RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

4, ఆగస్టు 2025, సోమవారం

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి | శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం | Sakala Shubadayani | Song Lyrics | RKSS Creations

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి 



శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం


రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి

పద్మాసని చిద్విలాసిని కల్పవల్లి మాత

మా ఇంట వెలసిన సౌభాగ్య ప్రదాయిని

నిత్య పూజలంది ప్రీతినొంది కొలువుదీరి

కోరకయేకూర్చు అష్ట ఐశ్వర్యాలు తల్లీ …

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 1:

 

అమ్మల గన్న యమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మీ

భక్తుల పాలిటి కల్పతరువు నీవమ్మ

ధనధాన్య వృద్ధి సిరిసంపదల తల్లి

మహా విష్ణు వక్ష స్థలిని విడువలేకున్న

అయ్యతోనే మాయింట కొలువుతీరమ్మా

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 2:

 

క్షీరసాగర పుత్రి గజవాహిని ఇందిరా

కమలనేత్రి చంద్ర సహోదరి వైష్ణవీ

పశుపు కుంకుమల సౌభాగ్య ప్రదాయనీ

కొనచూపుతోనే కనకంబు కురిపించు

వైకుంఠ వాసిని కారుణ్య స్వరూపిణి

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …


- RKSS Creations...

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఫాలనేత్రాణాల ప్రబల విధ్యుల్లతా | Phalanetranala Prabhala | Song Lyrics | Annamayya (1997)

ఫాలనేత్రాణాల ప్రబల విధ్యుల్లతా కేళి చిత్రం : అన్నమయ్య (1997) సంగీతం : ఎం ఎం కీరవాణి  రచన : వేటూరి సుందరరామమూర్తి  గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్య...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు