ఒక్క రాత్రి వచ్చిపోరా
చిత్రం : యుగ పురుషుడు (1978)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : వేటూరి
నేపధ్య గానం : బాలు, సుశీల,
పల్లవి :
ఒక్క రాత్రి వచ్చిపోరా..
ఒక్క రాత్రి వచ్చిపోరా...
వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట చెప్పి పోరా...
ఏడు జన్మలు వేచి వుంటా
ఒక్క రాత్రి వచ్చిపోరా...
ఒక్క రాత్రి వచ్చి పోవే...
ఒక్క రాత్రి వచ్చి పోవే...
వేయి పాన్పుల హయి నిస్తా..
ఒక్క మాట ఇచ్చి పోవే..
ఎన్ని జన్మలైనా కలసివుంటా..
ఒక్క రాత్రి వచ్చి పోవే...
చరణం 1 :
మెత్త మెత్తగా యెదనే
మత్తుగా హత్తుకుపోతా...
హాయి అంచు చూస్తా
మెత్త మెత్తగా యెదనే
మత్తుగా హత్తుకుపోతా...
హాయి అంచు చూస్తా
కన్నెమోజులే నిన్నల్లుకోనీ..
కన్నెమోజులే నిన్నల్లుకోనీ..
కౌగిలింతలే నా ఇల్లు కానీ
ఒక్క రాత్రి వచ్చిపోరా..
చరణం 2 :
ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము
ఆవిరావిరౌతున్నది నా అందము
ఆవురావురంటున్నది నీ కోసము
నీ సొగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి
నీ సొగసే ఆవిరైతే
నా వయసుకు ఊపిరి
పెదవెంగిలితో తీరును....
ప్రేమ అనే ఆకలి
ఒక్క రాత్రి వచ్చి పోవే...
ఒక్క రాత్రి వచ్చిపోరా ...
వేయి రాత్రుల వెన్నెలిస్తా
ఒక్క మాట ఇచ్చి పోవే...
ఎన్ని జన్మలైనా కలసివుంటా
ఒక్క రాత్రి వచ్చి పోవే..
ఒక్క రాత్రి వచ్చిపోరా ...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి