RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

17, జూన్ 2026, బుధవారం

నీవు రావు నిదురరాదు | Neevu Ravu Niduraradu | Song Lyrics | Poola Rangadu (1967)

నీవు రావు నిదురరాదు


చిత్రం : పూల రంగడు (1967)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

గీతరచయిత : దాశరథి

నేపధ్య గానం : పి.సుశీల 


పల్లవి:


నీవు రావు నిదురరాదు... 

నిలిచిపోయే ఈ రేయి

నీవు రావు నిదురరాదు...


చరణం 1:


తారా జాబిలి ఒకటై... 

సరసమాడే ఆ రేయి ..ఈ ఈ .....

ఆ ఆ ఆ ఆ.....

తారా జాబిలి ఒకటై... 

సరసమాడే ఆ రేయి...

చింతా  చీకటి ఒకటై...

చిన్నబోయే ఈ రేయి


నీవు రావు..

నీవు రావు నిదురరాదు... 

నిలిచిపోయే ఈ రేయి

నీవు రావు నిదురరాదు..


చరణం 2:


ఆశలు మదిలో విరిసే... 

దోసిట విరులై కురిసే

ఆలయాన చేరి చూడ..

ఆలయాన చేరి చూడ...

స్వామికానరాడాయే..

నా స్వామికానరాడాయె...


కౌగిలిలో ఒదిగిపోయే... 

కలలుగనే వేళాయే

కౌగిలిలో ఒదిగిపోయే... 

కలలుగనే వేళాయే

ఎదురుచూసి ఎదురుచూసి...

ఎదురుచూసి ఎదురుచూసి... 

కన్నుదోయి అలసిపోయె


నీవు రావు..

నీవు రావు నిదురరాదు...

నిలిచిపోయే ఈ రేయి

నీవు రావు నిదురరాదు


- పాటల ధనుస్సు 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

స్వేచ్ఛ కోసం ఉద్యమించిన | స్వాతంత్ర్యదినోత్సవ పాట | Swechakosam | Song Lyrics | RK Duvvu | RKSS Creations

స్వాతంత్ర్యదినోత్సవ పాట  స్వేచ్ఛ కోసం ఉద్యమించిన రచన : రామకృష్ణ దువ్వు  Production : RKSS Creations... సాకి:   స్వేచ్ఛ కోసం ఉద్యమించిన...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు