RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

19, జనవరి 2025, ఆదివారం

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే | Maa Intilona Mahalakshmi | Song Lyrics | Kondaveeti Simham (1981)

మా ఇంటిలోన మహలక్ష్మి నీవే



చిత్రం: కొండవీటి సింహం (1981)

సంగీతం: చక్రవర్తి

గీతరచయిత: వేటూరి

నేపధ్య గానం: బాలు, సుశీల


పల్లవి:


మా ఇంటిలోన మహలక్ష్మి నీవే

మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే

సిరులెన్నో ఉన్నా చిరునవ్వు నీవే

నీ కంట తడిని నే చూడలేను


మా ఇంటిలోన మహలక్ష్మి నీవే


చరణం 1:


గోరంత పసుపు నీవడిగినావు .. 

నూరేళ్ళ బ్రతుకు మాకిచ్చినావు

క్షణమొక్క ఋణమై పెరిగింది బంధం .. 

త్యాగాలమయమై సంసారబంధం

నీ చేయి తాకి చివురించె చైత్రం .. 

ఈ హస్తవాసే నాకున్న నేస్తం .. 

అనురాగ సూత్రం..


మా ఇంటిలోన మహలక్ష్మి నీవే

మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే

సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే

మీ కంట తడిని నే చూడలేను


చరణం 2:


మా అమ్మ నీవై కనిపించినావు .. 

ఈ బొమ్మనెపుడో కదిలించినావు

నిను చూడగానే పొంగింది రక్తం .. 

కనుచూపులోనే మెరిసింది పాశం

నీ కంటి చూపే కార్తీకదీపం .. 

దైవాలకన్నా దయ ఉన్న రూపం .. 

ఈ ఇంటి దీపం...


మా ఇంటిలోన మహలక్ష్మి నీవే

మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే

సిరులెన్నో ఉన్నా చిరునవ్వు మీదే

మీ కంట తడిని నే చూడలేను


మా ఇంటిలోన మహలక్ష్మి నీవే

మా కంట వెలిగే గృహలక్ష్మి నీవే


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు