RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
jamuna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jamuna songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

19, జులై 2026, ఆదివారం

ఎవరన్నారివి కన్నులని | Evarannarivi Kannulani | Song Lyrics | Dorikithe Dongalu (1965)

ఎవరన్నారివి కన్నులని 


చిత్రం : దొరికితే దొంగలు (1965)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, సుశీల 


పల్లవి : 


ఎవరన్నారివి కన్నులని

ఎవరన్నారివి కన్నులని

అరెరె మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని

ఎవరన్నారివి బుగ్గలని

హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి

ఎవరన్నారివి కన్నులని  


చరణం 1 : 


నడుమిది ఏమంటున్నది?

ఈ నడుమిది ఏమంటున్నది?

నా పిడికిట ఇమడెదనన్నది

నల్లని జడ ఏమన్నది?

నా నల్లని జడ ఏమన్నది?

అది నను బంధించెద నన్నది

నను బంధించెదనన్నది


ఎవరన్నారివి కన్నులని

అరెరె మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని

హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి 


చరణం 2 : 


సిగ్గులు దోసిట దూయకు

నా సిగ్గులు దోసిటదూయకు

నీ చేతుల బందీ చేయకు

నీ చేతుల బందీ చేయకు

మెల్లగ లోలో నవ్వకు

మెలమెల్లగ లోలో నవ్వకు

చలచల్లగ పిడుగులు రువ్వకు

చల్లగ పిడుగులు రువ్వకు


ఎవరన్నారివి కన్నులని

అరెరె మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని

హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి


చరణం 3 :


అడుగున అడుగిడుటెందుకు?

నా అడుగున అడుగిడుటెందుకు?

నువు తడబడి పోతున్నందుకు

మరి మరి చూచెదవెందుకు?

నను మరి మరి చూచెదవెందుకు?

నువు మైకం లో ఉన్నందుకు

మైకంలో ఉన్నందుకు


ఎవరన్నారివి కన్నులని

అరెరె మధువొలికే గిన్నెలవి

ఎవరన్నారివి బుగ్గలని

హోయ్ ఎర్రని రోజా మొగ్గలవి


- పాటల ధనుస్సు 


ఎవరికి తెలియదులే యువకుల సంగతి | Evariki Teliyadule | P Susheela Song Lyrics | Dorikithe Dongalu (1965)

ఎవరికి తెలియదులే యువకుల సంగతి 


చిత్రం : దొరికితే దొంగలు (1965)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : పి.సుశీల 

 

పల్లవి : 


అహహా.. ఓహోహో.. 

అహహహా.. ఓ..ఓ..ఓ..

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..


ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి


ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి

యువకుల సంగతి... 

మీ తలబిరుసుల సంగతి


ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి


చరణం 1 :


ఆడపిల్ల కనబడితే 

ఏడిపించబోతారు

ఆడపిల్ల కనబడితే 

ఏడిపించబోతారు

ఏడిపించి మేను మరచి 

ఎగిరి నవ్వుకుంటరు

నవ్వి నవ్వి చివరకు 

నవ్వులపాలౌతారు


ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి

ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి


చరణం 2 :


లేనిపోని డాబులతో.. 

లెక్కలేని కోతలతో...

లేనిపోని డాబులతో.. 

లెక్కలేని కోతలతో...

గడుసుగడుసు మాటలతో.. 

మిడిసిపాటు చేతలతో...

కాలరెత్తి తిరుగుతారు... 

కాళ్ళబేరమాడతారు


హ...ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి

ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి


చరణం 3 :


ముందు తీగలేకుంటే... 

పందిరితో పని ఉందా?

ముందు తీగలేకుంటే... 

పందిరితో పని ఉందా?

పునాదులే లేకుంటే... 

భువిని గోడ ఉంటుందా?

ఆ.. పునాదులే లేకుంటే... 

భువిని గోడ ఉంటుందా?


తరుణులసలు లేకుంటే... 

పురుషుల పని గోవిందా...

తరుణులసలు లేకుంటే... 

పురుషుల పని గోవిందా...

గోవిందా... గోవిందా... హహ


ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి

యువకుల సంగతి... 

మీ తలబిరుసుల సంగతి

ఎవరికి తెలియదులే... 

యువకుల సంగతి


- పాటల ధనుస్సు 


ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి | Evariki Teliyadule | Song Lyrics | Dorikithe Dongalu (1965)

ఎవరికి తెలియదులే ఇంతుల సంగతి 


చిత్రం : దొరికితే దొంగలు (1965)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దాశరథి 

నేపధ్య గానం : ఘంటసాల


పల్లవి : 


ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి

ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి

ఇంతుల సంగతి 

పూబంతుల సంగతి


ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి


చరణం 1 : 


జడలో మల్లె పూల 

జాతర చేస్తుంటారు

జడలో మల్లె పూల 

జాతర చేస్తుంటారు

బంగారు పెదవులపై 

రంగులు పూస్తుంటారు

బంగారు పెదవులపై 

రంగులు పూస్తుంటారు


ఈ సోకులన్నీ 

ఇంకెవరి కోసమంటారు

ఈ సోకులన్నీ 

ఇంకెవరి కోసమంటారు

ఈ సోకులన్నీ 

ఇంకెవరి కోసమంటారు... హా


ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి

ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి


చరణం 2 : 


ముసిముసి నగవులతో... 

మిసమిస చూపులతో

ముసిముసి నగవులతో... 

మిసమిస చూపులతో

దాచుకున్న తలపులతో... 

దోచుకున్న వలపులతో

దాచుకున్న తలపులతో... 

దోచుకున్న వలపులతో


మొదట కసరి కొడతారు 

పిదప చల్లబడతారు

మొదట కసరి కొడతారు 

పిదప చల్లబడతారు

మొదట కసరి కొడతారు 

పిదప చల్లబడతారు


ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి

ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి


చరణం 3 :


పందిరి లేకుంటే... 

తీగ పైకి పోతుందా

పందిరి లేకుంటే... 

తీగ పైకి పోతుందా

గోడలు లేకుంటే 

గోపురమే ఉంటుందా

గోడలు లేకుంటే 

గోపురమే ఉంటుందా


పురుషులు లేకుంటే... 

తరుణుల పని గోవిందా

పురుషులు లేకుంటే... 

తరుణుల పని గోవిందా

పురుషులు లేకుంటే... 

తరుణుల పని గోవిందా... 

గోవిందా... హా..


ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి

ఇంతుల సంగతి 

పూబంతుల సంగతి

ఎవరికి తెలియదులే 

ఇంతుల సంగతి


- పాటల ధనుస్సు 


18, జూన్ 2026, గురువారం

నీ జిలుగుపైట నీడలోన నిలువని | Nee Jilugupaita Needalona | Song Lyrics | Poola Rangadu (1967)

నీ జిలుగుపైట నీడలోన నిలువని 


చిత్రం :  పూల రంగడు (1967)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


నీ నడుముపైన చేయి వేసి 

నడువని... నన్ను నడువని

నీ చేతుల చెరసాలలోన.. 

చేరని.. నన్ను చేరని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగువేసి 

నడువని... నన్ను నడువని


చరణం 1:


చిక్కని బుగ్గలపై 

చిటికెలు వేయని

సన్నని నవ్వులలో 

సంపెంగలేరని

గులాబి పెదవులనే.. 

అలా అలా చూడని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగులేసి 

నడువని...నన్ను నడువని


చరణం 2:


పచ్చిగ తిన్నెలలో 

వెచ్చగ సాగని

వెచ్చని వెన్నెలలో 

ముచ్చటలాడని

ముచ్చటలాడి ఆడి 

మురిసి మురిసి పాడని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగు వేసి 

నడువని.... నన్ను నడువని


చరణం 3:


మబ్బుల వాడలో 

మనసులు కూడని

మల్లెల మేడలో 

మమతలు పండని

ఆ...ఆ...ఆ...ఆ..ఆ...


మబ్బుల వాడలో 

మనసులు కూడని

మల్లెల మేడలో 

మమతలు పండని

బంగారు కోవెలలో 

కొంగులు ముడివేయని

బంగారు కోవెలలో 

కొంగులు ముడివేయని


- పాటల ధనుస్సు 


17, జూన్ 2026, బుధవారం

మిస మిసలాడే చినదానా | Misa Misalade Chinadana | Song Lyrics | Poola Rangadu (1967)

మిస మిసలాడే చినదానా


చిత్రం  : పూల రంగడు (1967)

సంగీతం  : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత  : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం  : ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


మిస మిసలాడే చినదానా...

ముసి ముసి నవ్వుల నెరజాణ

సిగ్గులు చిలికి సింగారమొలికి..

చేరగ రావేమే.. 

నా చెంతకు రావేమే


సొగసరి చూపుల చినవాడా..

గడసరి మాటల మొనగాడా

సరసాలాడే సరదా తీరే...

సమయం రానీయరా ....

ఆ సమయం రానీయరా


చరణం 1:


చారెడు కళ్ళకు కాటుక పెట్టి...

దోసెడు మల్లెలు సిగలో చుట్టి

చారెడు కళ్ళకు కాటుక పెట్టి...

దోసెడు మల్లెలు సిగలో చుట్టి

చిలకలాగ నువు కులుకుతు ఉంటే...

ఒలికి పోతదే నీ సొగసు

ఉలికి పడతదే నా మనసు....


కులుకు చూసి నువు ఉలికితివా...

తళుకు చూసి నువు మురిసితివా

కులుకు చూసి నువు ఉలికితివా...

తళుకు చూసి నువు మురిసితివా

కులుకును మించి తళుకును మించి...

వలపుని దాచితి లేరా

అది కలకాలం నీదేరా...


మిస మిస లాడే చినదాన ..

ముసి ముసి నవ్వుల నెరజాణ

సిగ్గులు చిలికి సింగారమొలికి...

చేరగ రావేమే..

నా చెంతకు రావేమే


చరణం 2:


ఏటి గట్టున ఇల్లు కట్టుకొని...

నీటి అద్దమున నీడ చూసుకోని

ఏటి గట్టున ఇల్లు కట్టుకొని...

నీటి అద్దమున నీడ చూసుకోని

గువ్వల జంటగ నువ్వు నేను...

కువ కువ లాడుతు ఉందామా

కొత్త రుచులు కనుగోందామా...


కళ్ళు కళ్ళు కలిసిన నాడే...

మనసు మనసు తెలిసిన నాడే..ఓ..ఓ..

కళ్ళు కళ్ళు కలిసిన నాడే...

మనసు మనసు తెలిసిన నాడే..

నీవు నేను ఒకటైనామని...

కోవెల గంటలు తెలిపెనులే

దీవెనలై అవి నిలిచెనులే...

దీవెనలై అవి నిలిచెనులే...


మిస మిస లాడే చినదాన...

ముసి ముసి నవ్వుల నెరజాణ

సిగ్గులు చిలికి సింగారమొలికి..

చేరగ రావేమే..

నా చెంతకు రావేమే


సొగసరి చూపుల చినవాడా..

గడసరి మాటల మొనగాడా

సరసాలాడే సరదా తీరే...

సమయం రానీయరా ....

ఆ సమయం రానీయరా 


- పాటల ధనుస్సు 


23, ఏప్రిల్ 2026, గురువారం

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు | Thotalo Naaraju | Song Lyrics | Ekaveera (1969)

తోటలో నా రాజు తొంగి చూసెను నాడు


చిత్రం: ఏకవీర (1969)

సంగీతం: కె.వి. మహదేవన్

గీతరచయిత: సి.నారాయణరెడ్డి 

నేపథ్య గానం: ఘంటసాల, సుశీల


పల్లవి:


తోటలో నా రాజు 

తొంగి చూసెను నాడు

నీటిలో ఆ రాజు 

నీడ నవ్వెను నేడు

తోటలో నా రాజు 

తొంగి చూసెను నాడు

నీటిలో ఆ రాజు 

నీడ నవ్వెను నేడు


చరణం 1:


నవ్వులా అవి.. కావు

నవ్వులా అవి కావు... 

నవ పారిజాతాలు

నవ్వులా అవి కావు.. 

నవ పారిజాతాలు

రవ్వంత సడిలేని.. 

రసరమ్య గీతాలు

రవ్వంత సడిలేని.. 

రసరమ్య గీతాలు

ఆ రాజు ఈ రోజు అరుదెంచునా

ఆ రాజు ఈ రోజు అరుదెంచునా

అపరంజి కలలన్నీ 

చిగురించునా


తోటలో నా రాజు 

తొంగి చూసెను నాడు

నీటిలో ఆ రాజు 

నీడ నవ్వెను నేడు


చరణం 2:


చాటుగా పొదరింటి 

మాటుగా ఉన్నాను

చాటుగా పొదరింటి 

మాటుగా ఉన్నాను

పాటలాధర రాగ 

భావనలు కన్నాను

చాటుగా పొదరింటి 

మాటుగా ఉన్నాను

పాటలాధర రాగ 

భావనలు కన్నాను


ఎలనాగ నయనాల 

కమలాలలో దాగి

ఎలనాగ నయనాల 

కమలాలలో దాగి

ఎదలోన కదలే 

తుమ్మెద పాట విన్నాను

ఎదలోన కదలే 

తుమ్మెద పాట విన్నాను


ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ

ఆ పాట నాలో తియ్యగ మ్రోగనీ

అనురాగ మధుధారయై సాగనీ

ఊఁహూఁహుఁ.. ఊఁహూఁహుఁ.. 

ఉఁహుఁహుఁ.... ఊఁహూఁహుఁ..


తోటలో నా రాజు 

తొంగి చూసెను నాడు

నీటిలో ఆ రాజు 

నీడ నవ్వెను నేడు


- పాటల ధనుస్సు 


25, మార్చి 2026, బుధవారం

పగడాల జాబిలి చూడు | Pagadala Jabili Chudu | Song Lyrics | Mooga Nomu (1969)

పగడాల జాబిలి చూడు   


చిత్రం : మూగ నోము (1969)

రచన : సి.నారాయణరెడ్డి   

సంగీతం : ఆర్ గోవర్ధనం 

గానం : ఘంటసాల, పి సుశీల 


పల్లవి :


పగడాల జాబిలి చూడు

గగనాల దాగెను నేడు

వేయి అందాల నారాజు

అందిన ఈరోజు ఎందుకులే

నెలరేడు


పగడాల జాబిలి చూడు

గగనాల దాగెను నేడు

కోటి అందాల నా రాణి అందిన

ఈరేయి ఎందుకులే నెలరేడు


చరణం:1


మనసు మనసు గుస గుస లాడెను

పెదవి పెదవి కువ కువ లాడెను

మనసు మనసు గుస గుస లాడెను

పెదవి పెదవి కువ కువ లాడెను


ఆకాశ దీపాలు శయనించెను

నాకళ్ళు నీకళ్ళు పయనించెను

ఆకాశ దీపాలు శయనించెను

నాకళ్ళు నీకళ్ళు పయనించెను


పగడాల జాబిలి చూడు

గగనాల దాగెను నేడు

కోటి అందాల నా రాణి అందిన

ఈరేయి ఎందుకులే నెలరేడు

ఆ.. ఆ..ఆ...ఆ...ఆ...

ఆ.. ఆ..ఆ...ఆ...ఆ...


చరణం:2


బంగరు మమతలు పొంగులు వారెను

కొంగులు రెండు ముడివడి పోయెను

బంగరు మమతలు పొంగులు వారెను

కొంగులు రెండు ముడివడి పోయెను


గుడిలోని దేవుడు దీవెంచెను

నా జడలోని పువ్వులు తిలకించెను

గుడిలోని దేవుడు దీవెంచెను

నా జడలోని పువ్వులు తిలకించెను


పగడాల జాబిలి చూడు

గగనాల దాగెను నేడు

కోటి అందాల నా రాణి అందిన

ఈరేయి ఎందుకులే నెలరేడు..


- పాటల ధనుస్సు 


22, ఫిబ్రవరి 2026, ఆదివారం

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు | Eevela Nalo Enduko | Song Lyrics | Mooga Nomu (1969)

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు



చిత్రం :  మూగనోము (1969)

సంగీతం :  ఆర్. గోవర్ధన్

గీతరచయిత :  దాశరథి

నేపధ్య గానం :  ఘంటసాల, సుశీల



పల్లవి :


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... 

లోలోన ఏవో విరిసెలే వలపులు

ఈ వేళ నాలో ఎందుకో ఆశలు... 

లోలోన ఏవో విరిసెలే వలపులు


నీలోని ఆశలన్నీ నా కోసమే... 

నా పిలుపే నీలో వలపులై విరిసెలే

నీలోని ఆశలన్నీ నా కోసమే... 

నా పిలుపే నీలో వలపులై విరిసెలే


చరణం 1 :


నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. 

నీ మాటలో మధువులే పొంగిపోయే

నీ చూపులో స్వర్గమే తొంగి చూసే.. 

నీ మాటలో మధువులే పొంగిపోయే


నాలోని ఆణువణువు నీదాయెలే..

బ్రతుకంతా నీకే అంకితం చేయనా..


నీలోని ఆశలన్నీ నా కోసమే.. 

నా పిలిపే నీలో వలపులై విరిసెలే..

లా ... లాలలా... లలలా... లా...


చరణం 2 :


నీ రూపమే గుండెలో నిండిపోయే... 

నా స్వప్నమే నేటితో పండిపోయే

నీ రూపమే గుండెలో నిండిపోయే... 

నా స్వప్నమే నేటితో పండిపోయే


ఉయ్యాల జంపాల ఊగేములే..

కలకాలం మనకు ప్రేమయే ప్రాణము..


ఈ వేళ నాలో ఎందుకో ఆశలు.. 

లోలోన ఏవో విరిసెలే వలపులు

లా ...లా ...లా ... లాలలా లాలలా... 

ఊ హూ హు..


- పాటల ధనుస్సు 



21, ఫిబ్రవరి 2026, శనివారం

ఊరు మారినా ఉనికి మారునా | Ooru Marina Uniki Maruna | Song Lyrics | Mooga Nomu (1969)

ఊరు మారినా ఉనికి మారునా


చిత్రం :  మూగనోము (1969)

సంగీతం :  ఆర్. గోవర్ధన్

గీతరచయిత :  ఆరుద్ర

నేపధ్య గానం :  ఘంటసాల


పల్లవి :


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా

ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


మరలిరాని పయనంలో...  

మజిలీ లేదు

ఆడదాని కన్నీటికి అంతేలేదు 


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


చరణం 1 :


అనురాగ దీపం...  అసమాన త్యాగం

స్త్రీజాతి కొరకే సృజియించె 

దైవంచిరునవ్వులన్నీ...  

పెరవారికొసగిచీకటులలోనే 

జీవించు యువతి


తలపులే వీడవు...  

వీడేది మనిషేవలపులే వాడవు...  

వాడేది తనువే


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా


చరణం 2 : 


మగవానికేమో... ఒకనాటి సుఖమూ

కులకాంతకదియే...  కలకాల ధనమూ

తనవాడు వీడా ... అపవాదు తోడా

పదినెలలమోతా...  చురకత్తి కోతా


సతులకే ఎందుకు ఈ ఘోరశిక్ష

సహనమే స్త్రీలకూ...  శ్రీరామరక్ష


ఊరు మారినా...  ఉనికి మారునా

మనిషి దాగినా...  మమత దాగునా

ఊరు మారినా...  ఉనికి మారునా


- పాటల ధనుస్సు 


11, జనవరి 2026, ఆదివారం

మనసా కవ్వించకే నన్నిలా | Manasa Kavvinchake Nannila | Song Lyrics | Pandanti Kapuram (1972)

మనసా కవ్వించకే నన్నిలా


చిత్రం:  పండంటి కాపురం (1972)

సంగీతం:  ఎస్ పి కోదండపాణి

గీతరచయిత:  మైలవరపు గోపి

నేపధ్య గానం:  పి. సుశీల 


పల్లవి:


మనసా... కవ్వించకే నన్నిలా

ఎదురీదలేక కుమిలేను నేనూ

సుడిగాలిలో చిక్కినా నావను

మనసా... కవ్వించకే నన్నిలా... 


చరణం 1:


ఆనాడు వెన్నెల నేనై 

కరిగాను కౌగిలిలోనా

ఈనాడు చీకటి లాగా 

మిగిలాను చీకటిలోనా

నేనోడిపోయి గెలుపొందినాను

నేనోడిపోయి గెలిపొందినాను

గెలిచానని నవ్వనా.... 

ఏడ్వనా....  ఆ..ఆ..

మనసా... కవ్వించకే నన్నిలా...


చరణం 2:


మోముపై ముంగురులేమో 

వసివాడి మల్లియలాయే

గుండెలో కోరికలన్నీ 

కన్నీటి చారికలాయే

ఏ తీవెకైనా కావాలి తోడూ..

ఏ తీవెకైనా కావాలి తోడు

నా జీవితం శాపమా... పాపమా....  

ఆ..ఆ..

మనసా... కవ్వించకే నన్నిలా... 


చరణం 3:


ఎగిరింది కడలి కెరటం 

ఆ నింగి స్నేహం కోసం

ఎగిరింది కడలి కెరటం 

ఆ నింగి స్నేహం కోసం

ఏనాటికైనా అవి చేరువౌన...

కెరటానికి నింగికి స్నేహమా...


మనసా... కవ్వించకే నన్నిలా

ఎదురీదలేక కుమిలేను నేనూ

సుడిగాలిలో చిక్కినా నావను

మనసా... కవ్వించకే నన్నిలా...


- పాటల ధనుస్సు 


3, జనవరి 2026, శనివారం

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట | Malli Malli Padali Eepata | Song Lyrics | Mattilo Manikyam (1971)

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట


చిత్రం : మట్టిలో మాణిక్యం (1971)

సంగీతం : సత్యం

గీతరచయిత : మైలవరపు గోపి

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి:


ఆ...ఆ..ఆ..ఆ

అహా...ఆ...ఆ..ఆ..


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...

నీ బ్రతుకంత కావలి పూలబాట..

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...

నీ బ్రతుకంత కావలి పూలబాట..

పచ్చగా నూరేళ్ళు వుండాలని ...

నా నెచ్చలి కలలన్ని పండాలని

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... 

నీ బ్రతుకంత కావలి పూలబాట..


చరణం 1:


హృదయమనేదీ ఆలయము.... 

స్నేహం దేవుణి ప్రతిరూపమూ..ఊ..

హృదయమనేదీ ఆలయము.. 

స్నేహం దేవుణి ప్రతిరూపమూ..

కులమేదైన.. మతమేదైనా...

కులమేదైన.. మతమేదైనా..

దానికి లేదు ఆ బేధమూ...


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....

నీ బ్రతుకంత కావలి పూలబాట..


చరణం 2:


ఆశలు ఉంటాయి అందరికి .. 

అది నెరవేరేది కొందరికే..

ఆశలు ఉంటాయి అందరికి .. 

అది నెరవేరేది కొందరికే..

ఆనందాల తేలే వేళ...

ఆనందాల తేలే వేళ ... 

అభినందనలు ఈ చెలికి..


మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట...

నీ బ్రతుకంత కావలి పూలబాట..

పచ్చగా నూరేళ్ళు వుండాలని...

నా నెచ్చలి కలలన్ని పండాలని

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట....

నీ బ్రతుకంత కావలి పూలబాట..


- పాటల ధనుస్సు 



29, డిసెంబర్ 2025, సోమవారం

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో | Virisina Vennelavo | Song Lyrics | Bandipotu Dongalu (1968)

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో


చిత్రం: బందిపోటు దొంగలు (1968)

సంగీతం: పెండ్యాల

గీతరచయిత: దాశరథి

నేపధ్య గానం: ఘంటసాల


పల్లవి:


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో …

విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


చరణం 1:


సిగలో గల జాబిల్లి 

చిరునగవులు చిందగా.. 

ఆ... ఆ... ఆ...

సిగలో గల జాబిల్లి 

చిరునగవులు చిందగా..

అడుగడుగున హంసలు 

ఒయ్యారము లొలుకగా

వెదికే పెదవులతో .. 

తొణికే మధువులతో..

వెదికే పెదవులతో .. 

తొణికే మధువులతో

పొందుగోరి చెంతజేరి 

మురిపించే నా చెలీ …


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


చరణం 2:


కరుణలేని శిలనైనా 

కరిగించే నవ్వుతో.. 

ఓ.. ఓ.. ఓ.. ఓ...

కరుణలేని శిలనైనా 

కరిగించే నవ్వుతో..

ముల్లునైన మల్లియగా 

మలచే కనుదోయితో

నడిచే తీగియవై.. 

పలికే దీపికవై..

నడిచే తీగియవై... 

పలికే దీపికవై..

అవతరించి ఆవరించి 

అలరించే నా చెలీ ..


విరిసిన వెన్నెలవో పిలిచిన కోయిలవో

తీయని కోరికవో చెలీ చెలీ నీవెవరో

విరిసిన వెన్నెలవో … ఓ ఓ ఓ ఓ ఓ …


- పాటల ధనుస్సు 


కిలాడి దొంగా డియో డియో | Killadi Donga Diyo Diyo | Susheela | Song Lyrics | Bandipotu Dongalu (1968)

కిలాడి దొంగా డియో డియో


చిత్రం : బందిపోటు దొంగలు (1968)

సంగీతం : పెండ్యాల

గీతరచయిత : ఆరుద్ర

నేపధ్య గానం : పి.సుశీల 



పల్లవి : 


ఏయ్ కిలాడీ..

కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో

కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


చరణం 1 : 


వాలింది పుట్టపై వల్లంకిపిట్టే

దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే

ఆ..వాలింది పుట్టపై వల్లంకిపిట్టే

దాన్నిపట్టాగ ఎక్కావు..మొనగా చెట్టే  


గుండెలో ఏదేదో..గుబులు పుట్టింది..

ఈ..ఈ..హోయ్

అణిచితే అదికాస్త..అడ్డుతిరిగింది..

అహాహాహాహా


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో        


చరణం 2 :


మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా

కత్తిపూవుగమారే..కంగారుపడక

మెత్తమెత్తని వాడా..మేనత్తకొడుకా

కత్తిపూవుగమారే..కంగారుపడక

వన్నెచిన్నెలు  దోచ..వలవేయనేల

కన్నె వలపందుకో..కన్నయ్యదొంగా..ఆ 


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


చరణం 3 :


వేషాలు వేసేవు..వెర్రి నారాజా

నీ వేషాలు వెలితిగా..వెల్లడైపోయే

హా హా హా హా హా హా ఆ

వేషాలు వేసేవు..వెర్రి నారాజా

వేషాలు వెలితిగా..వెల్లడైపోయే

తెలుసుకో ఓరయ్యో..

తెలుసుకో మనసు

అహా ఉహు అహా ఉహు 

అహా ఉహు అహా ఉహు

తెలుసుకో తెలుసుకో తెలుసుకో..

మనసు

నీ..ఈ..టెంపరి తనమంత..

తెల్లారిపోయే


కిలాడి దొంగా..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో

నీ లలాయి బూటకం..డియో డియో


- పాటల ధనుస్సు 


పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు