RKSS Creations

RKSS Creations
Subscribe the Channel

23, జూన్ 2026, మంగళవారం

బంతిపూల మేడ గట్టి | Bantipoola Medagatti | Folk Song | RK Duvvu | RKSS Creations

బంతిపూల మేడ గట్టి 


జానపద గీతం 

రచన : రామకృష్ణ దువ్వు  


పల్లవి: 


అతడు :

బంతిపూల మేడగట్టి 

మల్లెపూల మంచమేసి

మనసులోన నిన్ను పెట్టి

వేచి చూస్తూ వున్నానే


ఆమె:  

కలువపూల తేరు గట్టి

వెన్నెలంత గొడుగు పట్టి

మరదలి మీద ఒట్టు పెట్టి

మోసుకొని పో మామ


చరణం 1:


అతడు: 

కొమ్మమీద గూడువుంది 

గూటిలోన గువ్వ వుంది

కమ్మనైన బువ్వ వుంది

గోలపెట్టే ఈడు వుంది

అందమైన తోడు కోసం

వయసుచేసే తొందరుంది


ఆమె:    

గొంతులోన కోకిలుంది

గుండెలోన రాగముంది

సొగసులోన తీగవుంది

 మేనిలోన మెరుపు వుంది

పొందుకోరే మామ కోసం

విందులీయ సిద్ధమంది


చరణం 2:


అతడు: 

సూరీడి చురుకు వుంది

సందమామ రూపముంది

సుడిగాలి పోటు వుంది

మెరక చేను పాటు వుంది

కొండవాగు దాటి వస్తే

ఇంటి దాన్ని సేసుకుంటా


ఆమె:

కందిరీగ కళ్ళదాన్ని

కారు మబ్బు కురుల దాన్ని

కమ్మనైన వంటకాలు

ముద్దు కలిపి మూటకడతా

అయ్యనడిగి వన్నె కాడ

నా చేయి అందుకోరా…


- రామకృష్ణ దువ్వు


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ | Akasanni Chudu Talavanchadu | Motivational Song Lyrics | RK Duvvu | RKSS Creations.

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ  ప్రేరణ  గీతం  రచన : రామకృష్ణ దువ్వు  Album: RKSS Creations... పల్లవి: ఆకశాన్ని చూడు  తలవంచదు ఎప్పుడూ తనవైపు చ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు