RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
ramakrishna duvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
ramakrishna duvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2026, గురువారం

జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి | Janmastami Srikrishna Janmastami | Song Lyrics | RKSS Creations

 శ్రీకృష్ణ జన్మాష్టమి పాట


జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


పరిత్రాణాయ సాధూనాం

వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ

సంభవామి యుగే యుగే ||

 

పల్లవి:


జన్మాష్టమి శ్రీకృష్ణ 

జన్మాష్టమి

పాలకడలిని వీడి 

నాగ శయనమీడి

మధురా నగరిలో 

చెరసాల నందు

రోహిణీ నక్షత్ర 

అష్టమి తిథి లోన

దేవకి దేవి 

అష్టమ గర్భమందు

జన్మించెను భగవానుడు 

జన్మించెను…

 

చరణం 1:


ధరణిలో పెరుగుతున్న 

దానవకాండ

ధర్మానికి పట్టెను గదా 

దమనకాండ

అవనికి తీరని 

వ్యథ లే కలుగంగ

శాంతిని స్థాపన చేయగ 

ఆ హరియే

శ్రీకృష్ణునిగ 

జన్మించిన సుదినం…

 

చరణం 2:


బాలుడైనను పలు 

రక్కసుల తృంచె

కాళీయ పడగలణచి 

నాట్యమాడెనే

జగతికి జ్ఞానమొసగ 

గీతను భోధించె

కుజనుల కూల్చధర్మ 

యుద్ధము చేయించె

ధర్మ చక్రమును 

స్థిరముగ ధరను నిలపె

 

- రామకృష్ణ దువ్వు

28, జులై 2026, మంగళవారం

కనులు మూసినా అదేమిటో | Kanulu Moosina Ademito | Love Feel Song | Lyrics | RK Duvvu | RKSS Creations

కనులు మూసినా అదేమిటో..

ప్రేమ గీతం 

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 



పల్లవి:


కనులు మూసిన అదేమిటో 

ఆమె రూపం మరుగున పడకుంది

ఒళ్ళంతా మైకం కమ్మి 

మధురంగా వుంది 

నా కళ్ళూ మనసూ చిత్రంగా 

మాట వినకుంది …

ఇదేమిటి అని తలపోస్తే 

అదే ప్రేమని తెలిసింది 

ప్రేమని తెలిసింది…


చరణం 1:


రోజూ వీచే గాలైనా 

ఈరోజేంటో వింతగ వుంది

ఈలలు వేసి సైగలు చేస్తుంది 

తోటలో పూచిన గులాబీ 

మరింత మెరిసింది 

ఆమెను గురుతుకు తెచ్చింది 

ప్రేమజల్లులో మనసే తడిసింది

చిందులు వేస్తూ ప్రియా 

ప్రియా నీకై వెదకింది …


చరణం 2:


ఎండలో వేడి ఎంతున్నా 

ఆమె తలపులు వెన్నలలాగ వుంది

కురిసే ప్రతి చినుకూ

ఇరువురి పైనా చిలికింది 

సరిగంగ తానాలు చేసింది 

చలిగాలి తాకిన వణకిన మేను

చెలికై వెచ్చని గుండెను చూపింది

చెలీ నీకై వేచింది…


- రామకృష్ణ దువ్వు


నా జీవిత వనమున విరిసిన కుసుమము | స్నేహ గీతం | Friendship Song Lyrics | RK Duvvu | RKSS Creations

నా జీవిత వనమున విరిసిన కుసుమము 

స్నేహ గీతం (female)

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నా జీవిత వనమున విరిసిన 

కుసుమము నీ స్నేహమే చెలీ …

ఈ ఊపిరి వున్నంత వరకు విడువను 

నిన్ను నా ప్రాణమైన నెచ్చెలి..


చరణం 1:


పూవును నేనైతే పుప్పొడి నీవు

పరిమళమే మన చెలిమి

తోటలో నావెంట తోడుగ నీవుంటే

ప్రతి తరువూ ఫలముల పంటే 


ఆ దేవుడు దిగివచ్చి 

వరములు నాకిస్తే

బ్రతుకంతా చెలీ 

నీ స్నేహము చాలంటాను


చరణం 2:


మబ్బును నేనైతే నీరువు నీవు

కురిసే చిరుజల్లు మన స్నేహం 

కిరణం నేనైతే కాంతివి వీవు

ప్రతి బింబాలు మన బంధాలు 


నా నేస్తం తోడుంటే 

జీవన గతిలో

ముళ్ళబాటలున్నా 

పూలబాటలవును


- రామకృష్ణ దువ్వు



23, జులై 2026, గురువారం

నిన్నటి వరకు అనుకున్నానా | Ninnativaraku Anukunnana | Romantic Feeling Song Lyrics | RKSS Creations

నిన్నటి వరకు అనుకున్నానా 


Romantic Feeling Song

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నిన్నటి వరకు అనుకున్నానా

కలువ పువ్వు నే నౌతానని

చిలిపి చంద్రునికై చూస్తానని

సొగసు భారమై పోతుందని

వలపు తీపిగా అవుతుందని


నిన్నటి వరకు అనుకున్నానా..


చరణం 1:


తలార స్నానం చేసి నే 

తడారబెట్టుకొనుంటే 

నీలి కురుల మాటున 

మోమును దాచుకొనుంటే

గండు తుమ్మెదల్లె ఆ 

దుండగీడు చెలరేగే


చిగురుటాకు పెదవులపై 

దొంగ ముద్రనే వేసే

ఇదేమి వింతో ఏమయ్యిందో…

కోపమన్నదే రాకున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


చరణం 2:


బెట్టు చేస్తున్న నా 

తుంటరి సొగసును

గుట్టుగా నే 

పట్టు చీరలో చుట్టబెట్టగా


ఎట్టా చిక్కెనో చక్కని నడుము 

ఆ చుక్కల రేనికి

ఉక్కిరిబిక్కిరి చేయగ నన్ను 

చెక్కలిగింతలు చేసెనే

అదేమి దుడుకో ఏడ దాగెనో..

మనసు వాడికై వెదకుతున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


- రామకృష్ణ దువ్వు


19, జులై 2026, ఆదివారం

నవ్వులే పువ్వులై | నవతేజ్ బర్త్ డే పాట | Navtej Birthday Song Lyrics | RKSS Creations

 నవ్వులే పువ్వులై 

పరచాలి అడుగు అడుగున


నవతేజ్ బర్త్ డే పాట

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


జగతికి వెలుగునిచ్చే దినకరడు

సహస్ర కిరణాలు ప్రసరించే

భువిని చేరెను ఒక కిరణం…

రూపు దాల్చెనది ఒక నవ తేజం...

అదే మన నవ తేజ్…

 

పల్లవి:


నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 1:


అమ్మా నాన్నల 

ముద్దుల బాలుడు

అక్కకు ప్రాణ స్నేహితుడు

పెద్దలందరకు విధేయుడు

ముద్దుల మురిపాల గోపాలుడు

చదువులలోను ఆటలలోను

చురుకైన వాడు అది ..

నవ్ తేజ్…

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 2:


కుంచె పట్టినాడంటే 

బొమ్మలే కదలాడు

కలము పట్టినాడంటే 

కవితలే పారును

మిత్రులందరితో 

కేరింతలాడు

మాటమీరని 

రాముడంటి వాడు

భక్తి తోడ మారుతి 

గుండెలోన వుండు

భయమంటే ఎరుగని వాడు .. 

నవ తేజ్..

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

- రామకృష్ణ దువ్వు

 

7, జులై 2026, మంగళవారం

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు | వీరూ పుట్టినరోజు పాట | Birthday Song Veeru Lyrics | RKSS Creations

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు


వీరూ పుట్టినరోజు పాట

రచన : రామకృష్ణ దువ్వు 

Production : RKSS Creations...

 

సాకి:

 

ప్రతిరోజూ ఉదయించును 

ఆ సూర్యుడు

ఈరోజే జన్మించెను 

మా శివ విరాజుడు

పున్నమి నాడే అగుపించును 

పూర్ణ చంద్రుడు

ప్రతిరోజూ వెన్నెల కురిపించు 

ఈ నెలబాలుడు

 

పల్లవి:

 

కన్నతల్లి కళ్ళల్లో 

ఆనందపు వెలుగులు

కన్నతండ్రి గుండెల్లో 

ఆశల సౌధాలు

ఆనందాలను ఆరబోసి

ఆకాశం దిగి వచ్చింది

మా యింట మొదలైంది వేడుక

నీ పుట్టిన రోజు వేడుక

పుట్టిన రోజు వేడుక

 

హేపీ బర్త్ డే వీరూ

హేపీ బర్త్ డే వీరూ

 

చరణం 1:

 

నిరంతరం వెలుగును 

ఇచ్చే దినకరుడు

నీకు స్ఫూర్తి ప్రదాత కావాలి

పాలకడలిలో 

పుట్టిన చంద్రుడు

నీమోమున నిలచి 

అందమౌను

నిన్న మొన్నటి 

పసి అడుగులు

విజయాల బాటలపై 

సాగుతున్నాయి

 

చరణం 2:

 

అందరి మురిపాల 

ముద్దు బాలుడు

అక్కమాట జవదాటని 

మేటి తమ్ముడు

చదువులందు వెలుగొందే 

తొలి విద్యార్థి

ఆటలైన పాటలైన 

ముందుండే పోరడు

దశవసంతాల 

జన్మదిన దీవెనలు

నూరేళ్ళ జీవితం 

సాగాలి హాయిగా

 

- రామకృష్ణ దువ్వు

RKSS Creations...




1, జులై 2026, బుధవారం

కన్ను మూసినా వెలుగే | వైజాగ్ యూత్ సాంగ్ | Kannu Moosina Veluge | Song Lyrics | RK Duvvu | RKSS Creations

 కన్ను మూసినా వెలుగే


వైజాగ్ యూత్ సాంగ్ 

రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

కన్ను మూసినా వెలుగే…

గుండె వెన్నెలై కరిగే!

అడుగు అడుగునా రేగే…

సోయగాల సడి కవ్వింతలే!

అంతులేని ఈ ఆనందాన్ని…

అంతా నీ సొంతమే చేసుకోరా…!


చరణం 1:

 

జగదాంబ జంక్షన్ లో 

జావళీలే పాడరా!

సిరిపురం సెంటర్ లో 

చిందలేసి ఆడరా!

అప్పన్న కొండపై ఆశీస్సులంది …

ఋషికొండలో ఖుషీ ఖుషీలు!

హుషారులోన కేరింతలు  కలిపి…

రాజీలేని రోజు గడపరా…!

 

చరణం 2:

 

రైలుబండి స్టేషన్ లో 

రాక్ అండ్ రోలే చెయ్యరా!

రేడియో స్టేషన్ లో 

పాప్ సాంగ్ పాడరా !

ఆర్కే బీచ్ లో ఆరంగేట్రం…

ఉడా పార్క్ లో మెగా ప్రోగ్రాం!

అవకాశాలనే అందుకొని…

ఆకాశానికి నిచ్చెన వెయ్యరా…!

 

- రామకృష్ణ దువ్వు

 

24, జూన్ 2026, బుధవారం

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ | Akasanni Chudu Talavanchadu | Motivational Song Lyrics | RK Duvvu | RKSS Creations.

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ 


ప్రేరణ  గీతం 

రచన : రామకృష్ణ దువ్వు 

Album: RKSS Creations...


పల్లవి:


ఆకశాన్ని చూడు 

తలవంచదు ఎప్పుడూ

తనవైపు చూసేవాళ్ళ 

తలదించదు ఎన్నడూ

తనలో రగిలే 

సూర్యులు ఎందరున్నా

చినుకులు రాల్చి 

ఊపిరి నిల్పు అవనిపైనా


చరణం 1:


కారుచీకటి కమ్మినా 

నీపైనే గొడుగై కాచును

కంటికగుపడదని 

పలచన చేయక

దించిన తల ఎత్తి 

నింగిలోన వెదకు…

మెరిసే తారలు 

నీతో ఊసులాడు…

నిన్నుగాంచి 

తమవాడిగ చెలిమిచేసె

తారలకే తార 

నువ్వు సూపర్ తార…


చరణం 2:


చూసే ప్రతి దిక్కూ 

నీ కథలో దృశ్యాలు

నడచే ప్రతి మనిషి 

నీ తెరపై నటులు

ఎవరూ కనని 

కమనీయం నీ కావ్యం

హితులందరు 

చేతులు కలిపిన గమ్యం

అదిగో అదిగో కదలే 

బొమ్మల నీ సృష్టి

శిరసు ఎత్తి స్వీకరించు 

ఆ విజయమాల


- రామకృష్ణ దువ్వు



23, జూన్ 2026, మంగళవారం

బంతిపూల మేడ గట్టి | Bantipoola Medagatti | Folk Song | RK Duvvu | RKSS Creations

బంతిపూల మేడ గట్టి 


జానపద గేయం  

రచన : రామకృష్ణ దువ్వు  


పల్లవి: 


అతడు :

బంతిపూల మేడగట్టి 

మల్లెపూల మంచమేసి

మనసులోన నిన్ను పెట్టి

వేచి చూస్తూ వున్నానే


ఆమె:  

కలువపూల తేరు గట్టి

వెన్నెలంత గొడుగు పట్టి

మరదలి మీద ఒట్టు పెట్టి

మోసుకొని పో మామ


చరణం 1:


అతడు: 

కొమ్మమీద గూడువుంది 

గూటిలోన గువ్వ వుంది

కమ్మనైన బువ్వ వుంది

గోలపెట్టే ఈడు వుంది

అందమైన తోడు కోసం

వయసుచేసే తొందరుంది


ఆమె:    

గొంతులోన కోకిలుంది

గుండెలోన రాగముంది

సొగసులోన తీగవుంది

 మేనిలోన మెరుపు వుంది

పొందుకోరే మామ కోసం

విందులీయ సిద్ధమంది


చరణం 2:


అతడు: 

సూరీడి చురుకు వుంది

సందమామ రూపముంది

సుడిగాలి పోటు వుంది

మెరక చేను పాటు వుంది

కొండవాగు దాటి వస్తే

ఇంటి దాన్ని సేసుకుంటా


ఆమె:

కందిరీగ కళ్ళదాన్ని

కారు మబ్బు కురుల దాన్ని

కమ్మనైన వంటకాలు

ముద్దు కలిపి మూటకడతా

అయ్యనడిగి వన్నె కాడ

నా చేయి అందుకోరా…


- రామకృష్ణ దువ్వు





9, జూన్ 2026, మంగళవారం

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన | Guttapalli Chelalona | Telugu Folk Song Lyrics | RKSS Creations

గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన


జానపద గేయం 

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి : 


గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన

పాలకంకి సొగసులున్న నవరంగీ


గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన

పాలకంకి సొగసులున్న నవరంగీ


వయసు పొంగులన్నీ మీదపడగానే

ఊరి పిట్టల పోరు పడలేకున్నాను


వయసు పొంగులన్నీ మీదపడగానే

ఊరి పిట్టల పోరు పడలేకున్నాను


చరణం 1:


నీ కళ్ళు చూస్తె రంగురాళ్ళ 

చమకులున్నాయే

గుండెలోన చెకుముకి రవ్వల 

ఏడి పుడుతుందే


నా కళ్ళతోటి పోటీగా 

కందిరీగ జోరుతున్నాయి

నా ఎనకెనకే  బారుతీరి 

పల్లె పోరగాళ్ళున్నారు


నీ కళ్ళు చూస్తె రంగురాళ్ళ 

చమకులున్నాయే

గుండెలోన చెకుముకి రవ్వల 

ఏడి పుడుతుందే


నా కళ్ళతోటి పోటీగా 

కందిరీగ జోరుతున్నాయి

నా ఎనకెనకే  బారుతీరి 

పల్లె పోరగాళ్ళున్నారు


గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన

పాలకంకి సొగసులున్న నవరంగీ


వయసు పొంగులన్నీ మీదపడగానే

ఊరి పిట్టల పోరు పడలేకున్నాను


చరణం 2:


నీ నడక చూస్తె నరాలన్ని 

బిగుసుకున్నాయే

గరువు నొదిలి నాకాళ్ళు 

నీయెంటే పడిపోయె


బండలైన గుండెసేసే 

కండరాల పోరగాడా

తాళిగడితే నా సొగసుల 

మారాజువి నువ్వేరా


నీ నడక చూస్తె నరాలన్ని 

బిగుసుకున్నాయే

గరువు నొదిలి నాకాళ్ళు 

నీయెంటే పడిపోయె


బండలైన గుండెసేసే 

కండరాల పోరగాడా

తాళిగడితే నా సొగసుల 

మారాజువి నువ్వేరా


గుత్తపల్లి చేలలోన ఎత్తుగ ఎదిగిన

పాలకంకి సొగసులున్న నవరంగీ


వయసు పొంగులన్నీ మీదపడగానే

ఊరి పిట్టల పోరు పడలేకున్నాను


- RKSS Creations...




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు