RKSS Creations

RKSS Creations
Subscribe the Channel
sitara songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
sitara songs లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

23, జులై 2026, గురువారం

నిన్నటి వరకు అనుకున్నానా | Ninnativaraku Anukunnana | Romantic Feeling Song Lyrics | RKSS Creations

నిన్నటి వరకు అనుకున్నానా 


Romantic Feeling Song

Production : RKSS Creations...

రచన : రామకృష్ణ దువ్వు 


పల్లవి:


నిన్నటి వరకు అనుకున్నానా

కలువ పువ్వు నే నౌతానని

చిలిపి చంద్రునికై చూస్తానని

సొగసు భారమై పోతుందని

వలపు తీపిగా అవుతుందని


నిన్నటి వరకు అనుకున్నానా..


చరణం 1:


తలార స్నానం చేసి నే 

తడారబెట్టుకొనుంటే 

నీలి కురుల మాటున 

మోమును దాచుకొనుంటే

గండు తుమ్మెదల్లె ఆ 

దుండగీడు చెలరేగే


చిగురుటాకు పెదవులపై 

దొంగ ముద్రనే వేసే

ఇదేమి వింతో ఏమయ్యిందో…

కోపమన్నదే రాకున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


చరణం 2:


బెట్టు చేస్తున్న నా 

తుంటరి సొగసును

గుట్టుగా నే 

పట్టు చీరలో చుట్టబెట్టగా


ఎట్టా చిక్కెనో చక్కని నడుము 

ఆ చుక్కల రేనికి

ఉక్కిరిబిక్కిరి చేయగ నన్ను 

చెక్కలిగింతలు చేసెనే

అదేమి దుడుకో ఏడ దాగెనో..

మనసు వాడికై వెదకుతున్నదీ…


నిన్నటి వరకు అనుకున్నానా…


- రామకృష్ణ దువ్వు


3, జులై 2025, గురువారం

చిరునవ్వు పుట్టిందీరోజు | Chirunavvu Puttindi | Aadya Birthday song | RKSS Creations

 చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో



రచన : రామకృష్ణ దువ్వు

 

పల్లవి:

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 1:

 

ఆకశాన ముగ్గులతో చుక్కలమరె చక్కగా

చుక్కల రధమెక్కి నెలఱేడు ఇలకేగెనే

ఆద్య మోమున నిలచెను ఆ రాకాశశి

నడచినంతట వెన్నెల విరబూయ

చిరుచిరు నడకల బంగరు బొమ్మ

నీ పుట్టినరోజు ఒక పండుగరోజు

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 2:

 

కన్నవారి కలల పైడి రూపానివి

నిన్నుకన్న కనుల కాంతి దీపానివి

చిరు నవ్వుల తోరణం నీవమ్మా

వెలుగులు పంచే దీపం మాయమ్మా

శుక్లపక్ష చంద్రుడల్లె ఎదగాలి నీవు

ఏటేటా జన్మ దినము జరపాలి మేము

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చరణం 3:

 

సన్నజాజి పువ్వులు విరిసినట్టు

చందమామ కాంతులు కురిసినట్టు

చిన్నారి పాప నవ్వులు పూసేనిట్టు

మా కంటి వెలుగు నీవేనమ్మా

మా గుండెలోన కొలువైనావమ్మా

పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

చిరునవ్వు పుట్టిందీరోజు ఇలలో

మరుమల్లె విరిసెను మా హృదిలో

ఈ చిట్టి దేవత నడయాడగా

మా ఇల్లు అయినది కోవెలగా

 

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ బర్త్ డే ఆద్యా

హేపీ హేపీ హేపీ బర్త్ డే

ఆద్యా …ఆద్యా … ఆద్యా…

 

- రామకృష్ణ దువ్వు

22, మే 2025, గురువారం

వయ్యారి కళ్ళల్లోనా దాచాడేమో తారల్ని | Vayyari Kallallona | Song Lyrics | RKSS Creations

 వయ్యారి కళ్ళల్లోనా దాచాడేమో తారల్ని


రొమాంటిక్ ప్రేమ  గీతం 

రచన : రామకృష్ణ దువ్వు 

 

పల్లవి:

 

వయ్యారి కళ్ళల్లోనా 

దాచాడేమో తారల్ని

బెమ్మయ్య కేమయ్యిందో 

కొమ్మకిచ్చే వరాల్ని

ఆ కళ్ళల్లో చూశామంటే 

పోలేమమ్మ మాదార్ని

గుండెల్ని పిండేస్తాది 

మాపై విసిరి చూపుల్ని

బతుకే వెలుగును భామను 

చేసుకుంటే సొంతాన్ని

 

చరణం 1:

 

నెలవంక నవ్వుల్లోనా 

వెలిగించాడేమో కాంతుల్ని

చిలకమ్మ పలుకుల్లోనా 

కురిపించాడేమో రాగాల్ని

ఆ నవ్వుల్లో తేలియాడితే 

మరిచేము ఈ లోకాన్ని

మాటలతో మాయ చేస్తాది 

మాపై చూపే ప్రేమల్ని

బ్రతుకంతా వెన్నెలౌను 

చెలియ చేరితే సరసన్ని

 

చరణం 2:

 

తొలిసారి చూపుల్లోనా 

కలిపాడేమో ఊహల్ని

తొలి పరిచయ క్షణాల్లోనా 

నింపాడేమో ఆశల్ని

ఆ ఊహల్లో విహరిస్తే 

మరిచేము ఇల తలపుల్ని

నడకలతో గిలిగింత పెడతది 

చిలికించి వలపుల్ని

స్వర్గమే చేరువౌను 

సతిగ పొందితే ఈ కోమల్ని


- RKSS Creations...

13, డిసెంబర్ 2024, శుక్రవారం

ఆశల పల్లకీ మోసుకు వచ్చావు | నూతన సంవత్సర ఆహ్వాన గీతం | RKSS Creations

 ఆశల పల్లకీ మోసుకు వచ్చావు



నూతన సంవత్సర ఆహ్వాన గీతం

రచన : రామకృష్ణ దువ్వు 

 

పల్లవి:

 

ఆశల పల్లకీ మోసుకు వచ్చావు

హాయినీ హర్షాల్ని పంచివచ్చావు

సంకల్ప దీపాలను వెలిగించావు

స్వాగతం నూతన సంవత్సరం…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

చరణం 1

 

గడచిన వెతలకు ముగింపు తెచ్చావు

పుడమిన జయముల మొలకలు నింపావు

నవోదయ కాంతులు జగతిన జల్లావు

ముందుకు సాగగ బాటలు చూపావు

 

జీవిత గమనంలో మరొక అంకురం

స్వాగతమిదే నూతన సంవత్సరం …

 

ఆశల పల్లకీ మోసుకు వచ్చావు

హాయినీ హర్షాల్ని పంచివచ్చావు

సంకల్ప దీపాలను వెలిగించావు

స్వాగతం నూతన సంవత్సరం…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

చరణం 2

 

అడుగు అడుగునా ఆనందం నింపావు

ప్రతిక్షణం జయమాలలు మాపై వేసావు

కడలి కలల తీరాలకు పడవై చేరావు

విలువైన మణులను తీసుకు వచ్చావు

 

శోభలతో ప్రతి ఇల్లు నిండుగా

శాంతులతో ప్రతి రోజూ పండుగే

 

ఆశల పల్లకీ మోసుకు వచ్చావు

హాయినీ హర్షాల్ని పంచివచ్చావు

సంకల్ప దీపాలను వెలిగించావు

స్వాగతం నూతన సంవత్సరం…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

హేపీ న్యూ ఇయర్ …

హేపీ హేపీ న్యూ ఇయర్…

 

- RKSS Creations...




18, నవంబర్ 2024, సోమవారం

మధు మధు నీ జన్మదినము | Madhu Madhu Nee Janmadinamu | Happy Birthday Song Lyrics | RKSS Creations

మధు మధు నీ జన్మదినము



రచన : రామకృష్ణ దువ్వు 

Production : RKSS Creations...

 

మధు మధు నీ జన్మదినము,

హార్దికమై సుగంధము

ఆనందమయి నిత్య సంతోషిణి,

నిర్మల హృదయపు మాధవి!

 

హేపీ బర్త్ డే టూ యూ

హేపీ బర్త్ డే టూ యూ

 

నీవే గృహ లక్ష్మిగా వెలుగును నీ ఇల్లు,

ప్రేమానురాగములు పంచెడి పతి తోడు

పిన్నమరాజు వంశ జ్యోతిగ వెలుగు నీవు

నీ అడుగుల పచ్చగ పుడమి మొలచు

 

మధు మధు నీ జన్మదినము, 

హార్దికమై సుగంధము

ఆనందమయి నిత్య సంతోషిణి,

నిర్మల హృదయపు మాధవి!

 

హేపీ బర్త్ డే టూ యూ

హేపీ బర్త్ డే టూ యూ

 

మంచికి మారు పేరు, సౌమ్య సౌజన్యము,

వంటల మారాణిగా నీకు సాటి నీవు

బంగారు తీగగా కదులు నీ స్కూటి పైన

ప్రతి తరువు పరిపరి నీ జాడ ఎంచ గలవు

 

మధు మధు నీ జన్మదినము,

హార్దికమై సుగంధము

ఆనందమయి నిత్య సంతోషిణి,

నిర్మల హృదయపు మాధవి!

 

హేపీ బర్త్ డే టూ యూ

హేపీ బర్త్ డే టూ యూ

 

చందనపు సౌశీల్యము నీ ఆభరణము,

మీ ఇంటికే అండగా నిలిచే చైతన్యము.

ఇరువురు బిడ్డల ప్రేమ ఒక సాగరమై,

సిరులశాంతి మా దీవెనలతొ చల్లగ జీవించు

 

మధు మధు నీ జన్మదినము,

హార్దికమై సుగంధము

ఆనందమయి నిత్య సంతోషిణి,

నిర్మల హృదయపు మాధవి!

 

హేపీ బర్త్ డే టూ యూ

హేపీ బర్త్ డే టూ యూ


- RKSS Creations...

పాటల ధనుస్సు పాపులర్ పాట

ఏమండోయ్ నిదుర లేవండోయ్ | Emandoy Nidura Levandoi | Song Lyrics | Chaduvukunna Ammayilu (1963)

ఏమండోయ్ నిదుర లేవండోయ్  చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: ఆశాలత కులకర్ణి పల్లవి: ఏ...

పాటల ధనుస్సు పాపులర్ పాటలు