RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

27, జనవరి 2025, సోమవారం

నిన్నలేని అందమేదో | Ninnaleni Andamedo | Song Lyrics | Puja Phalam (1964)

నిన్నలేని అందమేదో



చిత్రం : పూజాఫలం (1964)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి నారాయణ రెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి:


నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో

తెలియరాని రాగమేదో 

తీయ సాగెనెందుకో... 

తీయ సాగెనెందుకో.. నాలో...


నిన్నలేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదుర లేచెనెందుకో


చరణం 1:


పూచిన ప్రతి తరువొక వధువూ

పువుపువ్వున పొంగెను మధువు

ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో


చరణం 2:


తెలి నురుగులె నవ్వులుకాగా

సెలయేరులు కులుకుతు రాగా

కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో... 

నిదురలేచెనెందుకో


చరణం 3:


పసిడి అంచు పైట జారా

ఆ... ఓ...

పయనించే మేఘ బాల

అరుణ కాంతి సోకగానే పరవశించెనే


నిన్న లేని అందమేదో 

నిదురలేచెనెందుకో 

నిదురలేచెనెందుకో....


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఓ మహాత్మా ఓ మహర్షి | O Mahatma O Maharshi | Song Lyrics | Akali Rajyam (1980)

ఓ మహాత్మా ఓ మహర్షి చిత్రం: ఆకలి రాజ్యం (1980)  సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్  గీతరచయిత: ఆచార్య ఆత్రేయ  నేపధ్య గానం: బాలు  పల్లవి:  ఓ మహాత్మా......

పాటల ధనుస్సు పాపులర్ పాటలు