గోదాదేవి కళ్యాణం పాట
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి:
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
శ్రీదేవి భూదేవి
లాలనలో పవళించి యున్న
శ్రీరంగనాధుని
మురిపించి ప్రేమించి
మనువాడ వచ్చేను
విరిమాల తోను
కనుచున్నవారకు
కమనీయ అనుభూతి
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
చరణం 1:
తులసి మాలలతో
తోరణాలు కట్టి
కవేరి జలములే
పన్నీరు జల్లుచూ
వైకుంఠవాసుని
ఇలపైన పెండ్లాడ
తిరుప్పావై
కృతులు చేబూని ఆండాళ్ళు
సుకుమార పాదాలు
సుమరాశిమీద
మందగమనముతో
కోవెలలో రాగ
విస్మయాన జనులు
చిత్రవీధిన చేరె
మంగళ వాయిద్యాలు
మారుమ్రోగె
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
శ్రీదేవి భూదేవి
లాలనలో పవళించి యున్న
శ్రీరంగనాధుని
మురిపించి ప్రేమించి
మనువాడ వచ్చేను
విరిమాల తోను
కనుచున్నవారకు
కమనీయ అనుభూతి
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
చరణం 2:
వేద గానాలు
పురమంతా పాడగా
దివినుండి దేవతలు
ఆకాశమేతెంచె
నందన వనాలు
విరిసె పూల సుగంధం
స్వామియానతిగైకొని
అర్చకులాహ్వానించె
విల్లుపుర జనుల
అప్పగింతల నడుమ
శిలనుండి స్వామి
తరుణి చేయందుకొనగా
పాణిగ్రహణముతో
స్వామిలో కలసిన
భక్త చింతామణి
లోకమాత గోదాదేవి
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
శ్రీదేవి భూదేవి
లాలనలో పవళించి యున్న
శ్రీరంగనాధుని
మురిపించి ప్రేమించి
మనువాడ వచ్చేను
విరిమాల తోను
కనుచున్నవారకు
కమనీయ అనుభూతి
కళ్యాణం కళ్యాణం
గోదా కళ్యాణం
- RKSS Creations...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి