఆ.. ఆ 


ఈ వీణ పైన పలికిన రాగం...  

నాలోన విరిసిన అనురాగం

మీటితే మ్రోగేది రాగం... 

ఎదమాటుగా పెరిగేది అనురాగం 


ఈ వీణ పైన పలికిన రాగం... 

నాలోన విరిసిన అనురాగం 


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

తగునా ఇది మామా | Taguna Idi Mama | Song Lyrics | Ramudu Bheemudu (1964)

తగునా ఇది మామా చిత్రం :  రాముడు-భీముడు (1964) సంగీతం :  పెండ్యాల గీతరచయిత :  కొసరాజు నేపథ్య గానం :  ఘంటసాల, మాధవపెద్ది   పల్లవి : తగునా ఇది ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు