RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
private albums లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
private albums లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2026, గురువారం

జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి | Janmastami Srikrishna Janmastami | Song Lyrics | RKSS Creations

 శ్రీకృష్ణ జన్మాష్టమి పాట


జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


పరిత్రాణాయ సాధూనాం

వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ

సంభవామి యుగే యుగే ||

 

పల్లవి:


జన్మాష్టమి శ్రీకృష్ణ 

జన్మాష్టమి

పాలకడలిని వీడి 

నాగ శయనమీడి

మధురా నగరిలో 

చెరసాల నందు

రోహిణీ నక్షత్ర 

అష్టమి తిథి లోన

దేవకి దేవి 

అష్టమ గర్భమందు

జన్మించెను భగవానుడు 

జన్మించెను…

 

చరణం 1:


ధరణిలో పెరుగుతున్న 

దానవకాండ

ధర్మానికి పట్టెను గదా 

దమనకాండ

అవనికి తీరని 

వ్యథ లే కలుగంగ

శాంతిని స్థాపన చేయగ 

ఆ హరియే

శ్రీకృష్ణునిగ 

జన్మించిన సుదినం…

 

చరణం 2:


బాలుడైనను పలు 

రక్కసుల తృంచె

కాళీయ పడగలణచి 

నాట్యమాడెనే

జగతికి జ్ఞానమొసగ 

గీతను భోధించె

కుజనుల కూల్చధర్మ 

యుద్ధము చేయించె

ధర్మ చక్రమును 

స్థిరముగ ధరను నిలపె

 

- రామకృష్ణ దువ్వు

28, జులై 2026, మంగళవారం

కనులు మూసినా అదేమిటో | Kanulu Moosina Ademito | Love Feel Song | Lyrics | RK Duvvu | RKSS Creations

కనులు మూసినా అదేమిటో..

ప్రేమ గీతం 

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 



పల్లవి:


కనులు మూసిన అదేమిటో 

ఆమె రూపం మరుగున పడకుంది

ఒళ్ళంతా మైకం కమ్మి 

మధురంగా వుంది 

నా కళ్ళూ మనసూ చిత్రంగా 

మాట వినకుంది …

ఇదేమిటి అని తలపోస్తే 

అదే ప్రేమని తెలిసింది 

ప్రేమని తెలిసింది…


చరణం 1:


రోజూ వీచే గాలైనా 

ఈరోజేంటో వింతగ వుంది

ఈలలు వేసి సైగలు చేస్తుంది 

తోటలో పూచిన గులాబీ 

మరింత మెరిసింది 

ఆమెను గురుతుకు తెచ్చింది 

ప్రేమజల్లులో మనసే తడిసింది

చిందులు వేస్తూ ప్రియా 

ప్రియా నీకై వెదకింది …


చరణం 2:


ఎండలో వేడి ఎంతున్నా 

ఆమె తలపులు వెన్నలలాగ వుంది

కురిసే ప్రతి చినుకూ

ఇరువురి పైనా చిలికింది 

సరిగంగ తానాలు చేసింది 

చలిగాలి తాకిన వణకిన మేను

చెలికై వెచ్చని గుండెను చూపింది

చెలీ నీకై వేచింది…


- రామకృష్ణ దువ్వు


నా జీవిత వనమున విరిసిన కుసుమము | స్నేహ గీతం | Friendship Song Lyrics | RK Duvvu | RKSS Creations

నా జీవిత వనమున విరిసిన కుసుమము 

స్నేహ గీతం (female)

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నా జీవిత వనమున విరిసిన 

కుసుమము నీ స్నేహమే చెలీ …

ఈ ఊపిరి వున్నంత వరకు విడువను 

నిన్ను నా ప్రాణమైన నెచ్చెలి..


చరణం 1:


పూవును నేనైతే పుప్పొడి నీవు

పరిమళమే మన చెలిమి

తోటలో నావెంట తోడుగ నీవుంటే

ప్రతి తరువూ ఫలముల పంటే 


ఆ దేవుడు దిగివచ్చి 

వరములు నాకిస్తే

బ్రతుకంతా చెలీ 

నీ స్నేహము చాలంటాను


చరణం 2:


మబ్బును నేనైతే నీరువు నీవు

కురిసే చిరుజల్లు మన స్నేహం 

కిరణం నేనైతే కాంతివి వీవు

ప్రతి బింబాలు మన బంధాలు 


నా నేస్తం తోడుంటే 

జీవన గతిలో

ముళ్ళబాటలున్నా 

పూలబాటలవును


- రామకృష్ణ దువ్వు



19, జులై 2026, ఆదివారం

నవ్వులే పువ్వులై | నవతేజ్ బర్త్ డే పాట | Navtej Birthday Song Lyrics | RKSS Creations

 నవ్వులే పువ్వులై 

పరచాలి అడుగు అడుగున


నవతేజ్ బర్త్ డే పాట

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


జగతికి వెలుగునిచ్చే దినకరడు

సహస్ర కిరణాలు ప్రసరించే

భువిని చేరెను ఒక కిరణం…

రూపు దాల్చెనది ఒక నవ తేజం...

అదే మన నవ తేజ్…

 

పల్లవి:


నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 1:


అమ్మా నాన్నల 

ముద్దుల బాలుడు

అక్కకు ప్రాణ స్నేహితుడు

పెద్దలందరకు విధేయుడు

ముద్దుల మురిపాల గోపాలుడు

చదువులలోను ఆటలలోను

చురుకైన వాడు అది ..

నవ్ తేజ్…

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

చరణం 2:


కుంచె పట్టినాడంటే 

బొమ్మలే కదలాడు

కలము పట్టినాడంటే 

కవితలే పారును

మిత్రులందరితో 

కేరింతలాడు

మాటమీరని 

రాముడంటి వాడు

భక్తి తోడ మారుతి 

గుండెలోన వుండు

భయమంటే ఎరుగని వాడు .. 

నవ తేజ్..

 

నవ్వులే పువ్వులై పరచాలి 

అడుగు అడుగున

ఆ నడకలే ప్రగతిలో సాగాలి 

గెలుపు బాటన

గడచిన ప్రతియేడూ ఒక 

మధుర జ్ఞాపకం

నడిపించును నూరేళ్లు 

నిను సుఖమయం

 

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

హ్యాపీ బర్త్ డే నవ తేజ్..

 

- రామకృష్ణ దువ్వు

 

24, జూన్ 2026, బుధవారం

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ | Akasanni Chudu Talavanchadu | Motivational Song Lyrics | RK Duvvu | RKSS Creations.

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ 


ప్రేరణ  గీతం 

రచన : రామకృష్ణ దువ్వు 

Album: RKSS Creations...


పల్లవి:


ఆకశాన్ని చూడు 

తలవంచదు ఎప్పుడూ

తనవైపు చూసేవాళ్ళ 

తలదించదు ఎన్నడూ

తనలో రగిలే 

సూర్యులు ఎందరున్నా

చినుకులు రాల్చి 

ఊపిరి నిల్పు అవనిపైనా


చరణం 1:


కారుచీకటి కమ్మినా 

నీపైనే గొడుగై కాచును

కంటికగుపడదని 

పలచన చేయక

దించిన తల ఎత్తి 

నింగిలోన వెదకు…

మెరిసే తారలు 

నీతో ఊసులాడు…

నిన్నుగాంచి 

తమవాడిగ చెలిమిచేసె

తారలకే తార 

నువ్వు సూపర్ తార…


చరణం 2:


చూసే ప్రతి దిక్కూ 

నీ కథలో దృశ్యాలు

నడచే ప్రతి మనిషి 

నీ తెరపై నటులు

ఎవరూ కనని 

కమనీయం నీ కావ్యం

హితులందరు 

చేతులు కలిపిన గమ్యం

అదిగో అదిగో కదలే 

బొమ్మల నీ సృష్టి

శిరసు ఎత్తి స్వీకరించు 

ఆ విజయమాల


- రామకృష్ణ దువ్వు



23, జూన్ 2026, మంగళవారం

బంతిపూల మేడ గట్టి | Bantipoola Medagatti | Folk Song | RK Duvvu | RKSS Creations

బంతిపూల మేడ గట్టి 


జానపద గేయం  

రచన : రామకృష్ణ దువ్వు  


పల్లవి: 


అతడు :

బంతిపూల మేడగట్టి 

మల్లెపూల మంచమేసి

మనసులోన నిన్ను పెట్టి

వేచి చూస్తూ వున్నానే


ఆమె:  

కలువపూల తేరు గట్టి

వెన్నెలంత గొడుగు పట్టి

మరదలి మీద ఒట్టు పెట్టి

మోసుకొని పో మామ


చరణం 1:


అతడు: 

కొమ్మమీద గూడువుంది 

గూటిలోన గువ్వ వుంది

కమ్మనైన బువ్వ వుంది

గోలపెట్టే ఈడు వుంది

అందమైన తోడు కోసం

వయసుచేసే తొందరుంది


ఆమె:    

గొంతులోన కోకిలుంది

గుండెలోన రాగముంది

సొగసులోన తీగవుంది

 మేనిలోన మెరుపు వుంది

పొందుకోరే మామ కోసం

విందులీయ సిద్ధమంది


చరణం 2:


అతడు: 

సూరీడి చురుకు వుంది

సందమామ రూపముంది

సుడిగాలి పోటు వుంది

మెరక చేను పాటు వుంది

కొండవాగు దాటి వస్తే

ఇంటి దాన్ని సేసుకుంటా


ఆమె:

కందిరీగ కళ్ళదాన్ని

కారు మబ్బు కురుల దాన్ని

కమ్మనైన వంటకాలు

ముద్దు కలిపి మూటకడతా

అయ్యనడిగి వన్నె కాడ

నా చేయి అందుకోరా…


- రామకృష్ణ దువ్వు





22, జూన్ 2026, సోమవారం

అమ్మోరి పండగని అయ్యింటికి పోతివి | Ammori Pandagani | Folk Song Lyrics | RKSS Creations

అమ్మోరి పండగని అయ్యింటికి పోతివి 


జానపద గేయం 

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


అమ్మోరి పండగని 

అయ్యింటికి పోతివి

శంకరయ్య తోడుగ 

అమ్మోరు కొలువాయె

తోడులేక ఇరహం లో 

ఏగిపోయి వున్నాను

పరువాలను బిగకట్టి 

బేగిరాయె కొండమ్మా


చరణం 1:


కొండమ్మా … ఓ కొండమ్మా..

గుండెలోన దిగులాయె 

మెతుకు గొంతు దిగదాయె

అగ్గేసిన బొగ్గులారె 

కుండలోన కూడు తరగదాయె

దాపుగ గాచిన సంపెంగలు 

పడతేదని సంపుతుండె

గదిలోపల దీపాలారె మదిలోన 

నీ ఊసె కవుకుతున్నాదే


అమ్మోరి పండగని 

అయ్యింటికి పోతివి

శంకరయ్య తోడుగ 

అమ్మోరు కొలువాయె

తోడులేక ఇరహం లో 

ఏగిపోయి వున్నాను

పరువాలను బిగకట్టి 

బేగిరాయె కొండమ్మా


చరణం 2:


మావా… నా మావా…

అయ్యింటిలో నేనున్నా 

దేసంతా నీమీదే

నోటిలోన ముద్ద పెడితే 

గొంతులోన ఆగిపోయె

నీ సూపులేక నా సొగసు 

అమావాస్య కలువనాయె

ముద్దులన్ని మూటకట్టి 

నీ కోసమె ఎలుపొచ్చా..


అమ్మోరి పండగని 

అయ్యింటికి పోతిని

ఈ శంకరయ్య తోడుంటే 

అమ్మోరిగ కొలువుంటా

నీవు నేను కలసుంటే 

ఇరహాలే ఎగిరిపోవు

పరువాల విందులు 

నా మామతో పొందులు


- రామకృష్ణ దువ్వు


4, మే 2026, సోమవారం

స్వాగతం మా బంగారు తల్లి స్వాగతం | Swagatham Maa Bangaru Thalli | Song Lyrics | RK Duvvu | RKSS Creations

 ఈశా ఆహ్వానం పాట


స్వాగతం .. మా బంగారు తల్లి స్వాగతం

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


అరుణ బింబము అరుదెంచెను

ధరిత్రిన తిమిరాన్ని తరిమి

ప్రద్యూష కిరణాలు పరచి

అవనికి నవ్య అందాలొసకగ

తళుకు లీను కిరణాలతో …

అరుణాచలేశుని వర ప్రసాదిని

గిరిపుత్రి భవాని శివాని ఈశా…

 

పల్లవి:


స్వాగతం .. మా బంగారు తల్లి స్వాగతం

చిన్ని పాదాలతో మా ఇంట కొలువుండ

నీకంటి కాంతులే పున్నమి చంద్రుడయి

మాయింట కురవాలి పండు వెన్నెల

నీ అల్లరే మా హృదయాల ఆలంబన

స్వాగతం, మా బంగారు తల్లి! స్వాగతం

 

చరణం 1:


భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ రాణి

సాహసం నీకు చైతన్యం కావాలి

భారత కోకిల సరోజిని స్ఫూర్తితో

సుశీలమ్మ జానకమ్మ నీ గొంతున పలకాలి

ఆటలందు మేటిగా సిందూ నెహ్వాలు

హర్మను స్మృతి హంపీలు ఆదర్శం కావాలి

 

చరణం 2:


నీ అడుగులు మోపినంత ఈ నేల

పరవశించి పరిమళించి పులకిరించు

నీ బుగ్గల నిగ్గు చూసి నింగిలోని

తారకలు మిణుకు మంటు చిన్నబోవు

అస్త్రాలయ సీమనుండి ప్రభవించిన

నిర్మల సమ్మోహన దివ్యాస్త్రం … ఈశా …

 

- రామకృష్ణ దువ్వు





21, ఏప్రిల్ 2026, మంగళవారం

లక్షిత్ పుట్టినరోజు పాట | Lakshit Birthday Song | Chiru Chiru Navvula Kannayya | Song Lyrics | RKSS Creations

లక్షిత్ పుట్టినరోజు పాట 



చిరుచిరు నగవుల కన్నయ్యా

రచన : రామకృష్ణ దువ్వు 

Album : RKSS Creations


సాకి:


నంద గోకులమందు 

తిరుగాడిన కన్నయ్యా

పాలు మీగడల మక్కువ తీరక

మాయింట వెలసావా 

ఓ ముద్దు లల్లా …..


పల్లవి:


చిరుచిరు నగవుల కన్నయ్యా

నీ కన్నుల కురిసేను వెన్నెలయ్యా

బుడిబుడి నడకల చిన్ని లక్షితా

అడుగడుగున నీకు శ్రీరామ రక్ష 


శుక్లపక్ష చంద్రుడల్లె పెరగాలి నీవు

ప్రతియేటా నీకు జరగాలి పండుగ 

పుట్టినరోజు పండుగ …


హేపీ బర్త్ డే లక్షిత్ …

హేపీ బర్త్ డే లక్షిత్ …

హేపీ బర్త్ డే లక్షిత్ …



చరణం 1:


అమ్మానాన్నకు ఆరో ప్రాణం 

అందరికీ నీవు ముద్దుల మురిపెం

నీవు నడచినంతట నందన వనము 

దివిలోని దేవతలు ఇలలోని పెద్దల 

దీవెనలంది జీవించు నిండుగా …


చరణం 2:


రోలుకు కట్టని అమ్మ ప్రేమతో 

వానను తడపని నాన్న ఛాయలో 

కలియుగ దైవము సిరిపతి నీడలో 

అడుగు అడుగునా జయ గీతికలతో 

విజయుడవై నీవు వర్ధిల్లు లక్షితా …


- రామకృష్ణ దువ్వు …

4, ఆగస్టు 2025, సోమవారం

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి | శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం | Sakala Shubadayani | Song Lyrics | RKSS Creations

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి 



శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం


రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి

పద్మాసని చిద్విలాసిని కల్పవల్లి మాత

మా ఇంట వెలసిన సౌభాగ్య ప్రదాయిని

నిత్య పూజలంది ప్రీతినొంది కొలువుదీరి

కోరకయేకూర్చు అష్ట ఐశ్వర్యాలు తల్లీ …

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 1:

 

అమ్మల గన్న యమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మీ

భక్తుల పాలిటి కల్పతరువు నీవమ్మ

ధనధాన్య వృద్ధి సిరిసంపదల తల్లి

మహా విష్ణు వక్ష స్థలిని విడువలేకున్న

అయ్యతోనే మాయింట కొలువుతీరమ్మా

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 2:

 

క్షీరసాగర పుత్రి గజవాహిని ఇందిరా

కమలనేత్రి చంద్ర సహోదరి వైష్ణవీ

పశుపు కుంకుమల సౌభాగ్య ప్రదాయనీ

కొనచూపుతోనే కనకంబు కురిపించు

వైకుంఠ వాసిని కారుణ్య స్వరూపిణి

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …


- RKSS Creations...

3, జులై 2025, గురువారం

చిరునవ్వు పుట్టిందీరోజు | Chirunavvu Puttindi | Aadya Birthday song | RKSS Creations

 చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో



రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 1:

 

ఆకశాన ముగ్గులతో చుక్కలమరె చక్కగా

చుక్కల రధమెక్కి నెలఱేడు ఇలకేగెనే

ఆద్య మోమున నిలచెను ఆ రాకాశశి

నడచినంతట వెన్నెల విరబూయ

చిరుచిరు నడకల బంగరు బొమ్మ

నీ పుట్టినరోజు ఒక పండుగరోజు

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 2:

 

కన్నవారి కలల పైడి రూపానివి

నిన్నుకన్న కనుల కాంతి దీపానివి

చిరు నవ్వుల తోరణం నీవమ్మా

వెలుగులు పంచే దీపం మాయమ్మా

శుక్లపక్ష చంద్రుడల్లె ఎదగాలి నీవు

ఏటేటా జన్మ దినము జరపాలి మేము

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 3:

 

సన్నజాజి పువ్వులు విరిసినట్టు

చందమామ కాంతులు కురిసినట్టు

చిన్నారి పాప నవ్వులు పూసేనిట్టు

మా కంటి వెలుగు నీవేనమ్మా

మా గుండెలోన కొలువైనావమ్మా

పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

- రామకృష్ణ దువ్వు

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు