RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
rk duvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
rk duvvu లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

3, సెప్టెంబర్ 2026, గురువారం

జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి | Janmastami Srikrishna Janmastami | Song Lyrics | RKSS Creations

 శ్రీకృష్ణ జన్మాష్టమి పాట


జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి

రచన : రామకృష్ణ దువ్వు

 

సాకి:


పరిత్రాణాయ సాధూనాం

వినాశాయ చ దుష్కృతామ్ |

ధర్మసంస్థాపనార్థాయ

సంభవామి యుగే యుగే ||

 

పల్లవి:


జన్మాష్టమి శ్రీకృష్ణ 

జన్మాష్టమి

పాలకడలిని వీడి 

నాగ శయనమీడి

మధురా నగరిలో 

చెరసాల నందు

రోహిణీ నక్షత్ర 

అష్టమి తిథి లోన

దేవకి దేవి 

అష్టమ గర్భమందు

జన్మించెను భగవానుడు 

జన్మించెను…

 

చరణం 1:


ధరణిలో పెరుగుతున్న 

దానవకాండ

ధర్మానికి పట్టెను గదా 

దమనకాండ

అవనికి తీరని 

వ్యథ లే కలుగంగ

శాంతిని స్థాపన చేయగ 

ఆ హరియే

శ్రీకృష్ణునిగ 

జన్మించిన సుదినం…

 

చరణం 2:


బాలుడైనను పలు 

రక్కసుల తృంచె

కాళీయ పడగలణచి 

నాట్యమాడెనే

జగతికి జ్ఞానమొసగ 

గీతను భోధించె

కుజనుల కూల్చధర్మ 

యుద్ధము చేయించె

ధర్మ చక్రమును 

స్థిరముగ ధరను నిలపె

 

- రామకృష్ణ దువ్వు

14, ఆగస్టు 2026, శుక్రవారం

స్వేచ్ఛ కోసం ఉద్యమించిన | స్వాతంత్ర్యదినోత్సవ పాట | Swechakosam | Song Lyrics | RK Duvvu | RKSS Creations

స్వాతంత్ర్యదినోత్సవ పాట 


స్వేచ్ఛ కోసం ఉద్యమించిన

రచన : రామకృష్ణ దువ్వు 

Production : RKSS Creations...


సాకి:

 

స్వేచ్ఛ కోసం ఉద్యమించిన

భరతవీరుల రక్తధారలు

ఎరువుగా తడిసిన ఈ నేల

పచ్చని పైరులై వెలసినది …

సస్యశ్యామల మైనది ..

వసుధలోన భరతావని …

 

పల్లవి:

 

కరము కరము కలిపి

గొంతున గొంతు నిలిపి

కులము మతము విడిచి

స్వేచ్ఛ కొరకు నడిచి


నిప్పు కణికలైనారు 

స్వాతంత్ర్య యోధులు

పరాయి పాలనను 

భగ్గున మండించారు

స్వతంత్ర చిరుజల్లులు 

కురిపించారు

 

చరణం 1:

 

నేతాజీ పౌరుషం …

గాంధీజీ సంయమనం ..

నెహ్రూజీ నేతృత్వం …

వల్లభాయి వీరత్వం…

అల్లూరి అమరత్వం…

పుణికి పుచ్చుకున్న మనం

దేశ మాత రక్షణ లో

సరిహద్దుల కావలిలో

వీరజవాను భుజాన వేలాడే

తుపాకిలో తూటాలుగ 

మారదాం …

 

చరణం 2:

 

మన మధ్యన చిచ్చు పెట్టి

పబ్బాలు గడుపుకునే

విదేశీ మోతుబరుల

గుండెల్లో నిదరోదాం …

కులమతాల గోడలను

కలసి ఒకటిగ కూల్చేసి ..

భారతీయతే మన మతమని

మనమంతా ఒకటేనని 

చాటుదాం…

 

- రామకృష్ణ దువ్వు


28, జులై 2026, మంగళవారం

కనులు మూసినా అదేమిటో | Kanulu Moosina Ademito | Love Feel Song | Lyrics | RK Duvvu | RKSS Creations

కనులు మూసినా అదేమిటో..

ప్రేమ గీతం 

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 



పల్లవి:


కనులు మూసిన అదేమిటో 

ఆమె రూపం మరుగున పడకుంది

ఒళ్ళంతా మైకం కమ్మి 

మధురంగా వుంది 

నా కళ్ళూ మనసూ చిత్రంగా 

మాట వినకుంది …

ఇదేమిటి అని తలపోస్తే 

అదే ప్రేమని తెలిసింది 

ప్రేమని తెలిసింది…


చరణం 1:


రోజూ వీచే గాలైనా 

ఈరోజేంటో వింతగ వుంది

ఈలలు వేసి సైగలు చేస్తుంది 

తోటలో పూచిన గులాబీ 

మరింత మెరిసింది 

ఆమెను గురుతుకు తెచ్చింది 

ప్రేమజల్లులో మనసే తడిసింది

చిందులు వేస్తూ ప్రియా 

ప్రియా నీకై వెదకింది …


చరణం 2:


ఎండలో వేడి ఎంతున్నా 

ఆమె తలపులు వెన్నలలాగ వుంది

కురిసే ప్రతి చినుకూ

ఇరువురి పైనా చిలికింది 

సరిగంగ తానాలు చేసింది 

చలిగాలి తాకిన వణకిన మేను

చెలికై వెచ్చని గుండెను చూపింది

చెలీ నీకై వేచింది…


- రామకృష్ణ దువ్వు


నా జీవిత వనమున విరిసిన కుసుమము | స్నేహ గీతం | Friendship Song Lyrics | RK Duvvu | RKSS Creations

నా జీవిత వనమున విరిసిన కుసుమము 

స్నేహ గీతం (female)

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నా జీవిత వనమున విరిసిన 

కుసుమము నీ స్నేహమే చెలీ …

ఈ ఊపిరి వున్నంత వరకు విడువను 

నిన్ను నా ప్రాణమైన నెచ్చెలి..


చరణం 1:


పూవును నేనైతే పుప్పొడి నీవు

పరిమళమే మన చెలిమి

తోటలో నావెంట తోడుగ నీవుంటే

ప్రతి తరువూ ఫలముల పంటే 


ఆ దేవుడు దిగివచ్చి 

వరములు నాకిస్తే

బ్రతుకంతా చెలీ 

నీ స్నేహము చాలంటాను


చరణం 2:


మబ్బును నేనైతే నీరువు నీవు

కురిసే చిరుజల్లు మన స్నేహం 

కిరణం నేనైతే కాంతివి వీవు

ప్రతి బింబాలు మన బంధాలు 


నా నేస్తం తోడుంటే 

జీవన గతిలో

ముళ్ళబాటలున్నా 

పూలబాటలవును


- రామకృష్ణ దువ్వు



23, జులై 2026, గురువారం

నిన్నటి వరకు అనుకున్నానా | Ninnativaraku Anukunnana | Romantic Feeling Song Lyrics | RKSS Creations

నిన్నటి వరకు అనుకున్నానా 


Romantic Feeling Song

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నిన్నటి వరకు అనుకున్నానా

కలువ పువ్వు నే నౌతానని

చిలిపి చంద్రునికై చూస్తానని

సొగసు భారమై పోతుందని

వలపు తీపిగా అవుతుందని


నిన్నటి వరకు అనుకున్నానా..


చరణం 1:


తలార స్నానం చేసి నే 

తడారబెట్టుకొనుంటే 

నీలి కురుల మాటున 

మోమును దాచుకొనుంటే

గండు తుమ్మెదల్లె ఆ 

దుండగీడు చెలరేగే


చిగురుటాకు పెదవులపై 

దొంగ ముద్రనే వేసే

ఇదేమి వింతో ఏమయ్యిందో…

కోపమన్నదే రాకున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


చరణం 2:


బెట్టు చేస్తున్న నా 

తుంటరి సొగసును

గుట్టుగా నే 

పట్టు చీరలో చుట్టబెట్టగా


ఎట్టా చిక్కెనో చక్కని నడుము 

ఆ చుక్కల రేనికి

ఉక్కిరిబిక్కిరి చేయగ నన్ను 

చెక్కలిగింతలు చేసెనే

అదేమి దుడుకో ఏడ దాగెనో..

మనసు వాడికై వెదకుతున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


- రామకృష్ణ దువ్వు


7, జులై 2026, మంగళవారం

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు | వీరూ పుట్టినరోజు పాట | Birthday Song Veeru Lyrics | RKSS Creations

కన్నతల్లి కళ్ళల్లో ఆనందపు వెలుగులు


వీరూ పుట్టినరోజు పాట

రచన : రామకృష్ణ దువ్వు 

Production : RKSS Creations...

 

సాకి:

 

ప్రతిరోజూ ఉదయించును 

ఆ సూర్యుడు

ఈరోజే జన్మించెను 

మా శివ విరాజుడు

పున్నమి నాడే అగుపించును 

పూర్ణ చంద్రుడు

ప్రతిరోజూ వెన్నెల కురిపించు 

ఈ నెలబాలుడు

 

పల్లవి:

 

కన్నతల్లి కళ్ళల్లో 

ఆనందపు వెలుగులు

కన్నతండ్రి గుండెల్లో 

ఆశల సౌధాలు

ఆనందాలను ఆరబోసి

ఆకాశం దిగి వచ్చింది

మా యింట మొదలైంది వేడుక

నీ పుట్టిన రోజు వేడుక

పుట్టిన రోజు వేడుక

 

హేపీ బర్త్ డే వీరూ

హేపీ బర్త్ డే వీరూ

 

చరణం 1:

 

నిరంతరం వెలుగును 

ఇచ్చే దినకరుడు

నీకు స్ఫూర్తి ప్రదాత కావాలి

పాలకడలిలో 

పుట్టిన చంద్రుడు

నీమోమున నిలచి 

అందమౌను

నిన్న మొన్నటి 

పసి అడుగులు

విజయాల బాటలపై 

సాగుతున్నాయి

 

చరణం 2:

 

అందరి మురిపాల 

ముద్దు బాలుడు

అక్కమాట జవదాటని 

మేటి తమ్ముడు

చదువులందు వెలుగొందే 

తొలి విద్యార్థి

ఆటలైన పాటలైన 

ముందుండే పోరడు

దశవసంతాల 

జన్మదిన దీవెనలు

నూరేళ్ళ జీవితం 

సాగాలి హాయిగా

 

- రామకృష్ణ దువ్వు

RKSS Creations...




1, జులై 2026, బుధవారం

కన్ను మూసినా వెలుగే | వైజాగ్ యూత్ సాంగ్ | Kannu Moosina Veluge | Song Lyrics | RK Duvvu | RKSS Creations

 కన్ను మూసినా వెలుగే


వైజాగ్ యూత్ సాంగ్ 

రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

కన్ను మూసినా వెలుగే…

గుండె వెన్నెలై కరిగే!

అడుగు అడుగునా రేగే…

సోయగాల సడి కవ్వింతలే!

అంతులేని ఈ ఆనందాన్ని…

అంతా నీ సొంతమే చేసుకోరా…!


చరణం 1:

 

జగదాంబ జంక్షన్ లో 

జావళీలే పాడరా!

సిరిపురం సెంటర్ లో 

చిందలేసి ఆడరా!

అప్పన్న కొండపై ఆశీస్సులంది …

ఋషికొండలో ఖుషీ ఖుషీలు!

హుషారులోన కేరింతలు  కలిపి…

రాజీలేని రోజు గడపరా…!

 

చరణం 2:

 

రైలుబండి స్టేషన్ లో 

రాక్ అండ్ రోలే చెయ్యరా!

రేడియో స్టేషన్ లో 

పాప్ సాంగ్ పాడరా !

ఆర్కే బీచ్ లో ఆరంగేట్రం…

ఉడా పార్క్ లో మెగా ప్రోగ్రాం!

అవకాశాలనే అందుకొని…

ఆకాశానికి నిచ్చెన వెయ్యరా…!

 

- రామకృష్ణ దువ్వు

 

24, జూన్ 2026, బుధవారం

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ | Akasanni Chudu Talavanchadu | Motivational Song Lyrics | RK Duvvu | RKSS Creations.

ఆకశాన్ని చూడు తలవంచదు ఎప్పుడూ 


ప్రేరణ  గీతం 

రచన : రామకృష్ణ దువ్వు 

Album: RKSS Creations...


పల్లవి:


ఆకశాన్ని చూడు 

తలవంచదు ఎప్పుడూ

తనవైపు చూసేవాళ్ళ 

తలదించదు ఎన్నడూ

తనలో రగిలే 

సూర్యులు ఎందరున్నా

చినుకులు రాల్చి 

ఊపిరి నిల్పు అవనిపైనా


చరణం 1:


కారుచీకటి కమ్మినా 

నీపైనే గొడుగై కాచును

కంటికగుపడదని 

పలచన చేయక

దించిన తల ఎత్తి 

నింగిలోన వెదకు…

మెరిసే తారలు 

నీతో ఊసులాడు…

నిన్నుగాంచి 

తమవాడిగ చెలిమిచేసె

తారలకే తార 

నువ్వు సూపర్ తార…


చరణం 2:


చూసే ప్రతి దిక్కూ 

నీ కథలో దృశ్యాలు

నడచే ప్రతి మనిషి 

నీ తెరపై నటులు

ఎవరూ కనని 

కమనీయం నీ కావ్యం

హితులందరు 

చేతులు కలిపిన గమ్యం

అదిగో అదిగో కదలే 

బొమ్మల నీ సృష్టి

శిరసు ఎత్తి స్వీకరించు 

ఆ విజయమాల


- రామకృష్ణ దువ్వు



23, జూన్ 2026, మంగళవారం

బంతిపూల మేడ గట్టి | Bantipoola Medagatti | Folk Song | RK Duvvu | RKSS Creations

బంతిపూల మేడ గట్టి 


జానపద గేయం  

రచన : రామకృష్ణ దువ్వు  


పల్లవి: 


అతడు :

బంతిపూల మేడగట్టి 

మల్లెపూల మంచమేసి

మనసులోన నిన్ను పెట్టి

వేచి చూస్తూ వున్నానే


ఆమె:  

కలువపూల తేరు గట్టి

వెన్నెలంత గొడుగు పట్టి

మరదలి మీద ఒట్టు పెట్టి

మోసుకొని పో మామ


చరణం 1:


అతడు: 

కొమ్మమీద గూడువుంది 

గూటిలోన గువ్వ వుంది

కమ్మనైన బువ్వ వుంది

గోలపెట్టే ఈడు వుంది

అందమైన తోడు కోసం

వయసుచేసే తొందరుంది


ఆమె:    

గొంతులోన కోకిలుంది

గుండెలోన రాగముంది

సొగసులోన తీగవుంది

 మేనిలోన మెరుపు వుంది

పొందుకోరే మామ కోసం

విందులీయ సిద్ధమంది


చరణం 2:


అతడు: 

సూరీడి చురుకు వుంది

సందమామ రూపముంది

సుడిగాలి పోటు వుంది

మెరక చేను పాటు వుంది

కొండవాగు దాటి వస్తే

ఇంటి దాన్ని సేసుకుంటా


ఆమె:

కందిరీగ కళ్ళదాన్ని

కారు మబ్బు కురుల దాన్ని

కమ్మనైన వంటకాలు

ముద్దు కలిపి మూటకడతా

అయ్యనడిగి వన్నె కాడ

నా చేయి అందుకోరా…


- రామకృష్ణ దువ్వు





21, ఏప్రిల్ 2026, మంగళవారం

లక్షిత్ పుట్టినరోజు పాట | Lakshit Birthday Song | Chiru Chiru Navvula Kannayya | Song Lyrics | RKSS Creations

లక్షిత్ పుట్టినరోజు పాట 



చిరుచిరు నగవుల కన్నయ్యా

రచన : రామకృష్ణ దువ్వు 

Album : RKSS Creations


సాకి:


నంద గోకులమందు 

తిరుగాడిన కన్నయ్యా

పాలు మీగడల మక్కువ తీరక

మాయింట వెలసావా 

ఓ ముద్దు లల్లా …..


పల్లవి:


చిరుచిరు నగవుల కన్నయ్యా

నీ కన్నుల కురిసేను వెన్నెలయ్యా

బుడిబుడి నడకల చిన్ని లక్షితా

అడుగడుగున నీకు శ్రీరామ రక్ష 


శుక్లపక్ష చంద్రుడల్లె పెరగాలి నీవు

ప్రతియేటా నీకు జరగాలి పండుగ 

పుట్టినరోజు పండుగ …


హేపీ బర్త్ డే లక్షిత్ …

హేపీ బర్త్ డే లక్షిత్ …

హేపీ బర్త్ డే లక్షిత్ …



చరణం 1:


అమ్మానాన్నకు ఆరో ప్రాణం 

అందరికీ నీవు ముద్దుల మురిపెం

నీవు నడచినంతట నందన వనము 

దివిలోని దేవతలు ఇలలోని పెద్దల 

దీవెనలంది జీవించు నిండుగా …


చరణం 2:


రోలుకు కట్టని అమ్మ ప్రేమతో 

వానను తడపని నాన్న ఛాయలో 

కలియుగ దైవము సిరిపతి నీడలో 

అడుగు అడుగునా జయ గీతికలతో 

విజయుడవై నీవు వర్ధిల్లు లక్షితా …


- రామకృష్ణ దువ్వు …

16, ఫిబ్రవరి 2025, ఆదివారం

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ | Ettagayya Shiva | Song Lyrics | RKSS Creations...

 ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ



రచన : రామకృష్ణ దువ్వు  


 

పల్లవి:

 

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ

ఎట్టెట్టో కైలాసమట నువ్వట్టే వుంటావట

శివయ్యా …

అదెట్టో మరి మాకట్టాలు గట్టెక్కేందుకు

చుట్టమల్లే మా చుట్టే వుంటావట

శివయ్యా…

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ

 

చరణం 1:

 

మూడుకన్నులున్న గాని మూసుకొనే వుంటావట

ధ్యాన ముద్రలోనే నీవు జగాలన్నీ సూత్తావంట

 

చిన్న చీమకుట్టినంతనే కైలాసానికంపేవట

కన్నబిడ్డలల్లె మమ్ము కాచుకొంటూ వుంటావట

 

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ

 

చరణం 2:

 

ఆకలేస్తే నీవు జోలెకట్టి ఆలిమెట్టు తొక్కేవట

ఆకలంటే తెలీకుండా మమ్ము సూత్తావంట

 

ఆనె తోలు తోటేనీవు వళ్ళుకప్పుకునేవంట

పట్టుబట్టలెట్టి మాకు పట్టమే కట్టేవట

 

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ

 

చరణం 3:

 

ఇల్లువాకిలే లేక కొండలంట వుండేవట

బంగళాలలోన మమ్ము చల్లగా వుంచేవట

 

హాలాహలమనే విషము నువ్వు సేవించేవట

రోగమేమి రాకుండా మాకమృతాలు ఇచ్చేవట

 

ఎట్టాగయ్యా శివ అదెట్టాగయ్యా శివ


- RKSS Creations...




పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు