RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

18, జూన్ 2026, గురువారం

నీ జిలుగుపైట నీడలోన నిలువని | Nee Jilugupaita Needalona | Song Lyrics | Poola Rangadu (1967)

నీ జిలుగుపైట నీడలోన నిలువని 


చిత్రం :  పూల రంగడు (1967)

సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : సి.నారాయణరెడ్డి 

నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశీల 


పల్లవి:


నీ నడుముపైన చేయి వేసి 

నడువని... నన్ను నడువని

నీ చేతుల చెరసాలలోన.. 

చేరని.. నన్ను చేరని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగువేసి 

నడువని... నన్ను నడువని


చరణం 1:


చిక్కని బుగ్గలపై 

చిటికెలు వేయని

సన్నని నవ్వులలో 

సంపెంగలేరని

గులాబి పెదవులనే.. 

అలా అలా చూడని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగులేసి 

నడువని...నన్ను నడువని


చరణం 2:


పచ్చిగ తిన్నెలలో 

వెచ్చగ సాగని

వెచ్చని వెన్నెలలో 

ముచ్చటలాడని

ముచ్చటలాడి ఆడి 

మురిసి మురిసి పాడని


నీ జిలుగుపైట నీడలోన 

నిలువని... నన్ను నిలువని

నీ అడుగులోన అడుగు వేసి 

నడువని.... నన్ను నడువని


చరణం 3:


మబ్బుల వాడలో 

మనసులు కూడని

మల్లెల మేడలో 

మమతలు పండని

ఆ...ఆ...ఆ...ఆ..ఆ...


మబ్బుల వాడలో 

మనసులు కూడని

మల్లెల మేడలో 

మమతలు పండని

బంగారు కోవెలలో 

కొంగులు ముడివేయని

బంగారు కోవెలలో 

కొంగులు ముడివేయని


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

నీ జిలుగుపైట నీడలోన నిలువని | Nee Jilugupaita Needalona | Song Lyrics | Poola Rangadu (1967)

నీ జిలుగుపైట నీడలోన నిలువని  చిత్రం :  పూల రంగడు (1967) సంగీతం :  ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత : సి.నారాయణరెడ్డి  నేపధ్య గానం : ఘంటసాల, పి.సుశ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు