ఎందుకు నవ్వావంటే
చిత్రం : ఇదా లోకం (1973)
సంగీతం : చక్రవర్తి
గీతరచయిత : ఆరుద్ర
నేపథ్య గానం : బాలు
పల్లవి :
ఎందుకు నవ్వావంటే నువ్వు
ఏమని చెప్పేవు లోకులకు
ఎందుకు నవ్వావంటే నువ్వు
ఏమని చెప్పేవు లోకులకు
యేడవలేకా నవ్వావా..
నీ గోడు నవ్వులో దాచావా
యేడవలేకా నవ్వావా..
నీ గోడు నవ్వులో దాచావా
ఎందుకు నవ్వావంటే నువ్వు
ఏమని చెప్పేవు లోకులకు
మనసా... నా మనసా
చరణం 1 :
సీతను కోరెను నీచుడు...
హహహ
సీతను కోరెను నీచుడు...
హహహా
సీతను కోరెను నీచుడు...
సాయపడెను మారీచుడు
తారుమారుగా కథ మారిందా...
కారు చీకటి కమ్మేస్తుందని
చెప్పకపోతివే మనసా...
ఎంత ముప్పు తెస్తివే మనసా
చెప్పకపోతివే మనసా...
ఎంత ముప్పు తెస్తివే మనసా
చరణం 2 :
ఆడది దేవత రూపం...
ఆమె ఉసురే తీరని శాపం
అమ్మ తల్లి.. దాసోహం..
అమ్మా.. దాసోహం
ఆడది దేవత రూపం...
ఆమె ఉసురే తీరని శాపం
చెంప ఎప్పుడో ఛెళ్ళుమన్నదో.. ఓ.. ఓ..
చెంప ఎప్పుడో ఛెళ్ళుమన్నదో...
కొంప అప్పుడే గుల్లౌతుందని
తెలపకపోతివే మనసా...
ఇల్లు నిలుపకపోతివే మనసా
మనసా... నా మనసా
చరణం 3 :
గడ్డిని కతికే మనుషులు...
కారా చివరకు పశువులు
చెరపకురా నువు చెడేవు అన్నా...
పరమరహస్యం మరువరాదని
పెద్దలు చెప్పిరే మనసా...
ఆ సుద్ధులు మరిచావ్ మనసా
పెద్దలు చెప్పిరే మనసా...
ఆ సుద్ధులు మరిచావ్ మనసా
ఎందుకు నవ్వావంటే నువ్వు
ఏమని చెప్పేవు లోకులకు
యాడవలేకా నవ్వావా..
నీ గోడు నవ్వులో దాచావా
యాడవలేకా నవ్వావా..
నీ గోడు నవ్వులో దాచావా
ఎందుకు నవ్వావంటే నువ్వు
ఏమని చెప్పేవు లోకులకు
మనసా... నా మనసా
- పాటల ధనుస్సు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి