RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, ఆగస్టు 2025, సోమవారం

రామచిలక పలకరిస్తే | Ramachiluka Palakariste | Song Lyrics | Palnati Simham (1985)

రామచిలక పలకరిస్తే రాణిముత్యాలు



చిత్రం: పల్నాటి సింహం (1985)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి :


రామచిలక పలకరిస్తే 

రాణిముత్యాలు

గోరువంక బదులు చెపితే 

కోటి రత్నాలు

ఆ మల్లెల మాసంలో.. 

ఓ మంచి ముహూర్తంలో

కట్నమే పువ్వుగా... 

కానుకే నవ్వుగా.. కౌగిలే ఇల్లుగా.. 

పెళ్ళి  పెళ్ళి పెళ్ళి  


హోయ్.. రామచిలుకా 

ఎందుకే నీ రాయబారాలు

గోరువంక ఓపదింక 

దూరభారాలు

ఆ మావిడితోటల్లో.. 

ఓ మాపటిలగ్నంలో

కొమ్మకో కోయిలా... 

కమ్మగా పాడగా.. కౌగిలే ఇల్లుగా.. 

పెళ్ళి  పెళ్ళి పెళ్ళి 


హోయ్.. రామచిలక 

పలకరిస్తే రాణిముత్యాలు

హోయ్.. గోరువంక 

ఓపదింక దూరభారాలు


చరణం 1 :


తుమ్మెదలాడే కళ్లు.. 

తూనీగంటి ఒళ్లు

అహ.. వయసై కోరే.. 

వలపే వాలే వాలిన పొద్దుల్లో


చెక్కిలల్లో సిగ్గు.. 

చేతికి తగిలే నిగ్గు

హోయ్.. గోరింటాకై పండే 

ఎర్రని ఎండల మొగ్గల్లో


ఎదమాటునా.. ఆరాటమే...

పొదమాటునా.. పోరాటమై

పెట్టేలగ్గం ఎన్నాలంటూ 

పెదవే అడిగింది

పెట్టిన ముద్దుకు పెదవే వణికి 

మధువై పొంగింది


హా.. రామచిలక పలకరిస్తే 

రాణిముత్యాలు

గోరువంక బదులు చెపితే 

కోటి రత్నాలు

ఆ మావిడితోటల్లో.. 

ఓ మాపటిలగ్నంలో

కొమ్మకో కోయిలా... 

కమ్మగా పాడగా.. కౌగిలే ఇల్లుగా.. 

పెళ్ళి  పెళ్ళి పెళ్ళి  


రామచిలక పలకరిస్తే 

రాణిముత్యాలు

గోరువంక ఓపదింక 

దూరభారాలు


చరణం 2 :


వీణలు మీటే పలుకు... 

విరులై విరిసే కులుకు

హోయ్ సొగసై నాలో 

సొదలే రేపే రేపటి ఆశల్లో

కౌగిలి పట్టే ఒడుపు... 

పట్టీ విడవని వలపు

ఆ పగలు రేయి ఒకటే 

చేసే చేసిన బాసల్లో


బిడియాలను... తుడిచేసుకో

హృదయాలను.. ముడి వేసుకో


వెన్నెల కన్నా తెల్లని 

చీరలు కట్టుకు రావాలి

మల్లెల కన్నా చల్లని 

మనసులు అల్లుకుపోవాలి


హోయ్..రామచిలుకా 

ఎందుకే నీ రాయబారాలు

గోరువంక ఓపదింక 

దూరభారాలు

ఆ మావిడితోటల్లో.. 

ఓ మాపటిలగ్నంలో

కొమ్మకో కోయిలా... 

కమ్మగా పాడగా  కౌగిలే ఇల్లుగా.. 

పెళ్ళి  పెళ్ళి పెళ్ళి 


రామచిలక పలకరిస్తే 

రాణిముత్యాలు

గోరువంక బదులు చెపితే 

కోటి రత్నాలు

ఆ మల్లెల మాసంలో..

ఓ మంచి ముహూర్తంలో

కట్నమే పువ్వుగా కానుకే నవ్వుగా.. 

కౌగిలే ఇల్లుగా.. 

పెళ్ళి  పెళ్ళి పెళ్ళి   


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

తగునా ఇది మామా | Taguna Idi Mama | Song Lyrics | Ramudu Bheemudu (1964)

తగునా ఇది మామా చిత్రం :  రాముడు-భీముడు (1964) సంగీతం :  పెండ్యాల గీతరచయిత :  కొసరాజు నేపథ్య గానం :  ఘంటసాల, మాధవపెద్ది   పల్లవి : తగునా ఇది ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు