అవునన్నావ్ అవునన్నావ్
చిత్రం : గడుసు పిల్లోడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
అవునన్నావ్ అవునన్నావ్...
అడిగినదానికి అవునన్నావ్
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
అవునన్నా... అవునన్నా...
అడిగినదానికి అవునన్నా
అన్నాక ఎందుకు తొందరపడతావ్...
అన్నాక ఎందుకు తొందరపడతావ్...
చరణం 1 :
నేనా తొందర పడుతున్నది...
నీ అందం తరుముకు వస్తున్నది
నేనా తొందర పడుతున్నది...
నీ అందం తరుముకు వస్తున్నది
నేనా కంగారు పడుతున్నది...
నేనా కంగారు పడుతున్నది...
నీ తొందర చూస్తే దడపుడుతున్నది
నీ తొందర చూస్తే దడపుడుతున్నది
ఏమన్నావ్... నువ్ అడిగినదానికి ఔనన్నా
ఏమడిగావ్... నువ్ ఔనన్నదే నేనడిగా
ఏమన్నావ్... నువ్ అడిగినదానికి ఔనన్నా
ఏమడిగావ్... నువ్ ఔనన్నదే నేనడిగా
అవునన్నావ్ అవునన్నావ్...
అడిగినదానికి అవునన్నావ్
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
అన్నాక ఎందుకు తొందరపడతావ్...
చరణం 2 :
ఏదో దగ్గర అవుతున్నది...
ఈ దూరం బరువుగా తోస్తున్నది
ఏదో దగ్గర అవుతున్నది...
ఈ దూరం బరువుగా తోస్తున్నది
ఏదో ఒకటై పొమ్మన్నది...
ఏదో ఒకటై పొమ్మన్నది...
ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది...
ఈ ఇద్దరనేదే ఇక వద్దన్నది...
ఏం చేద్దాం...
వయసును మనసుకు వదిలేద్దాం
వదిలేద్దామా...
ముడి వేసి మరి వదిలేద్దాం...
ఏం చేద్దాం...
వయసును మనసుకు వదిలేద్దాం
వదిలేద్దామా...
ముడి వేసి మరి వదిలేద్దాం...
అవునన్నా... అవునన్నా...
అడిగినదానికి అవునన్నా
అన్నాక ఎందుకు తొందరపడతావ్...
అవునన్నావ్ అవునన్నావ్...
అడిగినదానికి అవునన్నావ్
అన్నాక ఎందుకు కంగారుపడతావ్...
ఆ.. ఆ... ఆ... ఆ.. అహా...హా
లలలాలాలలా...
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి