నిన్నటి వరకు అనుకున్నానా
Romantic Feeling Song
Production : RKSS Creations...
రచన : రామకృష్ణ దువ్వు
పల్లవి:
నిన్నటి వరకు అనుకున్నానా
కలువ పువ్వు నే నౌతానని
చిలిపి చంద్రునికై చూస్తానని
సొగసు భారమై పోతుందని
వలపు తీపిగా అవుతుందని
నిన్నటి వరకు అనుకున్నానా..
చరణం 1:
తలార స్నానం చేసి నే
తడారబెట్టుకొనుంటే
నీలి కురుల మాటున
మోమును దాచుకొనుంటే
గండు తుమ్మెదల్లె ఆ
దుండగీడు చెలరేగే
చిగురుటాకు పెదవులపై
దొంగ ముద్రనే వేసే
ఇదేమి వింతో ఏమయ్యిందో…
కోపమన్నదే రాకున్నదీ…
నిన్నటి వరకు అనుకున్నానా…
చరణం 2:
బెట్టు చేస్తున్న నా
తుంటరి సొగసును
గుట్టుగా నే
పట్టు చీరలో చుట్టబెట్టగా
ఎట్టా చిక్కెనో చక్కని నడుము
ఆ చుక్కల రేనికి
ఉక్కిరిబిక్కిరి చేయగ నన్ను
చెక్కలిగింతలు చేసెనే
అదేమి దుడుకో ఏడ దాగెనో..
మనసు వాడికై వెదకుతున్నదీ…
నిన్నటి వరకు అనుకున్నానా…
- రామకృష్ణ దువ్వు

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి