తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
చిత్రం : శాంతి నివాసం (1986)
సాహిత్యం : వేటూరి సుందరరామ మూర్తి
గాయకులు : కె జె జేసుదాస్, పి సుశీల
సంగీతం : చక్రవర్తి
పల్లవి:
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
గిలిగింత గీతాలెన్నో
అలలు కదిపినవి అందాలలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ
పులకింత రాగాలెన్నో
పురులు విరిసినవి కౌగిళ్ళలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
చరణం 1:
సోగకనులే మూగ కలలై
లేత గుసగుసలాడెయ్యగా
మేను వణికి తేనె పెదవి
తీపి వలపులు తోడెయ్యగా
వయసుతో పరిచయం జరిగిన
తొలకరి పరిమళం
సోకుతున్న వేళ నీలో ఎన్ని అందాలో
గాడమైన కౌగిలింత ఎన్ని బంధాలో
అలుపు ఎరుగనిది ఈ లాహిరి
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
చరణం 2:
వాలుజడలో పూల గొడవ
వెన్ను తడిమి వేధించగా
పాల మెడలో లేత ఎడద
ప్రేమ జతులే పండించగా
జరగని ప్రతిదినం జరగక
తప్పని లాంచనం
రేగుతున్న ఈడు గిల్లి జోలపాడాలో
ముందుగానె జోలలింక నేర్చుకోవాలో
చాలు సరసమిక సందిళ్ళలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
శ్రీవారి అల్లరి శృతి మించిపోయే వేళ
గిలిగింత గీతాలెన్నో
అలలు కదిపినవి అందాలలో
తొలినాటి రాతిరి చలి తీరిపోయే వేళ
ఒడిలోని నా చెలి సొగసారబోసే వేళ
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి