ఓ హృదయం లేని ప్రియురాలా
చిత్రం: కన్నెమనసులు (1966)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: ఘంటసాల
పల్లవి:
ఓ హృదయం లేని ప్రియురాలా
ఓ హృదయం లేని ప్రియురాలా
వలపును రగిలించావు
పలుకక ఊర్కున్నావు
ఏంకావాలనుకున్నావు
వీడేం కావాలనుకున్నావు
ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా
చరణం 1:
చిరుజల్లు వలే చిలికావు..
పెను వెల్లువగా ఉరికావు
చిరుజల్లు వలే చిలికావు..
పెను వెల్లువగా ఉరికావు
సుడిగుండముగా వెలిశావు
అసలెందుకు కలిసావు...
నన్నెందుకు కలిసావు..
ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా
చరణం 2:
అగ్గి వంటి వలపంటించి
హాయిగ వుందామనుకోకు
అగ్గి వంటి వలపంటించి
హాయిగ వుందామనుకోకు
మనసు నుంచి మనసుకు పాకి
ఆరని గాయం చేస్తుంది...
అది తీరని తాపం ఔతుంది
ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా
చరణం 3:
నీ మనసుకు తెలుసు నా మనసు..
నీ వయసుకు తెలియదు నీ మనసు
నీ మనసుకు తెలుసు నా మనసు..
నీ వయసుకు తెలియదు నీ మనసు
రాయి మీటితే రాగం పలుకును
రాయి కన్న రాయివి నీవు...
కసాయివి నీవు
ఓ.. ఓ ఓ హృదయం లేని ప్రియురాలా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి