RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

6, జనవరి 2025, సోమవారం

కన్నులతో పలుకరించు వలపులు | Kannulatho Palukarinchu | Song Lyrics | Pelli Kanuka (1960)

కన్నులతో పలుకరించు వలపులు



చిత్రం : పెళ్లి కానుక (1960)

సంగీతం :  ఏ.ఎం. రాజ

గీతరచయిత :  ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం :  ఏ. ఎం. రాజ, సుశీల


పల్లవి:


కన్నులతో పలుకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు

కన్నులతో పలుకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు

రెండు ఏకమై ఒహొ... 

ప్రేమే లోకమై అహా

నా మది పాడే పరాధీనమై... 

అలాగా


కన్నులతో పలుకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు


చరణం : 1


చల్లని వేళ మల్లెల నీడ 

చక్కని దొంగ దాగెనట

చల్లని వేళ మల్లెల నీడ 

చక్కని దొంగ దాగెనట

దారులకాచి.. సమయము చూచి ..

దాచిన ప్రేమ దోచెనట

మరలా వచ్చెను... మనసే ఇచ్చెను

మరలా వచ్చెను... మనసే ఇచ్చెను

అతనే నీవైతే.. ఆమే నేనట ...

నిజంగా ....


కన్నులతో పలుకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు


చరణం : 2


నల్లని మేఘం మెల్లగ రాగ ...

నాట్యము నెమలి చేసినది

నల్లని మేఘం మెల్లగ రాగ... 

నాట్యము నెమలి చేసినది

వలచినవాడు సరసకు రాగ 

ఎంతో సిగ్గు వేసినది ...

తనివితీరా తనలో తానే...

తనివితీరా తనలో తానే... 

మనసే మురిసింది పరవశమొందగా... 

ఐ సీ


కన్నులతో పలుకరించు వలపులు

ఎన్నటికి మరువరాని తలపులు

రెండు ఏకమై... ప్రేమే లోకమై ...

నా మది పాడే పరాధీనమై ...


కన్నులతో పలుకరించు వలపులు ...

ఎన్నటికి మరువరాని తలపులు.. 


- పాటల ధనుస్సు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు