అనకు ఆ మాట మాత్రం అనకు
చిత్రం : గడుసు పిల్లోడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : సుశీల
పల్లవి :
అనకు... ఆ మాట మాత్రం అనకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
నీ మనసు మూసి వేశాననకు
నా మాట మరచిపోతాననకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
చరణం 1 :
నా కళ్ళలోనీ నీ రూపము...
కరిగేది కాదు కన్నీళ్లకు
నా కళ్ళలోనీ నీ రూపము...
కరిగేది కాదు కన్నీళ్లకు
నీ గుండెలోనీ నా గానము...
మాసేది కాదు మరచేందుకు
కాదనకు... లేదనకు...
కథ మార్చి పొమ్మనకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
చరణం 2 :
ప్రేమ పువ్వుల బాటనుకోకు...
పిరికివాడివై బాట మార్చకు
ప్రేమ పువ్వుల బాటనుకోకు...
పిరికివాడివై బాట మార్చకు
మనసు మిగిలితే చాలును మనకు...
మమతే గురుతది ఉన్నందుకు...
ఉన్నానూ.. నీ కొరకు..
ఉంటాను కడవరకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది ఆఖరి మాటని అనకు
నీ మనసు మూసి వేశాననకు
నా మాట మరచిపోతాననకు
అనకు... ఆ మాట మాత్రం అనకు
ఇది... ఆఖరి మాటని అనకు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి