RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
hindu devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
hindu devotional songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, ఆగస్టు 2025, సోమవారం

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి | శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం | Sakala Shubadayani | Song Lyrics | RKSS Creations

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి 



శ్రీ మహాలక్ష్మి స్తుతి గీతం


రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

సకల శుభదాయని శ్రీ మహాలక్ష్మి దేవి

పద్మాసని చిద్విలాసిని కల్పవల్లి మాత

మా ఇంట వెలసిన సౌభాగ్య ప్రదాయిని

నిత్య పూజలంది ప్రీతినొంది కొలువుదీరి

కోరకయేకూర్చు అష్ట ఐశ్వర్యాలు తల్లీ …

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 1:

 

అమ్మల గన్న యమ్మ మాయమ్మ శ్రీ లక్ష్మీ

భక్తుల పాలిటి కల్పతరువు నీవమ్మ

ధనధాన్య వృద్ధి సిరిసంపదల తల్లి

మహా విష్ణు వక్ష స్థలిని విడువలేకున్న

అయ్యతోనే మాయింట కొలువుతీరమ్మా

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …

 

చరణం 2:

 

క్షీరసాగర పుత్రి గజవాహిని ఇందిరా

కమలనేత్రి చంద్ర సహోదరి వైష్ణవీ

పశుపు కుంకుమల సౌభాగ్య ప్రదాయనీ

కొనచూపుతోనే కనకంబు కురిపించు

వైకుంఠ వాసిని కారుణ్య స్వరూపిణి

అభయంకరీ జయ జయ మహా లక్ష్మీ …


- RKSS Creations...

3, జనవరి 2025, శుక్రవారం

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం | గోదాదేవి కళ్యాణం పాట | Godadevi Kalyam Song Lyrics | RKSS Creations

 గోదాదేవి కళ్యాణం పాట



రచన : రామకృష్ణ దువ్వు  

 

పల్లవి:

 

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

శ్రీదేవి భూదేవి లాలనలో పవళించి యున్న

శ్రీరంగనాధుని మురిపించి ప్రేమించి

మనువాడ వచ్చేను విరిమాల తోను

కనుచున్నవారకు కమనీయ అనుభూతి

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

 

చరణం 1:

 

తులసి మాలలతో తోరణాలు కట్టి

కవేరి జలములే పన్నీరు జల్లుచూ

వైకుంఠవాసుని ఇలపైన పెండ్లాడ

తిరుప్పావై కృతులు చేబూని ఆండాళ్ళు

సుకుమార పాదాలు సుమరాశిమీద

మందగమనముతో కోవెలలో రాగ

విస్మయాన జనులు చిత్రవీధిన చేరె

మంగళ వాయిద్యాలు మారుమ్రోగె

 

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

శ్రీదేవి భూదేవి లాలనలో పవళించి యున్న

శ్రీరంగనాధుని మురిపించి ప్రేమించి

మనువాడ వచ్చేను విరిమాల తోను

కనుచున్నవారకు కమనీయ అనుభూతి

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

 

చరణం 2:

 

వేద గానాలు పురమంతా పాడగా

దివినుండి దేవతలు ఆకాశమేతెంచె

నందన వనాలు విరిసె పూల సుగంధం

స్వామియానతిగైకొని అర్చకులాహ్వానించె

విల్లుపుర జనుల అప్పగింతల నడుమ

శిలనుండి స్వామి తరుణి చేయందుకొనగా

పాణిగ్రహణముతో స్వామిలో కలసిన

భక్త చింతామణి లోకమాత గోదాదేవి

 

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

శ్రీదేవి భూదేవి లాలనలో పవళించి యున్న

శ్రీరంగనాధుని మురిపించి ప్రేమించి

మనువాడ వచ్చేను విరిమాల తోను

కనుచున్నవారకు కమనీయ అనుభూతి

కళ్యాణం కళ్యాణం గోదా కళ్యాణం

 

- RKSS Creations...




21, డిసెంబర్ 2024, శనివారం

గోవింద గోపాల గోదా ప్రియలోల | గోదాదేవి తిరుప్పావై పాట | Godadevi Tiruppavai Song | RKSS Creations

 గోదాదేవి తిరుప్పావై పాట



రచన : రామకృష్ణ దువ్వు  

 

పల్లవి:

 

గోవింద గోపాల గోదా ప్రియలోల

గోవింద గోపాల గోదా ప్రియలోల

 

నీలవర్ణుడి చరణం చేరే మార్గము

ఆండాళ్ అమర తిరుప్పావై గీతము

పుష్పమాల ధరించి చేసిన తపము

చెలులందరకూ చూపె దివ్య మార్గము

గోదాదేవిని కీర్తించగను పుణ్య ఫలము

 

గోవింద గోపాల గోదా ప్రియలోల

గోవింద గోపాల గోదా ప్రియలోల

 

చరణం 1:

 

ధనుర్మాసపు పర్వదినములలో

నిద్రలేపె గోదా చెలియ గోపికలను

కలిసొచ్చి చన్నీట స్నానమాడితే

కర్మములన్నీ సమసి హరిని చేరుగా

గోదా మాటలు తిరుప్పావై పాటలు

రంగనాధుని మెడలో పూమాలలు

 

చరణం 2:

 

నందగోకులము కనరే విల్లుపుత్తూరున

కన్నెలందరు కన్నయ్యతోటి గోపికలు

ఆలమందలవిగో గోపాలునితో చనియె

వేణుగాన మాధురి వీనుల చేరగా

గోదా భక్తికి గోవిందుడు మురిసెగా

బృందావనమే ఇటకు తరలి వచ్చెగా


- RKSS Creations...

 



4, డిసెంబర్ 2024, బుధవారం

రామ నామము నోటిన నానిన చాలును | Ramanamamu Notina Chalunu | రామ నామ మహిమ పాట | Omkaram | RKSS Creations

 రామ నామ మహిమ పాట

 


రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:

 

రామ నామము నోటిన నానిన చాలును

తొలగిపోవు ఇడుములు కడుదూరము

పలుకరే జనులార పావన నామము

రామ రామ రామ రామ

సీతా రామ రామ రామ

రఘురామ రామ రామ

 

చరణం 1:

 

విశ్వామిత్ర యాగ రక్షక రామ

అహల్యా శాప విమోచన రామ

మిథిలా వాసుల ఆరాధ్య రామ

జానకి వలచిన కళ్యాణ రామ

 

రామ నామము నోటిన నానిన చాలును

తొలగిపోవు ఇడుములు కడుదూరము

పలుకరే జనులార పావన నామము

రామ రామ రామ రామ

సీతా రామ రామ రామ

రఘురామ రామ రామ

 

చరణం 2:

 

జనస్థానమున శాంతి స్థాపన రామ

సీతా వియోగ శోకపు ప్రేమ రామ

సుగ్రీవ చెలిమితో సౌశీల్య రామ

హనుమ కొలిచే భక్త వత్సల్య రామ

 

రామ నామము నోటిన నానిన చాలును

తొలగిపోవు ఇడుములు కడుదూరము

పలుకరే జనులార పావన నామము

రామ రామ రామ రామ

సీతా రామ రామ రామ

రఘురామ రామ రామ

 

చరణం 3:

 

భక్తజన సర్వ పాప హర రామ

తులసీదాస కృత మానస రామ

మానుష దానవ సంహార రామ

శ్రీరామ నామామృత రక్షక రామ

 

రామ నామము నోటిన నానిన చాలును

తొలగిపోవు ఇడుములు కడుదూరము

పలుకరే జనులార పావన నామము

రామ రామ రామ రామ

సీతా రామ రామ రామ

రఘురామ రామ రామ

 

- RKSS Creations...




26, నవంబర్ 2024, మంగళవారం

జయ జయ వినాయకా | Jaya Jaya Vinayaka | Song Lyrics | Omkaram | RKSS Creations

జయ జయ వినాయకా



రచన : రామకృష్ణ దువ్వు  


సాకి:


అనింద్య వాహనా అపర్ణ తనయా

కుడుములు గైకొని వరముల నొసగే

ఆనంద రూపా కైలాస నిలయా

ఆటంకాలను ఆవిరి చేసే గణపతి దేవా


పల్లవి:


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా

 

చరణం 1:


కైలాసమీడి ప్రతి ఏడాదీ

ఆకాశ వీధిని మాకోసమొచ్చేవు

ఊరూరనిలచి మా పూజలు

గైకొని వరముల నిచ్చేవు

కుడుములతోనే సంతసించి

ఎనలేని మా కోర్కెలు తీర్చేవు

నువు నీట మునిగి నీతోనే

మా కష్టాలు నీట ముంచేవు

నీరాక కోసం మరు ఏడాది

మేము ఎదురు చూచేము


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా


చరణం 2:


శ్రీ లక్ష్మీ గణపతిగ పూజలందుకొని

ప్రతినింటా సిరుల సంపదలిచ్చేవు

విద్యా గణపతివై వాడల వీధుల

మము బ్రోచి మాకెంతో జ్ఞానమిచ్చేవు

మూషిక వాహనుడై ఊరేగు వేళ

వాహన భాగ్యము అనుగ్రహించేవు

మహా గణపతిగా తోడుగ నిలచి

ఇంటింటి పెద్దవై జయములు కూర్చేవు


జయ జయ వినాయకా

జయ గణ నాయకా..

విజయాలను మాకు చేరువ చేసే

మంగళ మూర్తి వినాయకా…

జయ జయ వినాయకా 


- RKSS Creations...




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు