RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జనవరి 2025, సోమవారం

ఈ ఉదయం నా హృదయం | Ee Udayam Naa Hrudayam | Song Lyrics | Kanne Manasulu (1966)

ఈ ఉదయం నా హృదయం



చిత్రం: కన్నెమనసులు (1966)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: ఆచార్య ఆత్రేయ

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి :


ఈ ఉదయం...నా హృదయం

పురులు విరిసి ఆడింది..

పులకరించి పాడింది

పురులు విరిసి ఆడింది..

పులకరించి పాడింది


ఈ ఉదయం..ఊ...ఊ...ఊ...ఊ...


చరణం 1:


పడుచు పిల్ల పయ్యెదలా...

పలుచని వెలుగు పరచినది

పడుచు పిల్ల పయ్యెదలా...

పలుచని వెలుగు పరచినది

కొండల కోనల మలుపుల్లో...

కొత్త వంపులు చూపినది


ఈ ఉదయం...ఊ...ఊ....ఊ...ఊ..


చరణం 2:


చిగురాకులతో చిరుగాలీ...

సరసాలాడి వచ్చినది

చక్కలిగింతలు పెట్టినదీ...

వేసవికే చలి వేసినదీ

ఓ..ఓ..ఓహో...ఓ...ఓ...ఓహో...


ఈ ఉదయం....ఊ...ఊ...ఊ...ఊ...


చరణం 3:


సరస్సున జలకాలాడేదెవరో...

తేటిని వెంట తిప్పేదెవరో

సరస్సున జలకాలాడేదెవరో...

తేటిని వెంట తిప్పేదెవరో

రేయికి సింగారించే కలువో...

పగలే వగలు రగిలే కమలమో...


ఈ ఉదయం...నా హృదయం..

పురులు విరిసి ఆడింది...

పులకరించి పాడింది

ఈ ఉదయం...ఊ...ఊ...ఊ...ఊ


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు