ఏ పాట నే పాడను
చిత్రం : సీతామాలక్ష్మి (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : సుశీల, వాణీ జయరాం
సాకి :
అలలు కదిలినా పాటే
ఆకు మెదిలినా పాటే
కలలు చెదిరినా పాటే
కలతచెందినా పాటే
పల్లవి :
ఏ పాట నే పాడను...
బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
చరణం 1 :
ఏలుకుంటే పాట
మేలుకుంటే పాట
పాడుకుంటే పాట
మా దేవుడు
ఏలుకుంటే పాట
మేలుకుంటే పాట
పాడుకుంటే పాట
మా దేవుడు
శ్రీమన్నభీష్ట వరదాఖిల లోకబంధో
శ్రీ శ్రీనివాస జగదేక దయైక సింధో
శ్రీదేవతాగృహ భుజాంతర దివ్యమూర్తే
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం..
ఆ సుప్రభాతాలు... ఆ భక్తిగీతాలు
పాడకుంటే మేలుకోడు ...
మమ్మేలుకోడు
ఏ పాట నే పాడను...
చరణం 2 :
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
తల్లడిల్లే వేళ తల్లి పాడే జోల
పాల కన్నా తీపి పాపాయికి
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన
దశరథ తనయ లాలీ
రామలాలీ మేఘశ్యామ లాలీ
తామరస నయన
దశరథ తనయ లాలీ
ఆ... రామలాలికి.. ఆ ప్రేమగీతికి
రాముడైన పాప ఇల్లాలికి...
ఈ లాలికీ..
ఏ పాట నే పాడను...
బ్రతుకే పాటైన పసివాడను
ఏ పాట నే పాడను...
చరణం 3 :
చేరువై హృదయాలు
దూరమైతే పాట
జంట బాసిన గువ్వ
ఒంటి బ్రతుకే పాట
ఎందుకో ..ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎందుకో...
నా మీద అలిగాడు చెలికాడు
ఎదురు చూసిన చూపు
చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట
కల అయిన కాలేడు
ఎదురు చూసిన చూపు
చుక్కలైనా రాడు
నిదురకాచిన కంట
కల అయిన కాలేడు
గారాలు నీరాయే
తీరాలు వేరాయే
మనసు మీరాలాయే
వయసేటి పాలాయే
ఎందుకో ..ఎందుకో...నా మీద
అలిగాడు చెలికాడు...
కలలు చెదిరినా పాటే...
కలతచెందినా పాటే
ఏ పాట నే పాడను...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి