RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

21, జనవరి 2025, మంగళవారం

అన్నా నీ అనురాగం | Anna Nee Anuragam | Song Lyrics | Adapaduchu (1967)

అన్నా నీ అనురాగం



చిత్రం : ఆడపడుచు (1967)

సంగీతం : టి. చలపతి రావు

గీతరచయిత : దాశరథి 

నేపధ్య గానం :  సుశీల 


పల్లవి :


అన్నా... నీ అనురాగం 

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా నీ అనురాగం... 


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం..


చరణం 1 :


మల్లెలవంటి మీ మనసులలో 

చెల్లికి చోటుంచాలి

ఎల్లకాలము ఈ తీరుగానే 

చెల్లిని కాపాడాలి..


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం....  

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా... 


చరణం 2 :


అన్నలు మీరే నా కన్నులుగా...  

నన్నే నడిపించాలి

తల్లీ తండ్రీ సర్వము మీరై...  

దయతో దీవించాలి


పుట్టిన రోజున మీ దీవేనలే... 

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం... 

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా... 


చరణం 3 :


ఇల్లాలినై నేనెచటికేగినా...  

చెల్లిని మదిలో నింపాలి

ఆడపడచుకు అన్నివేళలా...  

తోడూ నీడగా నిలవాలి


పుట్టిన రోజున మీ దీవేనలే...  

వెన్నెల కన్నా చల్లదనం

ఓ అన్నా నీ అనురాగం...  

ఎన్నో జన్మల పుణ్యఫలం

ఓ అన్నా..


- పాటల ధనుస్సు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు