అపురూప రూపసి నీవు
చిత్రం : గురు శిష్యులు (1981)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అపురూప రూపసి నీవు...
అతిలోక ప్రేయసి నీవు
కల నీవు... కళ నీవు..
తుది లేని కాంతివి నీవు...
ఎద నిండు శాంతివి నీవు...
అపురూప దైవము నీవు...
అతిలోక ప్రేమవు నీవు
గుడి నీవు... ఒడి నీవు...
ఎదలోని సవ్వడి నీవు...
ఎనలేని ఒరవడి నీవు...
చరణం 1 :
నిను చూచే చూపులతో...
కనులైనవి వెన్నెల కలశాలు
నిను తలచే తలపులతో...
మనసైనది మల్లెల వెల్లువలు
నీ కోరికలే నా వేడుకలు...
నీ కౌగిళ్ళే వనమాలికలు
నీ నవ్వులే తారకలు...
నీ ఊహలే డోలికలు
అపురూప రూపసి నీవు...
అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు...
ఎద నిండు శాంతివి నీవు...
చరణం 2 :
నే పిలిచిన పిలుపుకు బదులైనావు...
నే తెరచిన ఇంటికి వెలుగైనావు...
నా విడిపూలను ముడి వేసిన
దారం నీవు
నా ఎద పలికే వేదాలకు
సారం నీవు
ఓంకార నాదం నీవు...
అపురూప రూపసి నీవు...
అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు...
ఎద నిండు శాంతివి నీవు...
చరణం 3 :
నీతోనే నా హృదిలో...
ఉదయించెను వలపుల కిరణాలు
నీ తపసే నా మనసై...
తొలగించెను కలతల మేఘాలు
నీ గారాలే... నయగారాలు
నీ లాలనలే... పరిపాలనలు..
నీ కోసమే పుట్టుకలు...
నీతోనే అల్లికలు
అపురూప రూపసి నీవు...
అతిలోక ప్రేమవు నీవు
కల నీవు... కళ నీవు..
ఎదలోని సవ్వడి నీవు...
ఎద నిండు శాంతివి నీవు...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి