చీకటి పడుతోంది
చిత్రం : గడుసు పిల్లోడు (1977)
సంగీతం : కె.వి. మహదేవన్
గీతరచయిత : ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం : బాలు, సుశీల
పల్లవి :
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది.. హహహ
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చరణం 1 :
పుణ్యకాలం దాటిపోయింది...
పొంగు కాస్త ఆరిపోయింది
పుణ్యకాలం దాటిపోయింది...
పొంగు కాస్త ఆరిపోయింది
పుణ్యకాలం ముందు ముందుంది...
పొంగు ఆరని వయసు మనకుంది
వెళ్ళనీయ్ నన్నింటికి...
ఈ వేడుక చాలీనాటికి..అహా..
వెళ్ళనీయ్ నన్నింటికి...
ఈ వేడుక చాలీనాటికి
వచ్చినట్టే వెళ్ళడానికి...
ఈ వల్లమాలిన పాట్లు దేనికి
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చరణం 2 :
ఎంత బాగుంది?...
ఏం బాగుంది?..ఊం...
ఈ గాలి... చలి వేస్తోంది
ఈ తోటా... భయమేస్తోంది
ఆకాశం.. నలుపెక్కింది
నా ఆశా... కొండెక్కింది
ఈ గాలి... చలి వేస్తోంది
ఈ తోటా... భయమేస్తోంది
ఆకాశం.. నలుపెక్కింది
నా ఆశా... కొండెక్కింది
ఈ చాటు సరసాలు..
ఈ దొంగ సరదాలు
ఈ వయసుకుండాలి...
జలసాలు
వాటికే వెయ్యాలి పగ్గాలు
చీకటి పడుతోంది... \
జంటలు చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చరణం 3 :
మగాడికేమీ తెగింపు వస్తుంది...
ఆడపిలకు బిగింపు సొగసైంది...
సొగసులు చూస్తే నోరు ఊరుతుంది...
బిగువులు చూస్తే తెగింపు పుడుతుంది..
తప్పంతా వయసుది...
అది హద్దులు దాటి పోతుంది
తప్పంతా వయసుది...
అది హద్దులు దాటి పోతుంది
హద్దులకైనా హద్దుంది..
అది మరీ లాగితే తెగిపోతుంది
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
చీకటి పడుతోంది...
జంటలు చేరే వేళయ్యింది.. హహహ...
చీకటి పడుతోంది...
ఇంటికి చేరే వేళయ్యింది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి